బికినీలో ప్రణీత?
Published Wed, Dec 11 2013 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
బాపుగారి సినిమాల్లో నటించకుండానే బాపుబొమ్మ అయి కూర్చుంది ప్రణీత. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మను అందరూ బాపు బొమ్మా అనే అంటున్నారు. ప్రస్తుతం ఈ బాపు బొమ్మ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో మొదటిది ఎన్టీఆర్ ‘రభస’ కాగా, రెండోది మంచు ఫ్యామిలీ సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెదా’. అయితే... ఈ రెండు చిత్రాల్లోనూ ప్రణీతను సెకండ్ హీరోయిన్ పాత్రలే వరించాయి.
తన తొలి విజయం ‘అత్తారింటికి దారేది’లో సెకండ్ హీరోయిన్ పాత్ర చేయడం వల్ల... తర్వాతి చిత్రాల్లో కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలే రావడం ప్రణీతను వేదనకు గురిచేస్తున్న అంశం. సాటి హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్‌ని పలికించినా... సరైన అవకాశాలు రాకపోవడంతో... తన అంబుల పొదిలోంచి చివరి అస్త్రాన్ని సంధించడానికి ప్రణీత సంసిద్ధమయ్యారు. తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో బికినీలో సాక్షాత్కరించబోతున్నారట. వెయిట్ అండ్ సీ.
Advertisement
Advertisement