పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నకిలీ డీవీడీలు, సీడీలు న గరంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.
బెంగళూరు, న్యూస్‌లైన్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నకిలీ డీవీడీలు, సీడీలు న గరంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పవన్ కల్యాణ్, సమంత, ప్రణిత కాంబినేషన్‌లో దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమా విడుదలకు ముందే సీడీలు బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు.
ఇప్పుడు సినిమా విడుదలై భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్న సమయంలో నకిలీ డీవీడీలు, సీడీలు మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా పైరసి సీడీలు విక్రయించడంతో అభిమానులతో పాటు థియేటర్ల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసి చూడన ట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా నకిలీ డీవీడీలు విక్రయించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.