Actress Pranitha Subhash Gets Emotional After Watching The Kashmir Files Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Pranitha Subhash: ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత

Published Tue, Mar 15 2022 8:09 PM | Last Updated on Wed, Mar 16 2022 8:18 AM

Pranitha Subhash Gets Tears After Watching The Kashmir Files Movie - Sakshi

Pranitha Subhash Gets Tears After Watching The Kashmir Files Movie: గుండ్రని కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచిన చిన్నది ప్రణీత సుభాష్. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో; సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బాపుబొమ్మ సిద్ధార్థ్‌ సరసన హీరోయిన్‌గా 'బావ' మూవీలో నటించి మెప్పించింది. తర్వాత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ 'అత్తారింటింకి దారేది' సినిమాతో సెకండ్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం తెలుగులో అవకాశాలు లేక కనుమరుగైంది. సినిమాల మాట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ప్రణీత. ఈ సోషల్‌ మీడియా వేదికగా తను, ఆమె భర్త ఓ సినిమా చూసి ఏడ్చేశాం అని చెప్పుకొచ్చింది. 

చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'.. సినిమాలో ఏముంది ?

ప్రణీత తన ఇన్‌స్టా గ్రామ్‌ హ్యాండిల్‌లో ''మేము 'ది కశ్మీర్‌ ఫైల్స్' సినిమా వీక్షించాం. ఈ చిత్రం పూర్తయ్యేసరికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్‌ పండిట్స్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు.'' అని పోస్ట్ పెట్టింది. అలాగే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. కాగా 1980-90లలో కశ్మీర్‌లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా తెరకెక్కిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్‌, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కూడా ప్రకటించాయి. ఈ చిత్రాన్ని వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి డైరెక్ట్‌ చేశారు. 



చదవండి: డైరెక్టర్‌ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement