Rasikhanna
-
ఇన్‌స్టాలో అందాల ముద్దుగుమ్మల సందడి (ఫోటోలు)
-
ఈ డైలాగ్స్ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం!!
నూతన వధువరులను ‘శతమానం భవతి’ అని దీవిస్తారు. గొప్ప సంప్రదాయాలను ‘నూరేళ్లు వర్థిల్లాల’ని కోరుకుంటారు. మన వివాహవ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. మన సినిమా భావోద్వేగాల సమ్మిళితం. మంచి విలువలను చెప్పే మంచి సినిమా వర్థిల్లాలి. మన సంస్కృతికి పదే పదే ఆయువు పోస్తూ ఉండాలి. శతమానం భవతి! వేగేశ్న సతీష్‌గారితో ‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాక మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘శ్రీనివాస కళ్యాణం’ని ఎందుకు ఓకే చేశారు? ‘దిల్’ రాజు: మేజర్‌గా నేను రెండు విషయాలు ఆలోచిస్తా. ఒకటి స్టోరీ. రెండోది స్టోరీ ఐడియా. కథ, ఐడియా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఓకే చేస్తా. వర్కౌట్ అవుతుందా? లేదా? అనే విషయం గురించి ఆలోచించను. ‘శతమానం భవతి’ సినిమాను అలాగే పిక్ చేశాను. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాను. ‘శతమానం భవతి’ అనేది ఒక కథ అని, ‘శ్రీనివాస కళ్యాణం’ అనేది ఒక మూమెంట్ అనే క్లారిటీ ఉంది. సినిమాలోని 8, 9 మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్ నుంచి వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు మంచి టాక్ రావడానికి కూడా ఆ సీన్సే కారణమని నా నమ్మకం.‘శతమానం భవతి’లో కథ వెంటనే స్టార్ట్ అవుతుంది. ‘శ్రీనివాస కల్యాణం’లో ప్రీ ఇంట్రవెల్ నుంచి స్ట్రాంగ్ కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లోని మూమెంట్స్‌కు ఆడియన్స్ ఎంగేజ్ అవుతారనే నమ్మకం ఎలా కలిగింది? ‘దిల్’ రాజు: నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గురించి భయపడుతూనే ఉన్నాం. కానీ మంచి మూమెంట్స్ ఉన్నాయి కదా అనే ధైర్యం ఓ పక్కన ఉంది. ‘హ్యాపీ డేస్’ కథ కాదు. ఫోర్ ఇయర్స్ ట్రావెలింగ్ మూమెంట్స్. శేఖర్‌గారు చేసిన ‘ఫిదా’ సినిమా కూడా ట్రావెల్ ఫిల్మ్. ఈ సినిమాను కూడా నేను అలానే భావించాను. పెళ్లి మీద ట్రావెల్ ఫిల్మ్ అనే ఆలోచనపై నమ్మకం ఉంచాను. రషెష్ చూసినప్పుడు ఫీల్ గుడ్ ఫిల్మ్ అనిపించింది. ఇదే విషయాన్ని ఎడిటర్‌కు చెప్పాను. ఆ తర్వాత ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని చెప్పడం స్టార్ట్ చేశారు. మంచి ఫీల్ కలిగింది. ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక నా నమ్మకం నిజమైందని అనిపిస్తోంది. ఓ నిర్మాతగా ఈ పెళ్లికి మీరే పెద్ద. పెళ్లిలో ఎన్నో అలకలు, గొడవలు ఉంటాయి. ఈ పెళ్లి తీసేటప్పుడు ఆన్సెట్స్లో ఏవైనా అలకలున్నాయా? ‘దిల్’ రాజు: చంఢీఘడ్‌లో షూటింగ్ చేసినప్పుడు సతీష్ అలిగినట్లు ఉన్నాడు. నితిన్: నాకు తెలుసు.. నాకు తెలుసు(నవ్వులు). ‘దిల్’ రాజు: చండీఘడ్ షెడ్యూల్లో ఓ రోజు సెట్లో సీన్ పేపర్స్ చదివాను. నిజానికి షూటింగ్ ముందే అన్నీ ఓకే చేసుకుంటాం. కానీ సెట్లో ఆ రోజు నాకు ఎందుకో కొత్త కొత్త డౌట్స్ వచ్చాయి. డైలాగ్స్ లెంగ్త్ ఎక్కువగా ఉంది కదా అని సతీష్‌ని అడిగాను. ‘అవునా..సార్ అన్నాడు’. సరే అని నేను బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లొచ్చి చూసే సరికి సతీష్ డైరెక్టర్ సీట్లో లేడు. చూస్తే పక్కకి వెళ్లి ఏదో రాస్తున్నాడు. ఒక మనిషి ఎక్స్ప్రెషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ సడన్‌గా మారవు. అప్పుడు సతీష్‌లో నాకు మార్పు కనిపించింది. ఏమైందో తెలుసుకుందామని అసోసియేట్ డైరెక్టర్ని పిలిచా. మీరు ‘సడన్‌గా సీన్ చేంజ్ చేయమంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా సార్’ అన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. చండీఘడ్ వెళ్లిన శిరీష్ కూడా హైదరాబాద్ తిరిగొచ్చి ‘సతీష్ ఎందుకో ఈ షెడ్యూల్ అంతా డిస్ట్రబ్డ్‌గా ఉన్నాడు’ అన్నాడు. సతీష్ హైదరాబాద్ వచ్చాక అడిగితే చెప్పలేదు. ఇప్పుడు చెబుతాడు. కారణం తెలుసుకుందాం. నితిన్: నేను షూట్లో ఉన్నాను. అంతకుముందు చెప్పినది ఇవ్వకుండా వేరే సీన్ పేపర్స్ ఇచ్చారు. నేను షాక్ అయ్యాను. ఇది కాదు కదా అనుకున్నా. సతీష్: సినిమాలో చండీఘడ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు బంధువులు, స్నేహితులు ఆ వేడుకలో కనిపించాలి. అయితే చండీఘడ్‌లో క్రౌడ్‌ని చూసినప్పుడు ఏదో నిరుత్సాహం కలిగింది. అక్కడి పంజాబీ లోకల్ ఆర్టిస్టులను తీసుకున్నాం. దాంతో నేటివిటీ మిస్ అవుతుందా? అని ఆలోచిస్తున్నాను. సెట్లో వేరే చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ ఉన్నాయి. అదే టైమ్‌లో ‘దిల్’ రాజుగారు సీన్ కాస్త మార్చుదామా అంటే, ఏదోలా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు ఆయన అలా అనలేదు కదా అనుకున్నాను. ‘దిల్’ రాజు: యాక్చువల్లీ మా ఇద్దరి వేవ్‌లెంగ్త్ చాలా బాగుంటుంది. సతీష్‌తో ఈ రెండు సినిమాల ‘శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం’ 110 రోజుల జర్నీలో ఆ రోజు నాకు క్వశ్చన్ మార్క్‌లా మిగిలిపోయింది. సతీష్: సెట్లో సీన్ కరెక్షన్ అంటే ఎవరికైనా కాస్త టైమ్ పడుతుంది కానీ నేను ఓ పది నిమిషాల్లో కరెక్ట్ చేసేస్తా. అది రైటర్‌గా నా అదృష్టం అనుకుంటున్నాను. ఈ సినిమాలో రైటర్‌గా నేను ఇష్టపడి రాసుకున్న కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సెట్ వాతావరణంలో ఆ రోజు నా మూడ్ సరిగా లేదు. ఆ టైమ్‌లో రాజుగారు వచ్చి.. ‘ఈ డైలాగ్స్ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం’ అన్నారు. నిజానికి ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి గురించి నితిన్ మాట్లాడే స్ట్రాంగ్ డైలాగ్స్ అవి. కావాలంటే క్లైమాక్స్ కోసం మళ్లీ రాసుకోవచ్చు కదా అనిపించింది. అలా అని ‘దిల్’ రాజుగారికి ఎదురు చెప్పలేను. ఎందుకంటే నాకంటే సినిమా కథను ఆయన ఎక్కువగా ప్రేమిస్తారు. నా కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. నిజానికి తెలుగువారిని తీసుకురమ్మని ప్రొడక్షన్ వారికి చెప్పకపోవడం నా తప్పే. దాంతో మూడాఫ్తో పక్కకు వెళ్లిపోయి రాస్తూ కూర్చున్నాను. అంతే. రాజుగారి మీద నాకేం ఉంటుంది (నవ్వుతూ). ఓకే రాజుగారూ.. మ్యాటర్ క్లియర్ అయింది. ఇక, ఈ సినిమాలో డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నలుగురూ మీకు నచ్చిన ఒక్కో డైలాగ్ చెబుతారా. ముందు రాశీతో స్టార్ట్ చేద్దాం.. రాశీఖన్నా: ఓ సీన్లో సితార గారితో ఇప్పటికీ వాసు (సినిమాలోని నితిన్ క్యారెక్టర్) వాళ్లది జాయింట్ ఫ్యామిలీనే అమ్మా అన్నప్పుడు.. ‘ఎఫెక్షన్స్ ఉన్న దగ్గరే రిలేషన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి’ అని చెబుతారు. ఆ డైలాగ్ నచ్చింది. నందిత: నేను చెప్పిన డైలాగ్స్ అన్నీ నాకు ఇష్టమే. ముఖ్యంగా.. ‘నా అనే వాళ్ల దగ్గర ఏమీ దాచకూడదు. చెప్పాల్సిన టైమ్‌లో చెప్పకపోతే జీవితాంతం బాధపడటం తప్ప ఇంకా ఏమీ మిగలదు’ అనేవి నా మనసుకి బాగా దగ్గర అయ్యాయి. మీ ఇంట్లో చెప్పకుండా దాచిన విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి? నందిత: ఏమీ లేవు. అమ్మానాన్నతో అన్నీ చెప్పేస్తా. ‘దిల్’ రాజు: నిజమే చెబుతున్నావా? ఫ్రెండ్స్ దగ్గర.. బాయ్‌ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా దాచావా? నందిత: అయ్యో.. నాకు బాయ్‌ఫ్రెండ్సే లేరండీ. నితిన్: అబ్బా.. చా.. (నవ్వులు). మీరు చెప్పండి నితిన్.. మీకు నచ్చిన డైలాగ్ ఏది? నితిన్: ఫస్టాఫ్‌లో లవ్ ప్రాబ్లమ్‌తో ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ట్ చేసినప్పుడు..‘జాబ్ ఇచ్చినోడికి జాబ్ వదిలేసేటప్పుడు చెప్పావ్. ఇల్లు అద్దెకి ఇచ్చినోడికి ఇల్లు వదిలేసేటప్పుడు చెప్పావ్. మరి ప్రాణం ఇచ్చిన అమ్మకు ప్రాణాలు వదిలేసేటప్పుడు చెప్పాలి కదరా?’ అనే డైలాగ్‌కు కనెక్ట్ అయ్యాను. ‘దిల్’ రాజు: నాకు పర్టిక్యులర్‌గా ఓ సీన్‌కి కళ్లలో నీళ్లు తిరిగాయి. సెకండాఫ్‌లో ‘నానమ్మా.. నా పెళ్లిలో నీ 70 ఏళ్ల జీవితం కనిపిస్తుంది. రేపు నేను 70 ఏళ్ల జీవితం చూసుకోవాలి కదా. పెళ్లి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి’ అని జయసుధగారిని నితిన్ అడిగినప్పుడు... ‘మీ తాతయ్యగారు ఒక మాట చెప్పేవారు రా. మన కన్న తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటామో. మన లైఫ్‌లోకి వచ్చి, మన పిల్లలకు జన్మనిచ్చే భార్యను కూడా అంతే బాగా చూసుకోవాలి అని’. ఆ డైలాగ్ రాగానే నిజం కదా అనిపించింది. సినిమాలో పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మీ ముగ్గురూ అలానే చేసుకోవాలనుకుంటున్నారా? నితిన్: నాకైతే అలానే చేసుకోవాలని ఉంది. అంతా మన సంప్రదాయం ప్రకారం జరగాలనుకుంటున్నాను. రాశీఖన్నా: కథ వింటున్నప్పుడే నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్యలో మనం గమనిస్తే చాలా డివోర్స్‌లు చూస్తున్నాం. ఈ సమయంలో ఇలాంటి కథ చెపాల్సిన అవసరం ఉందనిపించింది. నేను చాలా నేర్చుకున్నాను. నార్త్, సౌత్ చాలా డిఫరెంట్. బేసిక్‌గా నేను చాలా ట్రెడిషనల్. ఈ సినిమా చేశాక సౌత్‌లో పెళ్లి ఎలా చేస్తారో తెలిసింది. అన్నీ కుదిరితే అలానే చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఎమోషనల్‌గా కూడా ఈ మూవీకి కనెక్ట్ అయ్యాను. నందిత: మా అమ్మనాన్నాలది లవ్ మ్యారేజ్. ఇద్దరి వైపు బంధువులు రాకపోకలు తక్కువ. అసలు లేదనే చెప్పాలి. దాంతో నాకు రిలేషన్స్ గురించి అంతగా తెలీదు. ‘శ్రీనివాస కళ్యాణం’ చేస్తున్నప్పుడు రిలేషన్షిప్ బాండింగ్ తెలిసింది. తెలుగు సంప్రదాయాలు నచ్చాయి. ఇలాగే పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ కలిగింది. నితిన్.. మీరు క్లైమాక్స్‌లో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పారు. ఏకంగా మంత్రాలు కూడా చెప్పారు. ఎటువంటి హోమ్ వర్క్ చేశారు? నితిన్: ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు డైలాగ్స్ చాలా బావున్నాయి. సినిమా స్టార్ట్ అయ్యే వారం ముందు ప్రాక్టీస్ మొదలుపెడితే సరిపోతుందనుకున్నాం. కట్ చేస్తే.. తర్వాత ‘మీరు చెప్పడంలేదు. పంతులుగారితో చెప్పిస్తున్నాం’ అన్నారు. ఓకే అనుకున్నాను. లాస్ట్ మినిట్‌లో నువ్వే చెప్పాలన్నారు. పెళ్లి మంత్రాలంటే మామూలా? మాంగల్యం తంతునానేన.. ఈజీగానే వస్తుంది. అయితే మిగతావన్నీ అంత ఈజీ కాదు కదా. మనసులో ‘సార్ ఏంటి సార్ ఇదీ’ అనుకున్నాను. సతీష్: ప్లస్ పాయింట్ ఏంటంటే నితిన్‌కి తెలుగు చదవడం బాగా వచ్చు. మా టీమ్‌లో చాలా మంది టింగ్లీష్ బ్యాచ్. (అంటే తెలుగు డైలాగ్స్ ఇంగ్లీష్‌లో రాసుకోవడం). పవిత్రత ఉన్న మంత్రాలు. సరిగ్గా పలకపోతే మంత్రాలు తప్పుగా ఉచ్చరించారు అని మా మీద పడిపోతారు. సో.. చాలా కేర్ తీసుకున్నాం. సింగిల్ టేక్‌లో చెప్పాడు నితిన్. నితిన్: ముందు నీకు ఎంత గుర్తుంటే అంత చెప్పు. కట్ షాట్స్ తీసుకుందాం అన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో సింగిల్ షాట్లో చేసేద్దామన్నారు. ఇక చూడండి.. చిన్నప్పుడు పద్యాలు బట్టీ పట్టినట్టు నేర్చుకున్నాను. మీ పెళ్లికి మీరే మంత్రాలు చెప్పుకోవచ్చేమో! నితిన్: ఆల్మోస్ట్. ఒకవేళ పంతులుగారు ఎక్కడైనా తప్పు చదివినా సార్ అది కాదు ఇలా అని చెప్పేస్తానేమో. రైటర్, డైరెక్టర్‌గా ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి అని ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’లో పెళ్లి విశిష్టతను గుర్తు చేస్తున్నారా? సతీష్: గుర్తు చేయడం ఏం కాదు. హైందవ సంస్కృతి, సంప్రదాయం ప్రపంచంలోనే అందరికీ తలమానికం. అలాంటి సంప్రదాయాలని మనం కనీసం పాటించకుండా వేరే వేరే వాటిని పట్టుకొని పోవడం పర్సనల్‌గా నాకు నచ్చలేదు. అలాగే నేను చెబితే ఆచరిస్తారా? లేదా అనేది వేరే విషయం. స్కూల్లో మాస్టర్ నీతి పద్యం అందరికీ ఒకలానే చెబుతాడు. కొంతమంది అర్థం చేసుకొని, పాటిస్తారు. కొందరు జస్ట్ విన్నాను, ఎగ్జామ్‌లో రాసి వదిలేస్తాను అనుకుని పాస్ అయిపోతారు. వాళ్లదీ తప్పుకాదు, వీళ్లదీ తప్పు కాదు. ‘శతమానం భవతి’ని ఆదరించారు కాబట్టే ‘శ్రీనివాస కళ్యాణం’ వచ్చింది. ఒకవేళ ఆ సినిమా ఆడకపోయింటే ఈ సినిమా కచ్చితంగా వచ్చేది కాదు. నాతో చాలా మంది అన్నారు ఇంతకు ముందు అమ్మానాన్నల దగ్గరకు సంవత్సరానికి ఒకసారి వెళ్లేవాళ్లం. ఇప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వెళ్లిపోతున్నానని అంటున్నారు. కొందరినైనా కదిలించాం కదా. కొంతమందైనా ఆచరించారు కదా అనే సంతృప్తి. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ గురించి ఓ ఎగ్జాంఫుల్ చెబుతాను. పెళ్లి సీన్లో చెప్పులు వదిలేసి హీరో హీరోయిన్ మండపం మీదకు వెళ్లాలి. కథ చెప్పినప్పుడు కెమెరామేన్ సమీర్ రెడ్డికి మండపం మీద అష్టదిక్పాలకులు ఉంటారు, ఋషులు ఉంటారు అని చెప్పా. షూట్ చేస్తున్నప్పుడు ఆయన ఆ ఫీల్‌తోనే చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలో ఆయన రిలేటివ్స్ పెళ్లికి వెళ్లారు. అక్కడ మండపంలో ఎవరో చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారంట. వాళ్లను పిలిచి ‘పైన దేవుళ్లుంటారంట. చెప్పులు వేసుకొని తిరగకూడదు’ అని చెప్పారట. ఇలా కొంత మంది చేయగలిగినా పెళ్లి మీద ఒక విలువ పెరుగుతుంది. క్రియేటీవ్ సైడ్ రాజుగారు ఎక్కువ క్రెడిట్ తీసుకుంటున్నారని మీకు అనిపించిందా? సతీష్: అనిపించలేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తారు సినిమా గురించి. ఆల్రెడీ ‘దిల్’ రాజు అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. వేగేశ్న సతీశ్‌కి జస్ట్ సెకండ్ మూవీ. ‘శతమానం భవతి’ నుంచి నేను ఆయనలో చూసిందేంటంటే సినిమాను ప్రేమిస్తారు. చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటారు. ఇలా ఉంటే బావుండు అని సలహాలు ఇస్తారు. ‘సతీశ్ ఇలా చెయ్.. ఇలా చేయ్’ అనరు. ఒకవేళ అలానే ఉంటే ‘శతమానం భవతి’ తర్వాత ఈ జర్నీ ఉండదు కదా. ఆయన డామినేట్ చేస్తున్నారు అన్న విషయం కరెక్ట్ అయ్యుంటే ఈ సినిమా చేయను కదా. ఇక్కడ ఎవ్వరి క్రెడిట్‌నీ ఎవ్వరూ తీసుకెళ్లరు. రాజు గారి కాంపౌండ్‌లో అలానే జరిగితే డైరెక్టర్స్ బయటకు వెళ్లి సినిమాలు ఎలా తీస్తారు? ఇప్పుడీ సినిమాకి డైలాగ్స్‌కు మంచి పేరొస్తోంది కదా. అవి నేనే రాసుకోవాలి. యాక్టర్స్‌కి సీన్ నేనే వివరించాలి. రాజుగారు సీన్ బావుందా? బాలేదా అనే సజెషన్ ఇస్తారు. అప్పుడు కూదా కొత్త సీన్ రాసేది నేనే కదా. ‘దిల్’ రాజు: సినిమా అంటే ట్రైన్. దర్శకుడు, నిర్మాత పట్టాలు. పాత రోజుల్లో గొప్ప జర్నీ సాగిందంటే ఇద్దరి మధ్యా మంచి సింక్ ఉండబట్టే. ఏడిద నాగేశ్వరరావు– కె.విశ్వనా«ద్, నాగిరెడ్ది–కేవి రెడ్డి, శ్యామ్‌ప్రసాద్–కోడి రామకృష్ణ.. వీళ్ల జర్నీని తీసుకుందాం. దర్శక–నిర్మాతలిద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే జర్నీ బాగుంది. నిర్మాత చెబితే ఎందుకు వినాలిరా అంటే కుదరదు. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. నేను సలహాలైతే ఇవ్వగలను కానీ సతీష్ చేసే పని చేయలేను కదా. నేను రాయలేను కదా. కథ తనే రాయాలి. డైలాగ్స్ తనే రాసుకోవాలి. సినిమా తీయాల్సిందీ తనే కదా. ఈ సినిమాకి ముందుగా నితిన్‌ని అనుకోలేదట? ‘దిల్’ రాజు: మా ప్రొడక్షన్లో సినిమాలు ఎలా ఉంటాయంటే ఒక స్టోరీ కుదరగానే, దానికి ఎవరు బాగుంటారా? అని ఓ ముగ్గురు హీరోలను పేర్లను పేపర్ మీద రాసుకుంటాను. ఈ కథకు ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్ పేర్లను రాసుకున్నాను. ఎన్టీఆర్‌కు చెప్పాం కూడా. తర్వాత మాకే అనిపించింది. స్టార్ హీరోతో చే స్తే కొన్ని సార్లు ఫ్యాన్స్ కోసం ఫైట్లు, మాస్ ఎలిమెంట్స్ అంటూ కాంప్రమైజ్ అవ్వాలి. వెంటనే నితిన్‌కు కథ చెప్పాం. సూపర్‌గా ఉంది. చేసేద్దాం అన్నాడు మీ సంస్థలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటున్నారా? ‘దిల్’ రాజు: ‘బొమ్మరిల్లు’తో పోల్చలేం. మంచి సినిమా ఇవ్వగలిగాం అన్న సంతృప్తి ఉంది. నితిన్: త్రివిక్రమ్ నాతో ఓ మాట చెప్పారు. మంచి కంటే చెడు ఎక్కువ స్పీడ్‌గా ట్రావెల్ చేస్తుంది. మంచి అనేది స్లోగా వెళ్తుంది.. కానీ వెళ్తుంది. నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా మెల్లి మెల్లిగా రీచ్ అవుతుంది. ‘దిల్’ రాజు: సొసైటీలో నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ. రివ్యూలు, ఇండస్ట్రీ, ఆడియన్స్‌లో కొంతమంది.. ఒక వైపు మంచి. ఒకవైపు చెడు. మంచి సినిమాను ఎవరు ఆపుతారు. షో షోకి మౌత్ టాక్ పెరుగుతుంది. ‘కేరింత’ సినిమాని రిలీజైన రోజున దేవీ థియేటర్లో చూశాను. కలెక్షన్స్ లేవు. కానీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్సెట్ అయ్యాను. ఆఫీసులో కూర్చుని ఆలోచిస్తుంటే థియేటర్ ఫుల్ అని శ్రీకాకుళం నుంచి ఫోన్. వెంటనే సినిమాలో ఏదో స్పార్క్ ఉందని ప్రమోషన్ స్టార్ట్ చేశాను. సినిమా హిట్టయింది. ‘శ్రీనివాస కళ్యాణం’ను వదలను. కొంచెం పుష్ చేయాలి. ఈ సినిమా చూసి, చాలామంది ‘మంచి ఫీల్ కలిగింది. బాగుంది’ అని మెసేజ్ చేశారు. సినిమా సరిగ్గా లేకపోతే ప్రమోట్ చేసి రుద్దడానికి ట్రై చేయను. నేనే సినిమా నుంచి షిఫ్ట్ అయిపోతా. కనెక్ట్ అవుతుంది అని నమ్మితేనే ప్రమోట్ చేస్తాను. ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ముగ్గురు బ్యాచిలర్స్ (నితిన్, నందిత, రాశీ ఖన్నా) పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్పాలి? రాశీఖన్నా: పెళ్లి ప్లాన్స్ ఇప్పుడు లేవు. అబ్బాయిలు కూడా లేరు (నవ్వుతూ).. ‘దిల్’ రాజు: ప్లాన్ లేదని చెప్పు. అంతేకానీ అబ్బాయిలు లేరని అనకు (నవ్వుతూ) రాశీని చేసుకోవడానికి అబ్బాయిలు లేరా? (నవ్వుతూ) రాశీఖన్నా: అబ్బాయిలు నిజంగానే లేరండీ.. నమ్మాలి. ‘సాక్షి’: ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ముందుకు రారా. కావాలంటే స్వయంవరం పెడదామా? ‘దిల్’ రాజు, నితిన్: అవును.. స్వయంవరం పెడదాం (నవ్వులు). నితిన్: మా అమ్మవాళ్లు మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకో 8 నెలలు టైమ్ పడుతుంది. ‘దిల్’ రాజు: 2019లోపే నీ పెళ్లి ఉంటుందేమో. నితిన్: 2019 ఇయర్ క్లోజింగ్ లోపు చేసుకోకపోతే మా ఇంట్లో వాళ్లు చంపేస్తారు. నందిత: తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పుడే వచ్చాను కదా. ఆర్టిస్ట్‌గా శాటిస్ఫ్యాక్షన్ దక్కాలి. అప్పుడే పెళ్లి. సతీష్: అంటే తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఉంటే ఇప్పుడు చేసుకునేదానివా? నందిత: (నవ్వేస్తూ). తెలియదు. అయినా పెళ్లికి ఇప్పుడు తొందరపడటంలేదు. – సినిమా డెస్క్ -
పాల రాశి బొమ్మ
రాశీఖన్నా.. పాలరాతి బొమ్మ. ఆ రాతికి ఏ డ్రెస్ పొదిగినా.. పాల రాశి బొమ్మ అయిపోతుంది. ఇక్కడి మీరు చూస్తున్నవి.. సెలెక్టెడ్ డిజైన్స్. సెలెక్టెడ్ అంటే.. మీ కోసం కూడా.. సెలక్ట్ చేసి తెచ్చినవి. ధరించి చూడండి.. మీరూ.. సౌందర్య రాశి అవ్వండి. ►షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ చేసిన ఈ డ్రెస్‌ని రీ–మిక్స్ సాంగ్‌కి ఎంపిక చేశాం. దాండియా వంటి సంప్రదాయ డ్యాన్స్‌లకు ఇలాంటి డ్రెస్ బాగా నప్పుతుంది. ►ఈ మింట్ బ్లష్ గౌన్ని ఒక ప్రముఖ మ్యాగజీన్ షూట్‌కి ఎంపిక చేశాం. గ్లామర్ కోసం నెక్లైన్ పొడవుగా ఉన్నది తీసుకున్నాం. వెస్ట్రన్ పార్టీలకు ఇలాంటి డ్రెస్‌ని ఎంపిక చేసుకునేవారు నెక్లైన్ తక్కువ ఉన్నది ఎంపిక చేసుకోవచ్చు. ►ఇది ఇకత్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్. ఇది ఈజీ టు వేర్. చేనేత ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్‌లను ఏ సందర్భానికైనా వాడచ్చు. అన్ని రకాల బాడీ టైప్స్‌కి, ముఖ్యంగా క్యాజువల్ వేర్కి కరెక్ట్ ఔట్ఫిట్. ►అవార్డు ఫంక్షన్‌కు డాలీ జె డిజైన్ చేసిన గౌన్ ఇది. పెద్ద పెద్ద ఈవెంట్స్కీ ఇలాంటి డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. అయితే, చర్మ రంగుకు తగ్గట్టు రంగుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ► ఈ తరహా డ్రెస్ ధరించాలంటే ఇంతే ఎత్తు, ఇంతే బరువు ఉండాలనే నియమం ఏమీ లేదు. ఏ డ్రెస్ ధరించినా అసౌకర్యంగా అనిపించకపోవడం, కాన్ఫిడెంట్‌గా ఉండేలా చూసుకోవాలి. ► ఫ్లోర్‌ని తాకినట్టు పొడవుగా, నడుము దగ్గర చిన్న కట్ ఉండే దీనిని కట్ డౌన్ ఉంటారు. క్యాజువల్ ఈవెంట్స్‌కి, బర్త్‌డే, గెట్ టు గెదర్ వంటి సింపుల్ పార్టీలకు ఈ తరహా డ్రెస్‌ను ఎంచుకోవాలి. దీనికి ఈ వయసు వారే ధరించాలనే కొలమానాలు ఏవీ లేవు. క్రేప్, జార్జెట్ కాంబినేషన్లోనూ ఈ డ్రెస్‌ని డిజైన్ చేయించుకోవచ్చు. ► ఈ డ్రెస్‌కి టాప్ అండ్ బాటమ్ ప్రింట్ మెటీరియల్‌ను ఎంచుకోవాలి. దీని పైన ప్లెయిన్ జార్జెట్ లాంగ్ కేప్ ధరించాలి. ఈవెనింగ్ ఈవెంట్స్‌కి ఈ తరహా డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి ఫ్యాన్సీ జువెల్రీ, సింపుల్ హెయిర్ స్టైల్ నప్పుతుంది. ► ఇది నికషా అనార్కలీ డిజైన్ చేసిన లాంగ్ అనార్కలీ డ్రెస్. సినిమా ముహూర్త పూజ కోసం ఈ డ్రెస్‌ని ఎంపికచేశాం. దీనిని ఏ సంప్రదాయ వేడుకకైనా ధరించవచ్చు. ప్లెయిన్ షిఫాన్ ►ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ చేశారు. ఛాతీభాగం, అంచుభాగం ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్‌గా నిలిచింది. ► రిధిమా కొల్లారే డిజైన్ చేసిన డ్రెస్ ఇది. దీనిని సినిమా ఆడియో లాంచ్‌కి ఎంపిక చేశాం. ప్రింటెడ్ రా సిల్క్ లెహెంగా మీదుగా కేప్‌ని నడుము దగ్గర కనెక్ట్ చేస్తూ నెట్ మెటీరియల్ ఉపయోగించారు. దీనిపైన మిర్రర్ వర్క్ చేయడంతో కళగా మారిపోయింది ఇండో వెస్ట్రన్ లుక్ కోసం ఈ తరహా డ్రెస్సింగ్‌ని ఎంపిక చేశాం. దీనిని గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీలతో పాటు సంప్రదాయ వేడుకకూ ఉపయోగించవచ్చు. నీరజ కోన సినీ తారల డ్రెస్ స్టైలిస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ -
వరుణ్‌ది తొలిప్రేమే!
