త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం! | manchu manoj, pranitha reddy marriage engagement soon | Sakshi
Sakshi News home page

త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం!

Published Mon, Jan 26 2015 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం!

త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం!

‘‘గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. అదేంటంటే... మా అబ్బాయి మనోజ్ వివాహం ఖరారైంది’’ అని మోహన్‌బాబు అన్నారు. ఇంకా చెబుతూ - ‘‘మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్‌మేట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో పరిచయం అయ్యింది. రెండు రోజుల క్రితం మనోజ్,ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఓ శుభముహూర్తాన నిశ్చయ తాంబూలం, అనంతరం పెళ్లి జరుపుతాం. నాక్కాబోయే కోడలు ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ చేసింది’’ అని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement