మే 20న ఏడడుగుల బంధం | edadugula bandham release on may 20th | Sakshi
Sakshi News home page

మే 20న ఏడడుగుల బంధం

Published Wed, Mar 4 2015 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

మే 20న ఏడడుగుల బంధం

మే 20న ఏడడుగుల బంధం

నటుడు మోహన్‌బాబు-నిర్మల దంపతుల ద్వితీయ కుమారుడైన యువ హీరో మనోజ్‌కూ, వ్యాపారవేత్త సత్యనారాయణ - ప్రవీణ దంపతుల ఏకైక కుమార్తె ప్రణతికీ వేద మంత్రాల సాక్షిగా వివాహ నిశ్చితార్థం జరిగింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్దయెత్తున హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి ఈ వేడుకకు హాజరై, కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

కేంద్రమాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, జస్టిస్ చలమేశ్వర్, నిమ్మగడ్డ ప్రసాద్  తదితరులు హాజరైనవారిలో ఉన్నారు. సినీ రంగం నుంచి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణలతో పాటు అంబరీష్, కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్, రామ్‌చరణ్‌లు సతీ సమేతంగా హాజరయ్యారు. జయప్రద, జయసుధ, అఖిల్, సుమంత్, వరుణ్ సందేశ్, తాప్సీ తదితరులు విచ్చేశారు. మనోజ్ పుట్టినరోజైన మే 20న వివాహం జరగనుంది.

 

 

 

 

 

 

 

 

 

 


 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement