debut as a heroine
-
నా కూతురికి దూరంగా ఉండాల్సి వస్తోంది : హీరోయిన్
‘అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్’ వంటి పలు చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ బ్యూటీ ప్రణీత. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన ప్రణీత మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. మలయాళ స్టార్ హీరో దిలీప్, దర్శకుడు రతీష్ రఘునందన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే: నయన్ సెన్సేషనల్ కామెంట్స్ దిలీప్ కెరీర్లో 148వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రణీత హీరోయిన్గా నటిస్తున్నారు. ‘‘మాలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మలయాళంలో డైలాగ్స్ చెప్పడం కాస్త కష్టంతో కూడినపనే.. ప్రస్తుతం నా ముందున్న చాలెంజ్ అదే. ఈ మూవీలో కాస్త అహం ఉన్న యువతి పాత్రలో కనిపిస్తాను. చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం నేను అమ్మగా మారిన తర్వాత ఒప్పుకున్న తొలి సినిమా ఇది. ఈ మూవీ కోసం నా కుమార్తె ఆర్నాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని నేను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను.. ఇందుకోసం కష్టపడతాను’’ అని పేర్కొన్నారు ప్రణీత. కాగా 2021 మే 30న నితిన్ రాజును వివాహం చేసుకున్న ప్రణీత గత ఏడాది ఆర్నాకు జన్మనిచ్చారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న శేఖర్‌మాస్టర్ కూతురు?
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఓ ప్రముఖ డ్యాన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన స్టార్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యాడు. ఒకవైపు సినిమాల్లో పనిచేస్తూనే మరెవైపు బుల్లితెరపై కూడా పలు షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీయెప్ట్ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్‌కి పేరుంది. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్ సహా డ్యాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటికే దీని కోసం ఓ కొత్త దర్శకుడు కథ చెప్పగా, శేఖర్ మాస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజ్ ఉన్న ఓ యంగ్ హీరోను ఈ సినిమాలో భాగం చేసేందుకు శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు
ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలా శ్రీ కుమార్తె రాథనా రామ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.'చాలెంజింగ్ స్టార్' దర్శన్‌తో కలిసి D56 వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ మెప్పించారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. 'రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్‌లైన్ నా సినిమాతో ప్రొడక్షన్లోని అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. మంచి టీమ్‌తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేసిన దీప్తి సునయన.. పోస్ట్ వైరల్
Deepthi Sunaina Reaction On Her Tollywood Debut Rumours, Post Inside: సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలుత డబ్స్ మ్యాష్ వీడియోలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయింది. ఇక రీసెంట్గా షణ్నూతో బ్రేకప్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తమ దారులు వేరంటూ 5ఏళ్ల రిలేషన్ షిప్‌కు ముగింపు పలికింది. బ్రేకప్ అనంతరం కెరీర్‌పై దృష్టి పెట్టిన దీప్తి సునయన త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానుందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన దీప్తి సునయన ఇది ఫేక్‌న్యూస్ అంటూ కొట్టి పారేసింది. ఇన్‌స్టాలో ఈ మేరకు ఫోటోను షేర్ చేస్తూ నేను హీరోయిన్‌గానా చేస్తున్నానా? ఈ విషయం నాకు తెలీదే అంటూ సెటైర్ వేసింది. దీంతో మొత్తానికి దీప్తి సునయన సిల్కర్ స్క్రీన్కు పరిచయం కానుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. -
అమ్మ..అమ్మాయి..ఓ కండిషన్!
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాహ్నవీ కపూర్ త్వరలో హీరోయిన్గా అరంగేట్రం చేయడానికి అంతా సిద్ధమైందనే వార్త ఎప్పట్నుంచో వినబడుతోంది. నెట్టింట్లో జాహ్నవి ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఒక్క సినిమాకీ ఆమె సంతకం చేయలేదు. లేటెస్ట్ బీ-టౌన్ న్యూస్ ప్రకారం... ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి కుమారుడు, ‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్, జాహ్నవి ఒకే సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయం కానున్నారట. మొదటి సినిమాతోనే జాహ్నవికి మంచి పేరు రావాలని శ్రీదేవి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంట్లోనే అమ్మాయికి యాక్టింగ్, డైలాగ్ డిక్షన్ తదితర అంశాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు. అంతే కాదండోయ్... కుమార్తెకు కొన్ని కండీషన్స్ కూడా పెట్టారట. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కండీషన్ ఎంటో తెలుసా?.. బాయ్‌ఫ్రెండ్స్, డేటింగ్ లాంటివి పక్కన పెట్టాలని చెప్పారట. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా, జాహ్నవిల లిప్-లాక్ ఫొటోలు నెట్టింట్లో ఎంత హంగామా చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మాయికి అవన్నీ చూపించి శ్రీదేవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ‘‘నేనూ టీనేజ్లోనే హీరోయిన్ అయ్యా. అప్పుడు మా అమ్మ చెప్పిన సలహాలు పాటించడం వలనే ఇప్పుడీ స్థాయికి వచ్చా. నేను చెప్పినట్టు ‘నో బాయ్‌ఫ్రెండ్, నో డేటింగ్’ కండిషన్‌కి కట్టుబడితేనే పైకొస్తావ్’’ అని అమ్మాయి జాహ్నవికి అమ్మగారు శ్రీదేవి హితబోధ చేశారట.