తొలి ప్రేమను మరచిపోవడం అంత సులువు కాదు. రియల్ లైఫ్ లవ్ ఇది. రీల్‌పై వచ్చిన పవన్ కల్యాణ్ ‘తొలి ప్రేమ’నూ అంత ఈజీగా మరచి పోలేం. బాబాయ్ పవన్‌కల్యాణ్ కెరీర్లో మంచి హిట్‌గా నిలిచిన ఈ చిత్రం పేరునే అబ్బాయ్ వరుణ్‌తేజ్ కొత్త సినిమాకు ఖరారు చేశారని సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా టైటిలే ‘తొలి ప్రేమ’. -
సిద్ధార్థ్ ఛాన్స్ ఇచ్చారు
నటుడు సిద్ధార్ద్ ఛాన్స్ ఇచ్చారని తెగ సంబరపడిపోతోంది నటి రాశీఖన్నా. ఈ భామ అంతగా ఆనందపడిపోవడానికి కారణం ఏమిటనేగా మీ ఆసక్తి. బాలీవుడ్లో నటిగా పరిచయం అయిన రాశీఖన్నా, ఆ తరువాత టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అక్కడ అవకాశాలను బాగానే రాబట్టుకున్న ఈ బ్యూటీకి తాజాగా కోలీవుడ్‌పై కన్ను పడింది. అంతే ఇప్పుడు ఒకేసారి ఏకంగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. అందులో ఒక చిత్రం ఇమైకా నోడిగళ్. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే రాశీఖన్నా పాత్ర ఏమిటనేగా మీ సందేహం తను నటుడు అధర్వతో రొమాన్స్ చేస్తోంది. మరో చిత్రం సైతాన్ కీ బచ్చా. ఇందులో సిద్ధార్థ్ కథానాయకుడు. ఈ చిత్రాల గురించి రాశీఖన్నా తెలుపుతూ తాను తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా కోలీవుడ్‌లో పరిచయం అవ్వాలన్న కోరిక చాలా కాలంగా ఉండేదని చెప్పింది. ఆ విషయాన్ని ఒకసారి నటుడు సిద్ధార్థ్‌కు చెప్పానని, అది జ్ఞాపకం ఉంచుకున్న ఆయన సైతాన్ కీ బచ్చా చిత్రంలో అవకాశం కల్పించారని చెప్పింది. ఇందులో తనది చాలా జాలీగా ఉండే పాత్ర అని తెలిపింది. ఇమైకా నోడిగళ్ చిత్రంలో ఆందుకు పూర్తి భిన్నమైన పాత్ర అని చెప్పుకొచ్చింది. అయినా రెండు చిత్రాల్లోనూ నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలు లభించడం చాలా సం తోషంగా ఉందని అంది. మలయాళంలోనూ విలన్ అనే చి త్రం ద్వారా పరిచయం కానున్నానని చెప్పింది. ప్రస్తుతం మలయాళ భాష నేర్చుకుంటున్నానని, మలయాళం భాష తెలిస్తే తమిళ భాష నేర్చుకోవడం సులభం అంటున్నారని, తదుపరి తమిళ భాష నేర్చుకుంటానని రాశీఖన్నా అంటోంది. -
లక్ష్యం సాధించాలంటే...
అనుకున్న గోల్ సాధించాలంటే జీవితంతో పోరాడాలి. ఆ పోరాటం అలసిపోకుండా ఉండేందుకు లక్ష్యానికి ఊపిరిలూదాలి. గోపీచంద్ అదే చేస్తున్నారు. ఆయన హీరోగా రూపొందుతోన్న ‘ఆక్సిజన్’ చిత్రం స్టోరీ లైన్ ఇది. ఇందులో గోపీ లక్ష్యం ఏంటి? దాన్ని సాధించడానికి అతను ఏం చేస్తాడు? అనేది ఆసక్తిగా ఉంటుందని చిత్రదర్శకుడు ఏ.ఎం జ్యోతికృష్ణ పేర్కొన్నారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మేలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ– ‘‘ఇది యాక్షన్ ఎంటర్టైనర్. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. యువన్ శంకర్ రాజా పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. గోపీచంద్ అద్భుతంగా నటించారు. జ్యోతికృష్ణ టేకింగ్ స్టైల్ సూపర్’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, సంగీతం: యువన్ శంకర్ రాజా. -
స్క్రీన్ టెస్ట్
1 ఇన్సెట్ ఫొటోలో కళ్లజోడు పెట్టుకున్న అమ్మాయి ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. పక్కనున్నది ఆమె సోదరుడు అమన్. ఆ హీరోయిన్ పేరు చెప్పగలరా? ఎ) రకుల్‌ప్రీత్ సింగ్ బి) రాశీ ఖన్నా సి) కాజల్ అగర్వాల్ డి) అనుష్క 2 ‘రోగ్’లో ఓ హీరోయిన్గా నటించిన ఏంజెలా అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు. ఆ సినిమా పేరు? ఎ) ఇజమ్ బి) లోఫర్ సి) జ్యోతిలక్ష్మీ డి) టెంపర్ 3 నాగార్జున ‘కింగ్’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన హీరోయిన్లు ఎంతమంది? ఎ) ఐదు బి) ఆరు సి) ఏడు డి) ఎనిమిది 4 ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఖాన్‌దాదాగా నటించిన సినిమా? ఎ) క్షణక్షణం బి) మనీ సి) మనీ మనీ డి) అనగనగా ఒక రోజు 5 అల్లు అర్జున్ బాలనటుడిగా నటించిన తొలి సినిమా ఏది? ఎ) చంటబ్బాయి బి) విజేత సి) వేట డి) అడవి దొంగ 6 మహేశ్‌బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటించిన సినిమా? ఎ) యువరాజు బి) టక్కరి దొంగ సి) నాని డి) బ్రహ్మోత్సవం 7 వీవీ వినాయక్, రాజమౌళి... ఇద్దరి దర్శకత్వంలోనూ మూడేసి సినిమాలు చేసిన హీరో? ఎ) అల్లు అర్జున్ బి) నితిన్ సి) ఎన్టీఆర్ డి) ప్రభాస్ 8 మందుకొట్టే సీన్స్‌లో మత్తుగా కనిపించడానికి పెరుగన్నం ఎక్కువగా తిని నటించిన హీరో ఎవరు? ఎ) ‘అందరివాడు’లో చిరంజీవి బి) ‘ఆగడు’లో మహేశ్‌బాబు సి) ‘యమదొంగ’లో జూనియర్ ఎన్టీఆర్ డి) ‘దేవదాసు’లో అక్కినేని 9 ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లేడీ కొరియోగ్రాఫర్ ఎవరు? ఎ) స్వర్ణ బి) సుచిత్రా చంద్రబోస్ సి) బృంద డి) కళ 10 మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ఏది? ఎ) గీతాంజలి బి) సఖి సి) దొంగ దొంగ డి) అమృత 11 ఈ కింది వాటిలో సీనియర్ ఎన్టీఆర్‌తో చిరంజీవి‡కలసి నటించిన సినిమా ఏది? ఎ) కొండవీటి సింహం బి) బొబ్బిలి పులి సి) యమగోల డి) తిరుగులేని మనిషి 12 ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ పాట రాసింది ఎవరు? ఎ) ఆత్రేయ బి) సీతారామశాస్త్రి సి) వేటూరి డి) ఆరుద్ర 13 టి. కృష్ణ దర్శకత్వంలో శోభన్‌బాబు హీరోగా నటించిన సినిమా? ఎ) రేపటి భారతం బి) వందేమాతరం సి) దేవాలయం డి) మనిషికో చరిత్ర 14 ‘అడవి రాముడు’ సినిమాలో రాజబాబు వేసిన వేషం? ఎ) వంటవాడు బి) ఫారెస్ట్ గార్డ్ సి) ఎన్టీఆర్ స్నేహితుడు డి) గూడెం మనిషి 15 ‘మాతృదేవోభవ’ చిత్ర దర్శకుడు ఎవరు? ఎ) క్రాంతికుమార్ బి) కె. విశ్వనాథ్ సి) కె. అజయ్‌కుమార్ డి) కె. రాఘవేంద్రరావు 16 ‘ఆకాశంలో బస్సు మబ్బులు’ వంటి వింత పద ప్రయోగాలతో నవ్వించిన హాస్యనటి ఎవరు? ఎ) శ్రీలక్ష్మి బి) రమాప్రభ సి) కోవై సరళ డి) మనోరమ 17 తన స్వీయ జీవిత కథతో రూపొందిన సినిమాతో నటిగా పరిచయమైన క్రీడాకారిణి ఎవరు? ఎ) పీటీ ఉష బి) అశ్వినీ నాచప్ప సి) మేరీ కోమ్ డి) మిథాలీ రాజ్ 18 హిందీ నటుడు అనిల్ కపూర్ నటించిన తెలుగు సినిమా? ఎ) గోరంత దీపం బి) వంశవృక్షం సి) తూర్పు వెళ్లే రైలు డి) రాజాధి రాజు 19 19జేడీ చక్రవర్తి అసలు పేరేంటి? ఎ) జొన్నవిత్తుల ధార్మిక చక్రవర్తి బి) జొన్నలగడ్డ ధర్మేంద్ర చక్రవర్తి సి) నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి డి) నల్లమలుపు శ్రీనివాస చక్రవర్తి సమాధానాలు: 1) ఎ 2) సి (‘సైజ్ జీరో’లోనూ ఏంజెల ఐటమ్ సాంగ్ చేశారు) 3) డి 4) బి 5) బి 6) డి 7) సి (వీవీ వినాయక్‌తో ‘ఆది’, ‘సాంబ’, ‘అదుర్స్’... రాజమౌళితో ‘స్టూడెంట్ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’) 8) డి 9) బి 10) ఎ 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) ఎ 17) బి 18) బి 19) సి 20) ఎ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచి 20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! -
నేనే విలన్
కమర్షియల్ సినిమాల్లో కథానాయికల సీన్ ఎంత? ఎక్కువగా అందాల కొలతలు చూపించేంత మాత్రమే! అప్పుడప్పుడూ అందంతో పాటు అభినయం చూపించడానికి ఆస్కారమున్న పాత్రలు లభిస్తే... ఎవరూ వదులుకోరు. తమ టాలెంట్ చూపించాలనుకుంటారు. చూపిస్తారు కూడా. ఇప్పుడు తనకు అటువంటి ఛాన్స్ వచ్చిందంటున్నారు రాశీఖన్నా. ‘సుప్రీమ్’, ‘శివమ్’ సినిమాల్లో అందంతో పాటు తనలోని కామెడీ యాంగిల్ చూపించారీ సుందరి. ఇప్పుడు ఏకంగా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళ సినిమాలో రాశీఖన్నా రఫ్ అండ్ టఫ్ పోలీసాఫీసర్‌గా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ‘‘వెండితెరపై ఇప్పటివరకూ నాలో చూడని కొత్త కోణం చూపిస్తా. విలనిజంతో మెప్పిస్తా. మలయాళంలో నా మొదటి చిత్రమిది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారామె. తెలుగు నటుడు శ్రీకాంత్, విశాల్, హన్సిక నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో మరికొందరు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపిస్తారట! -
