List Of Tollywood Actors Whose Marriages Ended With Divorce, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

ChaySam Divorce: విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్స్‌ వీరే..

Published Sat, Oct 2 2021 4:50 PM | Last Updated on Sun, Oct 3 2021 12:49 PM

Tollywood Actors Whose Marriages Ended With Divorce - Sakshi

సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు.  అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం.  కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు.  తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.

నాగార్జున
నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు, కాని అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. నాగ చైతన్య అమ్మ లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమ వివాహాం చేసుకున్న నాగార్జున. 


కమల్‌ హాసన్‌
1978 లో, కమల్ హసన్ 24 సంవత్సరాల వయసులో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు.  కమల్ హాసన్ మరియు నటి సారిక 1988 లో కలిసి జీవించడం ప్రారంభించారు, వారి మొదటి బిడ్డ శ్రుతి హాసన్ (జననం 1986) జన్మించిన తరువాత వివాహం చేసుకున్నారు. 2002 లో ఈ జంట విడాకుల కోసం దాఖలు చేశారు,


పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నాడు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.


సుమంత్‌
అక్కినేని హీరో సుమంత్‌, నటి కీర్తిరెడ్డిలది ప్రేమ వివాహం. అయితే ఆ బంధం ఎంతో కాలం నిల‌వ‌లేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మ‌రో వ్య‌కిని పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయింది. సుమంత్ మాత్రం మ‌రో పెళ్లి చేసుకోలేదు

మంచు మనోజ్‌
మంచు మనోజ్‌, ప్రణతి రెడ్డిలది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. కొనాళ్లపాటు కలిసి ఉన్న వీరు.. విభేదాల కారణంగా ఇటీవల విడిపోయారు. 

సునీత
ప్రముఖ గాయని సునీతకు తొలిగా కిరణ్ తో వివాహమైంది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లలున్నారు. భర్తకు విడాకులిచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు.


ప్రకాశ్‌  రాజ్
ప్రకాష్  రాజ్ 1994లో నటి లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు-మేఘనా, పూజ మరియు ఒక కుమారుడు సిద్దూ ఉన్నారు. వీరిద్దరు 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు.



శరత్‌ బాబు
సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి, కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత స్నేహకు సైతం శరత్‌ బాబు విడాకులిచ్చారు.


రాధిక
ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతనకు విడాకులిచ్చారు రాధిక. రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు.


నాగచైతన్య-సమంత
నాగచైతన్య-సమంతల వివాహం  2017, అక్టోబర్‌ 7 జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరు 2021లో విడిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement