
కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైన హీరో పవన్ కల్యాణ్. ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. వారం రోజుల ముందు నుంచే సంబరాలు ప్రారంభం అవుతాయి. దేశమంతా పవన్ పుట్టిన రోజు మార్మోగిపోయేలా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం ట్విటర్‌లో #HBDPowerStar ట్రెండింగ్ అవుతోంది. అటు సినీ సెలబ్రిటీలు సైతం హీరో 49వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. ఎవరెవరు పవన్‌కు విష్ చేశారో చూద్దాం...
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- చిరంజీవి
అద్భుతమైన పవన్ సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప జ్ఞానం మరింత గొప్ప బాధ్యతలను తీసుకువస్తుంది. మీరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా
- సమంత
హ్యాపీ బర్త్‌డే.. మీ వినయ విధేయత ఎప్పుడూ మార్పును ప్రేరేపిస్తాయి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి
- మహేశ్ బాబు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
- అల్లు అర్జున్
అద్భుతమైన మనిషి, నా ప్రియ స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నీకు ఆరోగ్యానందాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నా
- వెకంటేశ్
నాకు ఎంతో ఇష్టమైన పవన్ కల్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మంచి స్నేహితుడు, నిజమైన జెంటిల్‌మెన్ కూడా. నేడు సంతోషంగా గడపండి
- రవితేజ
హ్యాపీ బర్త్‌డే.. పవర్ స్టార్‌కు ఈ ఏడాది మరింత పవర్ ఫుల్‌గా ఉండాలని ఆశిస్తున్నా
- రకుల్ ప్రీత్ సింగ్
హ్యాపీ మ్యూజికల్ బర్త్‌డే పవన్ సర్. ఎల్లప్పుడూ నీ సినిమాలతో మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉండు
- దేవి శ్రీ ప్రసాద్
వీరు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వీరే కాక ఎంతో మంది సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. (సీరియస్ లుక్‌లో వపన్, అదిరిపోయిన మోషన్ పోస్టర్)
Comments
Please login to add a commentAdd a comment