Pranitha Subhash All Set For Re-Entry - Sakshi
Sakshi News home page

Pranitha Subhash: రీఎంట్రీ ఇస్తున్న బాపుబొమ్మ, నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు

Published Wed, May 3 2023 8:06 AM | Last Updated on Wed, May 3 2023 12:51 PM

Pranitha Subhash Ready for Re Entry - Sakshi

పెళ్లయితే నటనకు దూరం కావాలా అనేది నేటి తరం కథానాయికల ప్రశ్న. హీరోలు తాతలు అయిన తరువాత కూడా నటిస్తుంటే తమకేంటి తక్కువ అనే అభిప్రాయాన్ని హీరోయిన్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా తగ్గేదేలే అన్నట్టుగా పెళ్లయిన వెంటనే నటించడానికి సిద్ధమవుతున్నారు. నయనతార, హన్సిక, శ్రియ వంటి వారు ఈ కోవకు చెందిన వారే. ఇక కాజల్‌ అగర్వాల్‌ వంటి వారు పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి అయిన రెండు మూడు నెలల్లోనే నటించడానికిసై అంటున్నారు.

నటి ప్రణీత కూడా తానేమి తక్కువ తిన్నానా అన్నట్టుగా మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఈ కన్నడ బ్యూటీ 2010లో హీరోయిన్‌గా కన్నడ చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత తెలుగులోకి బావ చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆపై తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంలో నటుడు సూర్య, కార్తీ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టిన ప్రణీతకు ఇక్కడ పెద్దగా స్టార్‌ ఇమేజ్‌ రాలేదనే చెప్పాలి.

ఆ తరువాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తను 2021 మే 30న పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రణీత సినిమాలకు దూరమైనట్టే అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. అలా సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2022లో ఒక పాపకు జన్మనిచ్చారు. ఇటీవలే మలయాళ సినిమాలో నటించేందుకు సైన్‌ చేసింది ప్రణీత. చాలాకాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండటంతో తగిన కసరత్తులను చేసి స్లిమ్‌గా తయారవుతున్నారు. ఈ క్రమంలో గ్లామరస్‌తో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

చదవండి: ఇళయారాజా కుటుంబంలో తీవ్ర విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement