marriage engagement
-
అమ్మో.. కుజదోషం! పెళ్లే అవదా?
వివాహం ఆలస్యమవడానికి కుజదోషం అసలు కారణం కానే కాదు. వివాహం ఆలస్యానికి గ్రహసంబంధమైన దోషాలు వాటి కారణాలు వేరేగా ఉంటాయి. ప్రజలలో అక్కరలేని అపోహలు కుజ దోషం మీద ఎక్కువయ్యాయి. ప్రధానంగా భర్తకు కుజదోషం ఉంటే భార్యకు నష్టం. భార్యకు కుజ దోషం ఉంటే భర్తకు నష్టం అని కుజదోష సంబంధమైన సూత్రాలలో ఉంటుంది. అసలు భార్యాభర్త అనే పదాలు వివాహం అనంతరం ప్రారంభం అవుతాయి కదా! వివాహం ముందు కాదు కదా! ఆలోచించవలసిన విషయమే! కుజ దోషం ప్రభావం కూడా వివాహం తర్వాతనే ప్రారంభం అవుతుంది అని స్పష్టంగా వాటికి సంబంధించిన శాస్త్రాలలో కనబడుతుంది. మరి నేటి సమాజంలో వ్యాపార ధోరణితో జరుగుతున్న వివాహం ఆలస్యానికి కుజదోషం కారణం అనేది ఎంత తప్పుదోవ పట్టించే అంశమో గుర్తించండి. కుజదోషం స్థాయిని అనుసరించి కలహములు, విడిపోవడం, మరణం, బలవన్మరణం వంటివి చెప్పాలి. కుజదోష శాంతి వివాహానికి ముందు చేయుట అజ్ఞానమే. మీరు శాంతి చేయించినా, శాంతి చేయించకున్నా వివాహ పొంతనలు చూసేటప్పుడు కుజదోషం ఉన్నవారికి ఉన్నట్టు గానే, కుజదోషం లేనివారికి కుజదోషం లేనట్టుగానే జాతకములు శోధన చేయవలెను. అందువలన వివాహ ఆలస్యానికి కుజదోషానికి వివాహాత్ పూర్వం చేసే శాంతికి సంబంధం లేదు. వివాహానంతరం కుజదోషం యొక్క ఉద్ధృతి తగ్గి, కుటుంబ సమస్యలు తగ్గడానికి సుబ్రహ్మణ్యారాధన, ఆంజనేయస్వామి ఆరాధన, భౌమ చతుర్థి వ్రతం, కృష్ణాంగారక చతుర్థి వ్రతం వంటివి ఆచరించటం చాలా అవసరం. ఇవి చదవండి: పెళ్ళి.. ఇద్దరి మధ్య వ్యవహారం కాదు -
పెళ్లి కుదిరింది! ఫోన్ మాట్లాడొద్దని తల్లి బెదిరించడంతో.. యువతి
నిర్మల్: తల్లి మందలించిందని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన పానుగంటి గంగవ్వ–పోషన్నలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. తండ్రి గతంలో మృతిచెందడంతో తల్లి గంగవ్వనే కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల పెద్ద కూతురు సాత్విక(22) పెళ్లి కుదిరింది. గత కొద్ది రోజులగా తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి ఆదివారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు వెంటనే నిర్మల్‌లోని ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహన్ని ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
నిశ్చితార్థం చేశారు.. పెళ్లి మరిచారు
అనంతపురం: వివాహ నిశ్చితార్థం జరిగి ఏడాదైనా పెళ్లి వాయిదా వేస్తుండడంతో మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్యకు సిద్ధమైంది. విషయాన్ని సకాలంలో గుర్తించిన స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన మేరకు...యాడికి మండలం రాయలచెరువు నివాసి నారాయణ మూడో కుమారుడు చరణ్‌కు బళ్లారికి చెందిన మేనత్త కుమార్తె భవితతో ఏడాది క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే తన రెండో కుమారుడి వివాహం తర్వాతనే చరణ్‌కు పెళ్లి చేస్తామంటూ నారాయణ దంపతులు భీష్మించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం బళ్లారి నుంచి తల్లితో పాటు అనిత రాయలచెరువుకు వచ్చి పెళ్లి చేసుకుందామని చరణ్‌ను అడిగింది. అన్న పెళ్లి జరిగేంత వరకూ ఆగాలని, లేకుంటే వచ్చే మాఘమాసంలో వివాహం చేసుకుందామని చరణ్ తెలిపాడు. దీంతో మనస్తాపం చెందిన భవిత... తాడిపత్రి మార్గంలోని రైలు పట్టాలపై చేరుకుని ఆత్మహత్యకు సిద్ధమైంది. ఒంటరిగా రైలు పట్టాలపై కూర్చొని ఏడుస్తున్న భవితను గమనించిన రైతులు ఆమెను చేరుకుని ఆరా తీశారు. అనంతరం విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి అక్కడకు చేరుకుని అనితను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాయలచెరువులోని చెక్‌పోస్టు వద్ద గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు తలారి నగేష్, గ్రామస్తుల సమక్షంలో ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఏడాది నవంబర్‌లో భవిత, చరణ్ వివాహం జరిగేలా నచ్చజెప్పి, అనితను అప్పగించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
చంద్రగిరి: ఓ పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు (కేఎల్30 ఏ 4995) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి (కోమలి శిల్క్ హౌస్) మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది. అయ్యా.. కాపాడండి.. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోగానే అందులో ఉన్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా, చీకట్లో వారికేమీ కనిపించలేదు. చిన్న పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుండగా, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. మరికొందరు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున సాయపడాల్సి వచ్చింది. ఒకరిని పైకి తీసుకొచ్చేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. లైట్లు ఒకరు పట్టుకొని, మరొకరు తాడు సాయంతో.. ఇలా ప్రమాదకర స్థితిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం అతివేగమే కారణం ప్రమాదకరమైన మలుపులు ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఈ బస్సు డ్రైవర్ ఎక్కువ వేగంతో నడిపినట్లు సమాచారం. నిత్యం ఈ రహదారిలో వెళ్లే డ్రైవర్లు మాత్రమే వేగంగా వెళ్లడానికి వీలుంటుంది. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంకులో బస్సుకు డీజిల్ పట్టించారు. ఆ సమయంలో బస్సును ముందుకు కదిల్చే క్రమంలో ర్యాష్ డ్రైవింగ్‌పై పలువురు డ్రైవర్‌ను హెచ్చరించారు. జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఘాట్ మొదటి మలుపు వద్దే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఐదు పల్టీలు కొట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనలో వధూ వరుల కుటుంబాల వారు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కాగా, 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు. -
మే 20న ఏడడుగుల బంధం
నటుడు మోహన్‌బాబు-నిర్మల దంపతుల ద్వితీయ కుమారుడైన యువ హీరో మనోజ్‌కూ, వ్యాపారవేత్త సత్యనారాయణ - ప్రవీణ దంపతుల ఏకైక కుమార్తె ప్రణతికీ వేద మంత్రాల సాక్షిగా వివాహ నిశ్చితార్థం జరిగింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్దయెత్తున హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి ఈ వేడుకకు హాజరై, కాబోయే దంపతులను ఆశీర్వదించారు. కేంద్రమాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, జస్టిస్ చలమేశ్వర్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు హాజరైనవారిలో ఉన్నారు. సినీ రంగం నుంచి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణలతో పాటు అంబరీష్, కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్, రామ్‌చరణ్‌లు సతీ సమేతంగా హాజరయ్యారు. జయప్రద, జయసుధ, అఖిల్, సుమంత్, వరుణ్ సందేశ్, తాప్సీ తదితరులు విచ్చేశారు. మనోజ్ పుట్టినరోజైన మే 20న వివాహం జరగనుంది. -
త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం!
‘‘గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. అదేంటంటే... మా అబ్బాయి మనోజ్ వివాహం ఖరారైంది’’ అని మోహన్‌బాబు అన్నారు. ఇంకా చెబుతూ - ‘‘మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్మేట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో పరిచయం అయ్యింది. రెండు రోజుల క్రితం మనోజ్,ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఓ శుభముహూర్తాన నిశ్చయ తాంబూలం, అనంతరం పెళ్లి జరుపుతాం. నాక్కాబోయే కోడలు ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ చేసింది’’ అని తెలిపారు. -
త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం!