
కేథరిన్
అత్తారింటికి దారి కనుక్కునే పనిలో తమిళ హీరో శింబు బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయనతో ప్రయాణానికి కేథరిన్ కూడా తోడయ్యారట. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాశ్ ఓ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేథరిన్ థెరీసా కూడా తోడయ్యారు. దీంతో బావకు ఇద్దరు మరదళ్లు దొరికారు. తెలుగులో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. మరి.. మేఘా, కేథరిన్ ఏయే పాత్రలు చేస్తారన్నది ఇంకా బయటకు రాలేదు. అలాగే శింబుకు అత్తగా ఎవరు నటిస్తారన్నది కూడా చిత్ర బృందం వెల్లడించలేదు. ఖుష్బూ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment