ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య పోటీ!
టాలీవుడ్ జులాయి సరసన నటించేందుకు ముగ్గురు అందమైన భామలు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు లీడ్ రోల్ చెయ్యడానికి గొడవపడుతున్నారనుకునేరు. అదేంకాదు. మూడో హీరోయిన్గా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్స్తో చిందులేయనున్నారు. ఈ చిత్రంలో బన్నీతో కలిసి నటించడానికి టాలీవుడ్ హీరోయిన్లు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. జులాయి తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కోసం ఈ ముగ్గురు హీరోయిన్లు పోటీపడుతున్నారు. మలయాళ బ్యూటీ నయనతార, ఉహలు గుసగుసలాడే ఫేమ్ రాశీ ఖన్నా, ప్రణీత ఈ రేస్‌లో ఉన్నారని సమాచారం.
ఈ మూవీలో అల్లు అర్జున్ ముగ్గురు హాట్ బ్యూటీస్‌తో రొమాన్స్ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత లీడ్ రోల్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్‌గా రెండో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని హార్ట్ఎటాక్ ఫేమ్ ఆదా శర్మా సొంతంచేసుకుంది. మూడో హీరోయిన్ ఎంపిక జరుగవలసి ఉంది. ఈ పాత్రకు దాదాపు ప్రణీత ఫిక్స్ అయిందని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
**