దారిన పోయే రౌడీఫెలో : బాలకృష్ణుడు | Nara Rohith Bala krishnudu Teaser | Sakshi
Sakshi News home page

దారిన పోయే రౌడీఫెలో : బాలకృష్ణుడు

Published Sat, Sep 30 2017 1:15 PM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

Nara Rohith Bala krishnudu Teaser - Sakshi

విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నారా రోహిత్. కెరీర్ తొలినాళ్ల నుంచి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వస్తున్న రోహిత్ త్వరలో బాల కృష్ణుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇన్నాళ్లు లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న నారావారబ్బాయి ఈ సినిమాలో ఆరు పలకల దేహంతో కనిపించనున్నాడు.

నారా రోహిత్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ నీలాంబరి తరహా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా పేజ్ లో రిలీజ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement