అమ్మ..అమ్మాయి..ఓ కండిషన్! | sridevi warn her daughter about dating | Sakshi
Sakshi News home page

అమ్మ..అమ్మాయి..ఓ కండిషన్!

Nov 11 2016 10:50 PM | Updated on Sep 4 2017 7:50 PM

అమ్మ..అమ్మాయి..ఓ కండిషన్!

అమ్మ..అమ్మాయి..ఓ కండిషన్!

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాహ్నవీ కపూర్ త్వరలో హీరోయిన్‌గా అరంగేట్రం చేయడానికి అంతా సిద్ధమైందనే

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాహ్నవీ కపూర్ త్వరలో హీరోయిన్‌గా అరంగేట్రం చేయడానికి అంతా సిద్ధమైందనే వార్త ఎప్పట్నుంచో వినబడుతోంది. నెట్టింట్లో జాహ్నవి ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఒక్క సినిమాకీ ఆమె సంతకం చేయలేదు. లేటెస్ట్ బీ-టౌన్ న్యూస్ ప్రకారం... ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి కుమారుడు, ‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్, జాహ్నవి ఒకే సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయం కానున్నారట. మొదటి సినిమాతోనే జాహ్నవికి మంచి పేరు రావాలని శ్రీదేవి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంట్లోనే అమ్మాయికి యాక్టింగ్, డైలాగ్ డిక్షన్ తదితర అంశాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు. అంతే కాదండోయ్... కుమార్తెకు కొన్ని కండీషన్స్ కూడా పెట్టారట.

మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కండీషన్ ఎంటో తెలుసా?.. బాయ్‌ఫ్రెండ్స్, డేటింగ్ లాంటివి పక్కన పెట్టాలని చెప్పారట. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా, జాహ్నవిల లిప్-లాక్ ఫొటోలు నెట్టింట్లో ఎంత హంగామా చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మాయికి అవన్నీ చూపించి శ్రీదేవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ‘‘నేనూ టీనేజ్‌లోనే హీరోయిన్ అయ్యా. అప్పుడు మా అమ్మ చెప్పిన సలహాలు పాటించడం వలనే ఇప్పుడీ స్థాయికి వచ్చా. నేను చెప్పినట్టు ‘నో బాయ్‌ఫ్రెండ్, నో డేటింగ్’ కండిషన్‌కి కట్టుబడితేనే పైకొస్తావ్’’ అని అమ్మాయి జాహ్నవికి అమ్మగారు శ్రీదేవి హితబోధ చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement