pranita
-
బంగారంలా మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్.. ఫోటోలు
-
కార్తీక సోమవారం: సురేఖవాణి, ప్రణీత, వాసంతి కృష్ణన్ కార్తీక శోభ (ఫోటోలు)
-
నిషా కళ్ల వయ్యారి.. చేస్తోంది జాదూగరి (ఫొటోలు)
-
రీఎంట్రీ ఇస్తున్న బాపుబొమ్మ, అందుకే ఈ గ్లామర్ ఫోటోలు..
పెళ్లయితే నటనకు దూరం కావాలా అనేది నేటి తరం కథానాయికల ప్రశ్న. హీరోలు తాతలు అయిన తరువాత కూడా నటిస్తుంటే తమకేంటి తక్కువ అనే అభిప్రాయాన్ని హీరోయిన్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా తగ్గేదేలే అన్నట్టుగా పెళ్లయిన వెంటనే నటించడానికి సిద్ధమవుతున్నారు. నయనతార, హన్సిక, శ్రియ వంటి వారు ఈ కోవకు చెందిన వారే. ఇక కాజల్ అగర్వాల్ వంటి వారు పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి అయిన రెండు మూడు నెలల్లోనే నటించడానికిసై అంటున్నారు. నటి ప్రణీత కూడా తానేమి తక్కువ తిన్నానా అన్నట్టుగా మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఈ కన్నడ బ్యూటీ 2010లో హీరోయిన్గా కన్నడ చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత తెలుగులోకి బావ చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆపై తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంలో నటుడు సూర్య, కార్తీ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ప్రణీతకు ఇక్కడ పెద్దగా స్టార్ ఇమేజ్ రాలేదనే చెప్పాలి. ఆ తరువాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను 2021 మే 30న పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రణీత సినిమాలకు దూరమైనట్టే అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. అలా సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2022లో ఒక పాపకు జన్మనిచ్చారు. ఇటీవలే మలయాళ సినిమాలో నటించేందుకు సైన్ చేసింది ప్రణీత. చాలాకాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండటంతో తగిన కసరత్తులను చేసి స్లిమ్‌గా తయారవుతున్నారు. ఈ క్రమంలో గ్లామరస్తో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) చదవండి: ఇళయారాజా కుటుంబంలో తీవ్ర విషాదం -
ఆమెతో మాట్లాడాక రిలీఫ్ అయ్యా: విష్ణు
హైదరాబాద్ : తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ ప్రణీతకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు హీరోలు ఆమెకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రణీత ఆదివారం ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా మోత వద్ద ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రణీతతో పాటు వాళ్ల అమ్మ, సాయకురాలు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఖమ్మం లో ఓ వస్త్ర దుకాణంలో ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ప్రణీత అనంతరం ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది. మినీ బస్సులో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ప్రణీత అక్కడ నుంచి బెంగళూరు వెళ్లింది. ప్రమాద వార్త తెలియడంతో హీరో నితిన్, మంచు విష్ణు..ప్రణీతకు ఫోన్ చేసి పరామర్శించారు. 'రియల్లీ ప్రణీతతో మాట్లాడిన తర్వాత రిలీఫ్ అయ్యా. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఆమె సేఫ్‌గా బయటపడింది. ఇది చూసి అయినా మనలో చాలామంది ఇకనుంచి సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది' అని మంచు విష్ణు ట్విట్ చేశాడు. డైనమెట్ చిత్రంలో మంచు విష్ణు, ప్రణీత కలిసి నటించారు. కాగా గతంలో మోతె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. Really relieved after talking to @pranitasubhash.God has been kind.she is safe cause of wearing the seat belt.Hope many of us learn frm this — Vishnu Manchu (@iVishnuManchu) February 14, 2016 -
మే 20న ఏడడుగుల బంధం
నటుడు మోహన్‌బాబు-నిర్మల దంపతుల ద్వితీయ కుమారుడైన యువ హీరో మనోజ్‌కూ, వ్యాపారవేత్త సత్యనారాయణ - ప్రవీణ దంపతుల ఏకైక కుమార్తె ప్రణతికీ వేద మంత్రాల సాక్షిగా వివాహ నిశ్చితార్థం జరిగింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్దయెత్తున హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి ఈ వేడుకకు హాజరై, కాబోయే దంపతులను ఆశీర్వదించారు. కేంద్రమాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, జస్టిస్ చలమేశ్వర్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు హాజరైనవారిలో ఉన్నారు. సినీ రంగం నుంచి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణలతో పాటు అంబరీష్, కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్, రామ్‌చరణ్‌లు సతీ సమేతంగా హాజరయ్యారు. జయప్రద, జయసుధ, అఖిల్, సుమంత్, వరుణ్ సందేశ్, తాప్సీ తదితరులు విచ్చేశారు. మనోజ్ పుట్టినరోజైన మే 20న వివాహం జరగనుంది. -
ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య పోటీ!
టాలీవుడ్ జులాయి సరసన నటించేందుకు ముగ్గురు అందమైన భామలు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు లీడ్ రోల్ చెయ్యడానికి గొడవపడుతున్నారనుకునేరు. అదేంకాదు. మూడో హీరోయిన్గా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌తో చిందులేయనున్నారు. ఈ చిత్రంలో బన్నీతో కలిసి నటించడానికి టాలీవుడ్ హీరోయిన్లు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. జులాయి తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడో హీరోయిన్గా నటించే ఛాన్స్ కోసం ఈ ముగ్గురు హీరోయిన్లు పోటీపడుతున్నారు. మలయాళ బ్యూటీ నయనతార, ఉహలు గుసగుసలాడే ఫేమ్ రాశీ ఖన్నా, ప్రణీత ఈ రేస్‌లో ఉన్నారని సమాచారం. ఈ మూవీలో అల్లు అర్జున్ ముగ్గురు హాట్ బ్యూటీస్‌తో రొమాన్స్ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత లీడ్ రోల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్గా రెండో హీరోయిన్గా నటించే అవకాశాన్ని హార్ట్ఎటాక్ ఫేమ్ ఆదా శర్మా సొంతంచేసుకుంది. మూడో హీరోయిన్ ఎంపిక జరుగవలసి ఉంది. ఈ పాత్రకు దాదాపు ప్రణీత ఫిక్స్ అయిందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ** -
చిత్తూరులో శ్రీనికేతన్ ప్రారంభం
చిత్తూరు (సిటీ), న్యూస్‌లైన్: చిత్తూరులోని హైరోడ్డు (స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఎదురుగా)లో శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్‌మాల్‌ను సోమవారం ప్రారంభిం చారు. విక్రయాలను ప్రముఖ సినీనటి ప్రణీత ప్రారంభించారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే సీకే బాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రస్తుతం తాను జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రభస సినిమాలో నటిస్తున్నానని ప్రణీత చెప్పారు. షోరూమ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజుకృష్ణ మాట్లాడుతూ రాష్ర్టంలో మూడవ షాపింగ్‌మాల్‌గా మారుమూలన ఉన్న చిత్తూరులో శ్రీనికేతన్ను ప్రారంభించామన్నారు. తమ షాపింగ్ మాల్లో మహిళల కోసం రూ. 20,000 నుంచి రూ. 3 లక్షల విలువగల కంచిపట్టు చీరలు, రూ. 300 నుంచి 30,000 ధర గల బెనారస్, కాంచీపురం, ఉప్పాడ, ఫ్యాన్సీ చీరలు, 0-14 సంవత్సరాలలోపు పిల్లల కోసం రూ.500 నుంచి 10,000 విలువ గల వివిధ రకాల కిడ్స్‌వేర్‌ను విక్రయానికి ఉంచామన్నారు. యువతుల కోసం గాగ్రాస్, సల్వార్స్, డ్రస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనికేతన్ షాపింగ్‌మాల్ డెరైక్టర్లు ్రపహ్లాద, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘అత్తారింటికి’ నకిలీ సీడీలు
బెంగళూరు, న్యూస్‌లైన్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నకిలీ డీవీడీలు, సీడీలు న గరంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పవన్ కల్యాణ్, సమంత, ప్రణిత కాంబినేషన్లో దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమా విడుదలకు ముందే సీడీలు బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్న సమయంలో నకిలీ డీవీడీలు, సీడీలు మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా పైరసి సీడీలు విక్రయించడంతో అభిమానులతో పాటు థియేటర్ల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసి చూడన ట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా నకిలీ డీవీడీలు విక్రయించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.