kamal haassan
-
Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడం, ఆ ఆతర్వాత కోర్టు కేసులతో దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో కమల్ హాసన్ సెట్స్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: Rakul Preet Singh: ‘ఇండియన్ 2’ సెట్లో అడుగుపెట్టిన రకుల్) ఈ ఫోటోల్లో దర్శకుడు శంకర్, కమల్ చర్చించుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కమల్ సెట్స్‌లో అడుగు పెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అందాల భామ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటోంది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. #Indian2 from today. @Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE — Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022 -
అలా చేయాలంటే మేము బయటకు వెళ్లాలి: కమల్ హాసన్
Kamal Haasan About Shankar Indian 2 Says We Cant Sit With One Movie: నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు (ఉలగ నాయగన్) కమల్ హాసన్ వెండితెరపై సందడి చేశాడు. తాజాగా ఆయన నటించిన 'విక్రమ్: హిట్ లిస్ట్' మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కమల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో 'భారతీయుడు 2' (ఇండియన్ 2) గురించి మాట్లాడారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమాపై కమల్ స్పందనను యాంకర్ కోరగా ఈ వ్యాఖ్యలు చేశాడు. భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అయితే కరోనా, సెట్లో ప్రమాదం ఇలా రకరకాల కారణాలతో సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా షూటింగ్ కంటిన్యూ చేశాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా వాళ్లతో ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇంకో 40 శాతం షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఒక చిత్రంపైనే పదేళ్లు పని చేయలేం కదా. రాజ్ కమల్ ఫిల్మ్స్ అని నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్‌కి ఎస్. ప్రొడక్షన్స్ ఉంది. ఈ రెండు చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటిని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి. అని కమల్ హాసన్ పేర్కొన్నారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
‘విక్రమ్’ సెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన కమల్
కరోనా పాజిటివ్‌తో కొన్నాళ్లు ఐసోలేషన్‌లో ఉన్న కమల్‌హాసన్ ఇటీవల సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ‘విక్రమ్’ సినిమా షూట్‌లోకి కూడా ఎంటర్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ఆరంభమైంది. అప్పటినుంచి పలు షెడ్యూల్స్ జరిగాయి. ఇంకొన్నాళ్లు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుందన్న పరిస్థితిలో అనుకోకుండా కమల్ కరోనా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి కాంబినేషన్లో సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ‘‘చిన్న బ్రేక్ తర్వాత స్టార్ (కమల్ని ఉద్దేశించి) షూట్‌కి వచ్చారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు’’ అన్నారు లోకేశ్. #ACTION from the sets of VIKRAM#Vikram_release_onsummer2022 #Vikram #KamalHaasan @ikamalhaasan @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial @RKFI @turmericmediaTM @APIfilms @SonyMusicSouth @girishganges @philoedit @MrRathna @anbariv @ArtSathees pic.twitter.com/RBBCsvfPmN — Raaj Kamal Films International (@RKFI) December 22, 2021 -
విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్స్ వీరే..
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం. కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం. నాగార్జున నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు, కాని అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. నాగ చైతన్య అమ్మ లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమ వివాహాం చేసుకున్న నాగార్జున. కమల్ హాసన్ 1978 లో, కమల్ హసన్ 24 సంవత్సరాల వయసులో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు. కమల్ హాసన్ మరియు నటి సారిక 1988 లో కలిసి జీవించడం ప్రారంభించారు, వారి మొదటి బిడ్డ శ్రుతి హాసన్ (జననం 1986) జన్మించిన తరువాత వివాహం చేసుకున్నారు. 2002 లో ఈ జంట విడాకుల కోసం దాఖలు చేశారు, పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నాడు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. సుమంత్ అక్కినేని హీరో సుమంత్, నటి కీర్తిరెడ్డిలది ప్రేమ వివాహం. అయితే ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు కలిసి ఉండలేకపోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మరో వ్యకిని పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సుమంత్ మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు మంచు మనోజ్ మంచు మనోజ్, ప్రణతి రెడ్డిలది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. కొనాళ్లపాటు కలిసి ఉన్న వీరు.. విభేదాల కారణంగా ఇటీవల విడిపోయారు. సునీత ప్రముఖ గాయని సునీతకు తొలిగా కిరణ్ తో వివాహమైంది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లలున్నారు. భర్తకు విడాకులిచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్రకాష్ రాజ్ 1994లో నటి లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు-మేఘనా, పూజ మరియు ఒక కుమారుడు సిద్దూ ఉన్నారు. వీరిద్దరు 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు. శరత్ బాబు సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి, కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత స్నేహకు సైతం శరత్ బాబు విడాకులిచ్చారు. రాధిక ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతనకు విడాకులిచ్చారు రాధిక. రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య-సమంత నాగచైతన్య-సమంతల వివాహం 2017, అక్టోబర్ 7 జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరు 2021లో విడిపోయారు. -
మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 35 వసంతాలు. కమలహాసన్, రాధిక మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. శతదినోత్సవ వేదికపై రాజ్‌కపూర్, ఎన్టీఆర్, ఏడిద క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! రాధికకు నటించి చూపిస్తూ కె. విశ్వనాథ్ తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
మరో ఉద్యమం తప్పదు.. కమల్ హెచ్చరికలు
సాక్షి, చెన్నై: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం మండిపడ్డారు. తాజాగా మరో తమిళ నేత, మక్కళ్‌నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘ఒక దేశం ఒకే భాష అనే విధానం సరైనది కాదు. భారత్ ప్రజాస్వామ్య దేశం కావున ఒక దేశం అనేక భాషలు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. దేశ జాతీయ గీతం బెంగాళీ భాషలో ఉన్నా.. అది దేశ ఐక్యతను అన్ని రాష్ట్రాలను సంస్కృతిని గౌరవిస్తుంది. కావున దానిని మేమంతా గౌరవిస్తాం. రాష్ట్రాల సంస్కృతి జోలికి కేంద్రం రావడం సరికాదు. గతంలో జల్లికట్టు ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతంగా చేశామో దేశమంతా చూసింది. తమిళ భాష జోలికి వస్తే దానికి కంటే మరింత ఎక్కువగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ కమల్ హసన్ హెచ్చరించారు. కాగా హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో భారత్ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందని, దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే అని అభిప్రాయపడ్డారు. షా వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. Now you are constrained to prove to us that India will continue to be a free country. You must consult the people before you make a new law or a new scheme. pic.twitter.com/u0De38bzk0 — Kamal Haasan (@ikamalhaasan) 16 September 2019 -
కమల్ లక్ష్యంగా రజనీ వ్యంగ్యాస్త్రాలు..
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తామంటూ సంకేతాలు ఇచ్చిన తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే వేదికపైకి వస్తే.. ఆ వేదికపై రాజకీయాల గురించి పరోక్షంగా మాట్లాడితే.. అది హాట్ టాపిక్ అవుతుంది. ఆదివారం చెన్నైలో శివాజీ గణేషన్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి తలైవా రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌తోపాటు, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. కమల్ హాసన్‌పై పరోక్షంగా సెటైర్లు వేయడం చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, స్టార్డమ్, పేరు ప్రఖ్యాతలు సరిపోవని, అంతకుమించి ఇంకేదో కావాలని రజనీ పేర్కొన్నారు. 'నటుడిని రాజకీయ నాయకుడు చేసే గొప్ప మార్పు ఏదో రావాలి. అది ఏమిటో కమల్ హాసన్‌కు తెలిసి ఉండొచ్చు. రెండు నెలలు కిందట నేను అడిగి ఉంటే అతను చెప్పి ఉండేవాడేమో. కానీ ఇప్పుడు అడిగితే.. 'నా వెంట రా.. నేను చెప్తాను' అంటున్నాడు' అని రజనీ ఛలోక్తులు విసిరారు. అప్పటికీ ప్రేక్షకుల నడుమ కూర్చున్న కమల్ సైతం నవ్వులు కురిపించారు. రజనీ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే సినీ గ్లామర్ మాత్రమే సరిపోదని, ప్రజలతో మమేకమైతేనే రాజకీయాల్లో రాణిస్తామని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని కమల్ తనను ఆహ్వానించారని, పెద్దవాడివి కలిసి వెళదాం అంటూ మిత్రుడిగా ఆయన ఆహ్వానించడం సంతోషానిచ్చిందని చెప్పారు. ఆయనతో వెళితే రాజకీయాలు నేర్పుతాడేమోనని రజనీ చమత్కరించారు. అంతకుముందు కమల్ హాసన్ మాట్లాడుతూ అధికార అన్నాడీఎంకే సర్కారుపై పరోక్ష విమర్శలు గుప్పించారు. శివాజీ గణేషణ్ కాంస్య విగ్రహం ఏర్పాటులో జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 'రాజకీయాలకు అతీతమైన ప్రజాభిమానం శివాజీ సొంతం. ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎవరినీ మేం యాచించాల్సిన అవసరం లేదు. ఎవరూ వ్యతిరేకించినా నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాడిని. ఒకవేళ నేను కార్యక్రమం బయట నిలబడినా.. ఈ కార్యక్రమంలో మాత్రం భాగం అయ్యేవాడిని 'అని కమల్ చెప్పారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో కమల్, రజనీ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నామని సంకేతాలు ఇవ్వడంతో.. భవిష్యత్తులో వీరి మధ్య రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
హీరో అభిమాన సంఘం నిర్వాహకుడి అరెస్ట్
తమిళసినిమా : రాజకీయ నాయకులు శాశ్వతం కాదని, దేశం మాత్రమే శాశ్వతమని విలక్షణ నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళ రాజకీయాలపై కమల్ తనదైన బాణిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. శాసన సభ్యులు మీ గ్రామాలకు వస్తున్నారు. వారికి తగిన మర్యాద ఇవ్వండి అంటూ ప్రజలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయంటూ కమల్‌పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాగా పుదుకొట్టయ్ లో కమలహాసన్ అభిమాన సంఘం నిర్వాహకుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్లికట్లు పోరాటంలో సుధాకర్ రాష్ట్రమంత్రిని అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై కేసు నమోదు చేశారు. ఆ చర్యలను తీవ్రంగా ఖండించిన కమల్ తన ట్విట్టర్లో పేర్కొంటూ.. ‘ఇక ప్రజల నీతిని దేశం కాపాడుకుంటుంది. నేను విమర్శించకుండా, శాంతియుతంగానే నడుచుకోవాలని భావించాను. కానీ నా అభిమాన సంఘం కార్యకర్తల అరెస్ట్ మాట్లాడించేలా చేసింది. జల్లికట్టు అంశంలో నా సంఘ కార్యకర్తతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. అది నా సహనాన్ని, రాజకీయ హింసాత్మక ధోరణిని చూపుతోంది. నా సంఘానికి చెందిన వారు కాస్త నిబద్ధత పాటించాల్సిన సమయం ఇది. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీకి చెందిన వారు మోసాలకు పాల్పడినా అందుకు అతీతంగా సేవ చేసే మనం ఎలాంటి కూలి ఆశించకుండా జీవం ఉన్నంత వరకూ ప్రజలకు సేవ చేద్దాం. రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మన దేశం శాశ్వత’మని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.