బిలీవ్ ఇన్ యూ అంటున్న రాశిఖన్నా
సామాజిక స్పృహ ఉన్న నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. చేసేది వ్యాపారమే అయినా అందులోనూ ప్రజలకు అవసరమైనదో, వారికి స్ఫూర్తి నిచ్చే విషయాలు ఉండాలని భావించేవారు అరుదనే చెప్పాలి. వర్ధమాన నటి రాశిఖన్నా అలాంటి స్ఫూర్తిదాయకమైన ఒక వీడియోను ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ హైదరాబాదీ బ్యూటీ టాలీవుడ్లో కథానాయకిగా ఎదుగుతున్న నటి. అంతే కాదు కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే స్టేజీలో ఉంది. అయితే ఆదిలోనే మెడ్రాస్ కేఫ్ అనే హిందీ చిత్రంలో నటించింది. మొత్తానికి బహుభాషా నటిగా అవతారమెతి్తన రాశిఖన్నా తమిళంలో సైతాన్ కా బచ్చా అనే చిత్రంతో పాటు నయనతార నటిస్తున్న ఇమైకా నోడిగళ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో కోలీవుడ్‌లో తన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తెలుగులో కథానాయకిగా బిజీగా ఉన్న రాశిఖన్నా తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే లక్కీఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓకే నటిగా అమ్మడు చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నిర్మాతగా, కవిగానూ మారడం విశేషం. నిర్మాతగా అనగానే తనేదో చిత్రం నిర్మిస్తోందని అనుకోకండి. ఒక వీడియో ఆల్బమ్‌ను రూపొందించింది.బిలీవ్ ఇన్ యూ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌ను అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. బిలీవ్ ఇన్ యూ( నిన్ను నీవు నమ్ము)ఈ పేరే అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంది కదూ‘ ఇందులో ఒక కవితను కూడా రాశిఖన్నా రాసిందట. ఐయామ్ నాట్ ది సైజ్ ఆఫ్ మై జీన్స్ ..ఐయామ్ ది సైజ్ ఆఫ్ మై స్మైల్ వంటి అందరికీ, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిని కలిగించే కవితను రాశిఖన్నా ఈ ఆల్బమ్ కోసం రాసిందట.ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న ఈ వీడియో ఆల్బమ్ పొందే స్పందన కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు నటి రాశిఖన్నా పేర్కొంది. -
ఇద్దరికీ న్యాయం చేసే కథ ఇది
– కల్యాణ్‌రామ్ ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన నటుడి కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఎదురు చూపులకు శుక్రవారంతో తెరపడింది. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అన్న కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఓ కొడుకు హీరోగా, మరో కొడుకు నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి తండ్రి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నా సోదరుడు ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని నేను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్లోని స్టార్‌కి, నటుడుకి న్యాయం చేసేలా ఉంది. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా ఇప్పటికే రాశీఖన్నాను ఖరారు చేశారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహకుడిగా సీకే మురళీధరన్ వ్యవహరిస్తారు. నందమూరి రామకృష్ణ, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, ‘దిల్’ రాజు, శిరీష్, యలమంచిలి రవిశంకర్, కిలారు సతీష్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. -
అర్.. ర్..ర్.. ర్రే!
ఆర్ ఎప్పుడూ రైటే.ఆర్ ఎప్పుడూ రాంగ్ కాదు.ఆర్ ఎప్పుడూ రాణే.ఆర్తో మొదలైతే ఆరా తీయడం అంటూ ఏమీ ఉండదు.హీరోయిన్గా తీసుకోవడం హిట్ సాధించడం... అంతే.ఇప్పుడు తెలుగులో ‘ఆర్’ (తెలుగులో ర) అక్షరంతో మొదలయ్యే నలుగురు నాయికల కెరీర్ చూస్తుంటే.. ‘ఆర్’ ఫర్ రాకింగ్ అని మీరే అంటారు. రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, రెజీనా, రాయ్ లక్ష్మీ... ఈ నలుగురికీ 2016 మెమరబుల్.చదివితే అర్రే అని మీరే అంటారు. గ్లామర్‌లో హైపర్..కామెడీలో క్వీన్! కథానాయికలు కామెడీ చేస్తే భలే ఉంటుంది కదూ! ‘ఊరుకోండి.. మీరు చెప్పేది కామెడీగా ఉంది. ఓ నాలుగు పాటలు, ఐదు సీన్లలో హీరో పక్కన.. అయితే నవ్వుతూ లేదంటే బుంగమూతి పెట్టుకుని కనిపించడం తప్ప హీరోయిన్లు ప్రేక్షకుల్ని నవ్విస్తారా’ అనేగా మీ సందేహం. కావాలంటే ‘సుప్రీమ్’ సినిమా చూడండి. బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా భలే నవ్వించారు. ఈ ముద్దుగుమ్మ గతేడాది మూడు సినిమాలు చేశారు. అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గుర్తింపే తీసుకొచ్చాయి. వాటిలో నటిగా తన ప్రత్యేకతను చూపించే అవకాశం రాశీఖన్నాకు దక్కలేదు. ‘సుప్రీమ్’లో ఆ ఛాన్స్ రావడంతో చెలరేగారు. ఎస్ఐగా సీరియస్ డైలాగులు చెప్పి, నవ్వించారు. కామెడీగా ఫైట్స్ చేసి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. ‘సుప్రీమ్’ తర్వాత వచ్చిన ‘హైపర్’లో అయితే రాశీఖన్నా గ్లామర్డోస్ పెంచారనే చెప్పుకోవాలి. సినిమాలోనే కాదు.. ‘హైపర్’ ఆడియోకి వేసుకొచ్చిన డ్రస్ కూడా హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు బొద్దుగా ఉందని విమర్శించినోళ్లే, ఈ ఏడాది వచ్చిన సినిమాలు చూసి రాశీఖన్నా ముద్దు ముద్దుగా నవ్వించిందనీ, నటించిందనీ అంటున్నారు. మొత్తం మీద 2015తో పోల్చితే 2016 ఈ బ్యూటీకి కలిసొచ్చిందనే చెప్పాలి. కొత్త ఏడాదిలో గోపీచంద్ ‘ఆక్సిజన్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ఆల్రెడీ రెండు తమిళ సినిమాలకు సైన్ చేసేశారు. వెయిటింగ్ టు రాక్! సై్టల్.. స్మైల్.. గ్లామర్‌గా కనిపించే గట్స్... రెజీనాలో అన్నీ ఉన్నాయి. ఈ హీరోయిన్ యాక్టింగ్‌కి ప్రేక్షకులు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, ఆమె ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదు. ఈ ఏడాది రెజీనా రెండు సినిమాల్లో నటించారు. అవేవీ చెప్పుకోదగ్గ విజయాలు ఇవ్వలేదు. కానీ, కృష్ణవంశీ ‘నక్షత్రం’తో రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటున్నారు రెజీనా. ‘చందమామ’తో కాజల్ అగర్వాల్, ‘మొగుడు’తో తాప్సీ, ‘పైసా’తో కేథరిన్... ఈతరం హీరోయిన్లకు గ్లామర్ పరంగా కృష్ణవంశీ బ్రేక్ ఇచ్చారు. ‘నక్షత్రం’లో రెజీనా ఇప్పటివరకూ కనిపించనంత అందంగా ఉంటుందన్నట్లు ఆమె బర్త్‌డేకి ఓ సాంపిల్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ఈ చెన్నై బ్యూటీని రాక్‌స్టార్‌గా అభివర్ణించారు కృష్ణవంశీ. మరి, సినిమా రిలీజయ్యాక రెజీనా ఏమాత్రం రాక్ చేస్తారో చూడాలి. తెలుగు సంగతి పక్కన పెడితే... రాకింగ్ హీరోయిన్ల జాబితాలో రెజీనాని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, 2016 ఆమెకు హిందీ సినిమాకి అవకాశం తెచ్చిపెట్టిన సంవత్సరం. అమితాబ్ బచ్చన్, అనిల్‌కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సి వంటి స్టార్స్ నటించనున్న హిందీ ‘ఆంఖే–2’లో ఛాన్స్ రావడంతో రెజీనా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది కాకుండా తమిళంలో ఓ ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. కుర్రాళ్లకు పరేషానురా.. ప్రేమలో పడితే పరేషాను ఉంటుందో? లేదో? తెలియదు గానీ... ‘ధృవ’లో రకుల్‌ప్రీత్ సింగ్‌ను చూస్తే కుర్రాళ్లకు పరేషాను తప్పదు. అందమే అసూయ పడేలా ‘పరేషాను రా..’ పాటలో రకుల్ గ్లామర్‌తో రాక్ చేశారు. అందమేనా... సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’, తర్వాత ‘సరైనోడు’, ఇప్పుడు థియేటర్లలో ఉన్న ‘ధృవ’ ఈ ఏడాది హీరోయిన్గా నటించిన మూడు సినిమాల్లోనూ అభినయంతో రకుల్ రఫ్ఫాడించేశారు. గతేడాది ఈమె చేసిన సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. అప్పుడు రకుల్‌పై గ్లామర్ డాల్ ముద్ర వేశారు. అందం వల్లే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడీ గాళ్ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ ఇరగదీస్తుందని అంటున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో అందం, అమాయకత్వం గల అమ్మాయిగా నటించడమే కాదు... ఆ పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ‘సరైనోడు’లో అయితే.. మేకప్ లేకుండా ఎమోషనల్ సీన్స్‌లో నటించిన తీరు నటిగా రకుల్‌కి రెస్పెక్ట్ తెచ్చిపెట్టింది. ఇక, ‘ధృవ’తో ముచ్చటగా మూడో హిట్ అందుకుని రాకింగ్ స్టార్ అయ్యారు. ముచ్చటగా మూడు విజయాలతో జోష్ మీద ఉన్న రకుల్‌కి వచ్చే ఏడాది కూడా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే, డైరీ ఫుల్. మహేశ్‌బాబు – ఏఆర్. మురుగదాస్ సినిమా, సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’, బోయపాటి శ్రీను – బెల్లంకొండ సాయి సినిమా.. కొత్త ఏడాది కూడా మినిమమ్ మూడు సినిమాలతో రకుల్ ప్రేక్షకుల ముందు రావడం గ్యారెంటీ. వీటితో పాటు తమిళ సినిమాలకు కూడా సైన్ చేశారు. రాకింగ్ ఐటమ్ ఒక్క పాట... ఒక్కటంటే ఒక్క పాట.. అది కూడా ఐటమ్ పాట. తెలుగులో రాయ్‌లక్ష్మీకి మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఐటమ్ గాళ్ కేటగిరీలో ఈ ఏడాది రాక్‌స్టార్ ఎవరంటే... రాయ్‌లక్ష్మీ పేరే లిస్టులో ముందుంది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్‌తో కలసి రాయ్‌లక్ష్మీ స్టెప్పులేశారు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ‘తప్పు తప్పే... శుద్ధతప్పే’ అనే పాట సూపర్ హిట్. అందులో ఆమె స్టెప్పులు, ఆమె గ్లామర్ కూడా హిట్టే. హీరోయిన్గా పదేళ్ల కెరీర్లో ఈమెకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కానీ, ఐటమ్ గాళ్‌గా రాకింగ్ స్టెప్పులతో ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్ చేసిన రాయ్‌లక్ష్మీ, రానున్న సంక్రాంతికి రిలీజవుతోన్న ‘ఖైదీ నంబర్ 150’ కోసం చిరంజీవితో కలసి స్టెప్పులేశారు. మరి, అందులో ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందో!! ఈ పాటలను పక్కన పెడితే.. సౌత్‌లో పదేళ్లకు పైగా పలు సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడీ భామ ‘జూలీ–2’తో హిందీలో హీరోయిన్గా అడుగు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. 2016లో అతిథిగా కనిపించిన ‘అఖీరా’తో తొలిసారి హిందీ తెరపై కనిపించారు. అది చేస్తున్నప్పుడే ‘జూలీ–2’లో కథానాయికగా అవకాశం కొట్టేశారు. ఆ రకంగా రాయ్‌లక్ష్మీకి ఈ ఏడాది మెమరబుల్ అవుతుంది. ‘ఆర్’ అంటే హిట్టే! ఓ పాతికేళ్లు వెనక్కి వెళితే... అప్పట్లో తిరుగులేని తారలు అనిపించుకున్న రాధికా, రాధ, రేవతి తదితరుల పేర్లు ‘ఆర్’తో మొదలైనవే. విశేషం ఏంటంటే.. తమిళ దర్శకుడు భారతీరాజా తాను పరిచయం చేసే కథానాయికలకు ‘ఆర్’ అక్షరం వచ్చేట్లు పేరు పెడతారు. రాధ అసలు పేరు ఉదయచంద్రిక. ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ సినిమా ద్వారా ఆమెను పరిచయం చేస్తూ, ‘రాధ’గా మార్చారు. విలక్షణ నటి రేవతి తొలి పరిచయం కూడా భారతీరాజా సినిమాతోనే జరిగింది. ‘మన్వాసనై’ అనే సినిమాకి రేవతిని నాయికగా ఎన్నుకున్న తర్వాత ‘ఆశా కుట్టి నాయర్’ అనే ఆమె పేరుని రేవతిగా మార్చారు. ‘ఆర్’ అక్షరంతో మొదలయ్యే మరో నటి రాధిక. ఆమె రియల్ నేమ్‌తోనే స్క్రీన్‌కి పరిచయమయ్యారు. అయితే పరిచయం చేసింది మాత్రం భారతీరాజానే. ‘కిళక్కే పోగుమ్ రైల్’ ద్వారా ఆయన రాధికను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె తిరుగు లేని తార అయ్యారు. అలాగే రతీ ఆగ్నిహోత్రిని పరిచయం చేసింది కూడా భారతీరాజానే. ‘పుదియ వార్పుగళ్’ చిత్రం ద్వారా కథానాయికగా తమిళ్ తెరకు పరిచయమైన ఈ హిందీ అమ్మాయి ఆ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యారు. నిత్యానంద స్వామితో లింకప్ వార్తల్లో నిలిచిన రంజిత అసలు పేరు శ్రీ వల్లి. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘నాడోడి తెండ్రల్’ ద్వారా ఆమె తమిళ తెరకు పరిచయమయ్యారు. రాధ, రాధిక, రేవతిల రేంజ్ స్టార్డమ్ తెచ్చుకోకపోయినా రంజిత బాగానే పేరు తెచ్చుకున్నారు. దక్షిణాదిన తిరుగు లేని నాయిక అనిపించుకున్న రోజాకి నామకరణం చేసింది కూడా భారతీరాజానే. ఆమె అసలు పేరు శ్రీలత. ‘ప్రేమ తపస్సు’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారతీరాజా తొలి దృశ్యానికి క్లాప్ ఇచ్చి, రోజాకి పేరు పెట్టారు. నాటి, నేటి తారల్లో ‘ఆర్’తో పేరు మొదలైనవాళ్లు రాక్ చేస్తున్నారు కాబట్టి, ఈ అక్షరం కలిసొస్తుందని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. ఇదండి సంగతి...రకుల్, రాశీ, రెజీనా,రాయ్ లక్ష్మీల కెరీర్ చూస్తుంటే... ‘ఆర్’ ఫర్ రాకింగ్ అనొచ్చు కదూ! -సత్య పులగం -
అరే అదిరిందే..!
గర్ల్ ఫ్రెండ్‌తో కలసి గాలిలో కాలర్ ఎగరేస్తూ ఓ కుర్రాడు దాబాకు వెళ్లాడు. అక్కడున్న ఓ అమ్మాయికి ఇతడి స్టైల్ తెగ నచ్చేసింది. ‘అరే అదిరిందే నువ్వు గాలిలో కాలర్ ఎగరేసి వస్తుంటే..’ అంటూ పాటందుకుంది. ఆ కుర్రాడు కాలరెగరేసి గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయితో కలసి చిందేశాడు. ఈ ముగ్గురి చిందులూ చూడాలంటే ‘ఆక్సిజన్’ రిలీజ్ వరకూ వెయిట్ చేయమంటున్నారు నిర్మాత ఎస్. ఐశ్వర్య. గోపీచంద్, రాశీఖన్నా జంటగా ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆమె నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ - ‘ఆక్సిజన్’. ఈ చిత్రంలో ‘అరే అదిరిందే..’ అంటూ శ్రీమణి రాసిన ప్రత్యేక గీతాన్ని బృందా మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతంలో సాక్షీ చౌదరి సందడి చేయనున్నారు. ఆమెతో పాటు గోపీచంద్, రాశీఖన్నా, అలీలు కాలు కదుపుతున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో పాటను డిసెంబర్లో పుణేలో చిత్రీకరించనున్నారు. జగపతిబాబు, ‘కిక్’ శ్యామ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా. -
ఇమైక్కా నోడిగళ్ కోసం భారీ సెట్
సాధారణంగా కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తాయి. మరికొన్ని వినోదాన్ని అందిస్తాయి. ఇక తక్కువ చిత్రాలు మాత్రమే థియేటర్లలో ప్రేక్షకుల్ని కదలకుండా కట్టి పడేస్తాయి. అలాంటి చిత్రంగా ఇమైక్కా నోడిగళ్ ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. తొలి చిత్రం డిమాంటీ కాలనీతోనే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ స్కూల్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. యువ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ పాపులర్ నటి రాశీఖన్నా హీరోయిన్గా తమిళ చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. కాగా ప్రముఖ నటి నయనతార కీలక పాత్రలో నటించడం విశేషం. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలోని ఎంజీఆర్ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఎంజీఆర్ ఫిలింసిటీలో ఈ చిత్రం కోసం బ్రహ్మాండమైన సెట్‌ను వేసి చిత్రీకరణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభానికి ముందే ఇమైక్కా నోడిగళ్ చిత్రం ఇటు చిత్ర వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచనాలను ఏర్పరచిందన్నారు. వాటిని కచ్చితంగా రీచ్ అవుతుందనే విశ్వాసాన్ని నిర్మాత సీజే.జయకుమార్ వ్యక్తం చేశారు. -
దసరా.. చలో రామ్‌లీలా! - రాశీ ఖన్నా
విజయదశమి వచ్చిందంటే ఢిల్లీ అంతా సందడి నెలకొంటుంది. ఢిల్లీలో దసరా పండగను బాగా జరుపుకుంటారు. చిన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసేవాళ్లం. పూజలో చెప్పే కథలను శ్రద్ధగా వినేదాన్ని. ఆ తర్వాత రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ దహన కార్యక్రమానికి వెళ్లేవాళ్లం. హీరోయిన్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లడానికి కుదరడంలేదు. దసరా సమయంలో ఇంట్లో అందర్నీ కలిసే అవకాశం తక్కువసార్లు లభించింది. ఇప్పుడు అమ్మానాన్నలు కూడా హైదరాబాద్ వచ్చేశారు. ఈరోజు నా కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ. త్వరగా షూటింగ్ ముగించుకుని సాయంత్రం పూజకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నా. -
అందర్నీ బతికిద్దాం!
‘బతకడం మన లక్ష్యం.. ఎదగడం కోసం యుద్ధం చేయడం మన కర్తవ్యం.. మనం బతుకుదాం.. అందర్నీ బతికిద్దాం’ అనే కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఆక్సిజన్’. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, అనూ ఇమ్మానుయేల్ కథానాయికలు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఓ వైపు చిత్రీకరణ చేస్తూ, మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించాం. సెప్టెంబర్‌లో పాటల్ని, చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: వెట్రి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: యువన్ శంకర్ రాజా. -
ప్రతి ఇంట్లో ఒకడుంటాడు!
‘‘రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కి, సినిమాలో క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్లుండే టైటిల్. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ‘హైపర్’గా ఉండేవారు ఒకరుంటారు. అలాంటి కుర్రాడి కథ ఇది’’ అన్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘హైపర్’ టైటిల్ పరిశీలనలో ఉందన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అనేది ఉపశీర్షిక. ఆగస్టు 3న ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘కుటుంబ నేపథ్యంలో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర. -
గాల్లో తేలిన రాశీఖన్నా!
గాల్లో తేలే ఆటలు ఆడటమంటే గుండె ధైర్యం కావాలి. స్కై డైవింగ్ ద్వారా ఆ ధైర్యాన్ని ప్రదర్శించిన హీరోలు చాలామందే ఉన్నారు. హీరోయిన్లలో కూడా సరదాగా గాల్లో తేలినవాళ్లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రాశీఖన్నా చేరారు. ఈ ఢిల్లీ బ్యూటీ ఎప్పట్నుంచో స్కై డైవ్ చేయాలనుకుంటున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారామె. 14000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేశారు. అంత ఎత్తు నుంచి దూకడం ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించిందని రాశి పేర్కొన్నారు. గాల్లో తేలుతున్నప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేనని కూడా అన్నారామె. ఇంతకీ రాశీఖన్నా ఎక్కడ స్కై డైవ్ చేశారనే విషయంలోకి వస్తే.. తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో జరిగిన ‘ఆటా’ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె అక్కడికెళ్లారు. అమెరికాలో స్కె డైవ్ చేశారు. గాల్లో తేలుతున్న ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అది చూసినవాళ్లు.. ‘పైకి సుకుమారంగా కనిపించే రాశి ధైర్యవంతురాలే’ అని కితాబులిచ్చారు. -
రాశీలాంటి అమ్మాయి భార్యగా అంటే...
నో కన్ఫ్యూజన్ యూత్ ఎప్పుడూ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఏది ఫ్రెండ్షిప్? ఏది రిలేషన్షిప్? ఏది లవ్? ఏది ఎట్రాక్షన్? ఏది టైమ్ పాస్? ఏది లైఫ్ టైమ్? ఈ డౌట్స్ అన్నిటికీ సైకాలజిస్టుల దగ్గర ఆన్సర్ దొరుకుతుంది. ఐతే, అంతకన్నా మంచి పని... ఈ ‘స్వీట్ చాట్’ చదవడం. ఎందుకంటే.. రాశీఖన్నా, సాయిధరమ్తేజ్లకు లవ్ మీద, లైఫ్ మీద.. మంచి క్లారిటీ ఉంది. మీ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్సా? మామూలు ఫ్రెండ్సా? రాశి: మేం ఒకే ఫ్రొఫెషన్‌లో ఉన్నాం. కలిసి పనిచేయడం వల్ల ఎవరు ఏంటన్నది అవగాహన వస్తుంది. మంచి స్నేహం ఏర్పడుతుంది. మా మధ్య ఉన్నది మంచి స్నేహం. ప్రొఫెషనల్‌గా అడ్వయిజ్ తీసుకోవడానికి వెనకాడను. మరీ.. పర్సనల్ విషయాలంటే షేర్ చేసుకోను. సాయిధరమ్ తేజ్: నాది కూడా సేమ్ ఫీలింగ్. రాశి నాకు మంచి ఫ్రెండ్. అయితే నా మిగతా ఫ్రెండ్స్‌తో ఉన్నంత చనువుగా తనతో ఉండలేను. ప్రొఫెషనల్‌గా అయితే సెట్లో ఉన్నప్పుడు తను మంచి ఫ్రెండ్ అని మాత్రం పక్కాగా చెప్పగలను. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. చిన్నప్పుడు నవీన్ అనే మంచి ఫ్రెండ్ ఉండేవాడు. నా ఫ్రెండ్స్‌లో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయింది. అందరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి మా కంఫర్ట్ లెవల్ బాగుంటాయి. రాశీతో అది కుదరకపోవచ్చు. రాశీలో మంచి ఫ్రెండ్ ఉంటుందా? గాళ్ ఫ్రెండ్ ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీకు ఏమనిపించింది? సాయి: నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ చేయాలి? అని నేను తెగ ఆలోచించేవాణ్ణి. ఒక్కోసారి డల్ అయ్యేవాణ్ణి. అప్పుడు రాశీ ‘ఎందుకంత కంగారు పడుతున్నావ్? కూల్‌గా ఉండు’ అని ధైర్యం చెప్పేది. యాజ్ ఏ ఫ్రెండ్ సపోర్టివ్‌గా ఉంటుంది. రాశి మంచి కూతురు కూడా. షూటింగ్ టైమ్‌లో ఎక్కువగా వాళ్ల మదర్తోనే కనిపించేది. వాళ్ల నాన్నతో కూడా రాశీకి ఎక్కువ అటాచ్మెంట్. ఆ ముగ్గుర్నీ చూసినప్పుడు మంచి ఫ్యామిలీ అనిపించేది. ఇక.. రాశీ మంచి గాళ్ ఫ్రెండా? అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే, నేను తనను ఆ యాంగిల్లో చూడలేదు. మరి.. సాయిధరమ్ గురించి మీరేమంటారు? రాశి: చాలా మంచి అబ్బాయి (నవ్వుతూ). యాజ్ ఎ ఫ్రెండ్ వెరీ సపోర్టివ్. నాలానే తను కూడా అమ్మ కూచి. సాయినీ, వాళ్ల అమ్మనీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. తను మంచి కొడుకు కూడా. మంచి బాయ్‌ఫ్రెండా? అనే విషయం గురించి మాత్రం చెప్పలేను. ఓవరాల్ పర్సన్ గురించి చెప్పమంటే ‘గుడ్ హ్యూమన్ బీయింగ్’. రాశీలాంటి అమ్మాయి భార్యగా అంటే.. ఆ భర్త జీవితం బాగుంటుందా? సాయి: తను చాలా అడ్జెస్టబుల్. ఓపిక ఎక్కువ. సెట్స్‌లో మేం చూసేవాళ్లం కదా. ఏదైనా సీన్ కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ముందు ‘ఊహూ..’ అన్నప్పటికీ తర్వాత అడ్జస్ట్ అయ్యి చేసేసేది. అలాంటి నేచర్ ఉన్న అమ్మాయి కచ్చితంగా మంచి భార్యే అవుతుంది. మరి.. సాయి మంచి భర్త అవుతాడా? రాశి: ఆడవాళ్లను గౌరవించే ఏ మగాడైనా మంచి భర్తే అవుతాడు. అమ్మను బాగా చూసుకునేవాళ్లు భార్యను బాగా చూసుకుంటారు. సో.. సాయి గుడ్ హజ్బెండ్ అవుతాడు. సాయిలాంటి క్వాలిటీస్ ఉన్న భర్త రావాలనుకుంటున్నారా? రాశి: సాయిలాంటోడా? అస్సలు వద్దండి. సాయికన్నా మంచి ఎత్తు ఉన్న అబ్బాయిని భర్తగా కోరుకుంటున్నా. టూ మచ్ రాశి.. సాయి మంచి హైటే కదా.. సాయి: ఆవిడగారి ముందు నేను చాలా పొట్టి (టీజింగ్‌గా చూస్తూ) అని ఫీలవుతోందేమో. నేనెంతండీ... ఆరుడగులకు దగ్గర దగ్గరగా ఉంటానేమో. మేడమ్‌కి 6.2.. ఆ రేంజ్ కావాలేమో. సాయి.. రాశీ లాంటి అమ్మాయిని భార్యగా కోరుకుంటారా? సాయి: ఇలాంటి లక్షణాలున్న అమ్మాయి రావాలనుకోవడం వేరు. ఈ అమ్మాయే కావాలనుకోవడం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనీ రెండు విషయాల గురించి ఆలోచించడంలేదు. అంత వయసు కూడా నాకు లేదు. నాకెంతండీ జస్ట్ పంతొమ్మిదేళ్లే (చమత్కారంగా). అవునూ.. ‘సుప్రీమ్’ షూటింగ్ అప్పుడు ‘రాశీ కా స్వయంవర్’ అని ఏదో ఆట ఆడారట? సాయి: ఓ.. అదా. కరీంనగర్లో షూటింగ్ చేయడానికి వెళ్లాం. నేను, ‘సత్యం’ రాజేష్, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, ‘దిల్’ రాజుగారు, అనిల్ రావిపూడి, ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులున్నారు. అప్పుడందరం కలిసి ‘రాశీ కా స్వయంవర్’ అంటూ ఓ చిన్న గేమ్ ప్లాన్ చేశాం. ఆ గేమ్‌లో విన్నర్ ఎవరో తెలుసా? ‘వెన్నెల’ కిశోర్. స్వయంవరం పేరుతో మిమ్మల్ని ఆటపట్టించారు కదా.. మరి సాయి గురించి ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ చెబుతారా? రాశి: (నాన్‌స్టాప్‌గా నవ్వుతూ). ఒక్క ఇన్సిడెంట్ ఉందండి.. ఎప్పుడు తల్చుకున్నా నవ్వొచ్చేస్తుంది. సాయి: నాకు తెలుసు.. ఏం ఊహించుకుని నవ్వుతున్నావో? ఈ సినిమాలో పిల్లనడగడానికి నేను పంచె కట్టుకుని రాశీ వాళ్ల ఇంటికి వెళతాను కదండీ. ఆ సీన్ తీసేటప్పుడు నేను జోరుగా డైలాగ్‌లు చెబుతూ, అన్నీ మర్చిపోయి యాక్ట్ చేస్తున్నా. ఇంతలో కాళ్లకు చల్లగాలి తగిలినట్లనిపించినా పట్టించుకోలేదు. అందరూ నన్నే చూసి నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు కింద చూసుకుంటే పంచె లేదు. ఎప్పుడు జారిపోయిందో తెలియదు. రాశి : భలే ఊహించావే. నేనూ దాని గురించే చెబుదామనుకున్నా. నిజంగానండి.. ఒంటి మీద స్పృహ లేనట్లు పంచె జారిపోయింది కూడా పట్టించుకోకుండా యాక్ట్ చేశాడు. సిన్సియర్ ఆర్టిస్ట్ కదా (భుజాలెగరేస్తూ). ఓకే రాశి... మీ ఇద్దరికీ ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్‌తో సాయిధరమ్ లవ్ అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ ఫ్రెండ్ ఎప్పుడైనా మీకీ విషయం చెప్పారా? సాయి: రెజీనా అని డెరైక్ట్‌గా అడిగేయొచ్చు కదండి.. ఏం చెబుతావో చెప్పు రాశి. రాశి: దట్స్ నాట్ ట్రూ. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. కొంచెం చనువుగా ఉన్నా, వరుసగా మూవీస్ చేస్తున్నా అలాగే రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. సాయి: అవునండి. కంటిన్యూస్‌గా రెండు సినిమాలు కలిసి చేస్తే, ఏదో ఉన్నట్లేనా? పాత సినిమాల్లో చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు, వెంకటేష్‌గారు.. రిపీట్ కాంబినేషన్లలో సినిమాలు చేసేవారు. అప్పుడు ఇటువంటి రూమర్స్ లేవండి. కానీ, ఇప్పుడు రెండే రెండు సినిమాల్లో కలిసి చేసినా, పెద్ద విషయం అయిపోతోంది. రాసేవాళ్లను మనం ఆపలేం. నిజంగానే లవ్‌లో ఉంటే నేనా విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తా. అవును రాశీ.. మిమ్మల్ని ఏ హీరోతోనూ లింకప్ చేసి, వార్తలు రావడంలేదేం? రాశి: ఎందుకండీ. నేనిలా ఉండటం మీకిష్టం లేదా? సాయి: అయినా ఇంకా రాశి ఒకే హీరో సరసన రెండు సినిమాలు చేయలేదు కదా. చేస్తే కచ్చితంగా తన గురించి కూడా రూమర్స్ వచ్చేస్తాయ్ (నవ్వేస్తూ). ఓకే.. మీలో ఒకరికొకరు గమనించిన బ్యాడ్ క్వాలిటీస్? సాయి: తను ఎక్కువ నవ్వుతుందండి. ఒకసారి రాత్రి మూడు గంటల వరకూ షూటింగ్ చేశాం. ఆరోజు నేను ఫైట్ సీన్ చేసి, అలసిపోయాను. ఎప్పుడెప్పుడు అవుతుందా? అని నేను ఆలోచిస్తుంటే.. రాశి నవ్వడం స్టార్ట్ చేసింది. ఆ నవ్వు వల్ల ఆరు టేక్స్ తీసుకున్నాం. దాంతో ‘ఏయ్, చంపేస్తాను.. విసుగు తెప్పించకు. నువ్వు నవ్వితే నావల్ల కాదు. నాకూ నవ్వొస్తోంది’ అని సరదాగా వార్నింగ్‌లాంటిది ఇచ్చా. ఆ తర్వాత కాసేపు బుద్ధిగా ఉన్నా.. మళ్లీ మామూలే. సిట్యువేషన్ పట్టించుకోకుండా అలా నవ్వడం బ్యాడ్ రాశి. రాశి: ఆ.. నీక్కూడా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయిలే. ఎప్పుడూ ఫోన్లో చాట్ చేస్తుంటాడండి. పరిసర ప్రాంతాలను మర్చిపోయి మరీ ఫోన్‌తో ఎంగేజ్ అయిపోతాడు. వాళ్ల మమ్మీ దగ్గర కంప్లైంట్ చేశా. ఫోన్లో సాయి ఎవరితో చాట్ చేస్తున్నారో చూశారా? రాశి: అంత డీప్ విషయాలు పట్టించుకోను (నవ్వుతూ). ఎప్పుడైనా రాశి మీకేమైనా వండి తెచ్చిందా? సాయి: అబ్బే లేదండి. ఆవిడగారు వండి పెట్టాలంటే దానిక్కూడా ఆరడుగుల హైట్ ఉండాలేమో (నవ్వుతూ). రాశి: మరీ చెబుతున్నావ్... ఒకసారి నేను షూటింగ్ లొకేషన్‌కి కప్ కేక్స్ తెచ్చాను కదా.. మర్చిపోయావా? సాయి: యస్.. కప్ కేక్స్ బేకరీ నుంచి కొనుక్కొచ్చిందండి. ఇంతకీ మీ ఫస్ట్ లవ్? సాయి: ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజినీరింగ్ వరకు చాలామంది అమ్మాయిల్ని ‘ఆర్య’లో పాటలా ‘ఫీల్ మై లవ్...’ అంటూ వెంటపడ్డా. వర్కవుట్ కాలేదు. అందుకే అటువైపు ఫోకస్ మానేసి, సినిమాలపై పెట్టా. రాశి : నేనెవర్నీ లవ్ చేయలేదు. నన్ను కూడా ఎవరూ లవ్ చేయలేదు (గట్టిగా నవ్వేస్తూ). ఫ్రెండ్షిప్ వేరు. అట్రాక్షన్ వేరు. ఫ్రెండ్‌ని ఫ్రెండ్‌లానే చూస్తాం తప్ప వాళ్ల గురించి వేరే ఏ ఫీలింగ్స్ ఉండవు. లవర్ని ఫ్రెండ్‌లా చూడొచ్చు కానీ, ఫ్రెండ్‌ని లవర్‌లా చూడలేం. ‘‘ఈ అమ్మాయి నాతోనే ఉండాలి’’ అనే ఫీలింగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్న అమ్మాయితో కలగదు కదా. అలా ఎవరైనా అమ్మాయి కనెక్ట్ అయినప్పుడు ప్రపంచం మొత్తం మారిపోతుంది. జీవితం అంటే ఇదే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ వేరు.. రిలేషన్షిప్ వేరు. రిలేషన్షిప్లో ఉన్నవాళ్లతో జీవితం పంచుకుంటాం. ఫ్రెండ్స్‌తో జీవితం పంచుకోం. కానీ, ఫ్రెండ్స్ ఉండాలండి. నాకు చాలామంది ఉన్నారు. ఎనీ టైమ్ ఏదైనా చెప్పుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మంచి ఫ్రెండ్స్ ఉంటే జీవితం బాగుంటుంది. - డి.జి. భవాని -
జాలీ రైడ్...
మెగా కాంపౌండ్ నుంచి వెండితెరపైకి దూసుకొచ్చిన మిసైల్ సాయిధరమ్ తేజ్. సక్సెస్ ట్రాక్‌లో ఉన్న సాయిధరమ్ ‘సుప్రీమ్’ సినిమాతో సమ్మర్లో సందడి చేయడానికి వచ్చేశారు. ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం గురువారం తెరకొచ్చింది. ‘సుప్రీమ్’ ఎలా ఉందో తెలియాలంటే కథలోకి వెళాల్సిందే... కథ ఏంటంటే: అనంతపూర్‌లో తరతరాలుగా వేలాది మందికి అన్నం పెట్టే జాగృతి ట్రస్ట్‌ను విక్రమ్ సర్కార్ (కబీర్ సింగ్) అనే వ్యాపారవేత్త దక్కించుకుని, విదేశీ కంపెనీలకు అమ్మే ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలో ఆ ట్రస్టులో ఆశ్రయం పొందుతున్నవారందరూ నిరాశ్రయులవుతారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సంపాదించి ఎలాగైనా ట్రస్టుని దక్కించుకోవాలని నిర్వాహకుడు నారాయణ రావు (సాయికుమార్) అనుకుంటాడు. ఆ ట్రస్టును చాలా ఏళ్ల క్రితం అరికెపూడి రాఘవరావు అనే రాజవంశీకుడు ప్రజల కోసం దానం చేస్తాడు. దానికి సంబంధించిన పేపర్లు ఆయన వారసుల దగ్గర ఉంటాయి. కానీ, వారి జాడ మాత్రం తెలియదు. అందుకే నారాయణ రావు వాటిని కోర్టులో దాఖలు చేయడానికి సమయం అడుగుతాడు. వారసుడు కోసం నారాయణరావు అన్వేషణ మొదలుపెడతాడు. మరోవైపు విక్రమ్ సర్కార్ రంగంలోకి దిగి, వారసుణ్ణి వెతికిపట్టుకుని, తానే డాక్యుమెంట్స్ దక్కించుకుని వాటిని నాశనం చేయాలనుకుంటాడు. కట్ చేస్తే... వారసుడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలు (సాయిధరమ్ తేజ్) అనే ట్యాక్సీ డ్రైవర్ కథలోకి ఎంటరవుతాడు. బాలూది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. అతని తండ్రి (రాజేంద్రప్రసాద్)ని స్నేహితులే ఆస్తి విషయంలో మోసం చేయడంతో వాళ్ల జీవితం తలకిందులవుతుంది. ఆ దిగులుతో తండ్రి తాగుడుకు బానిసైపోతాడు. అయినప్పటికీ ‘ఆయనే నా హీరో’ అంటూ బాలు కంటికిరెప్పలా చూసుకుంటాడు. ఇలా సాగుతున్న వీళ్ల లైఫ్‌లోకి రాజన్ (మిఖైల్ గాంధీ) అనే పిల్లాడు ఎంటరవుతాడు. తన చిన్న మాటలతో వాళ్ల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొ స్తాడు. ఇంతలో రాజన్‌కు అనుకోని ప్రమాదం ఏర్పడుతుంది. ఆ పిల్లాడెవరు? అతని కోసం బాలు ఏం చేశాడు? తాను ప్రేమించిన పోలీసాఫీసర్ బెల్లం శ్రీదేవి (రాశీఖన్నా) ప్రేమను పొందగలుగుతాడా? అనేది మిగతా కథ... ఓ ఊరును కాపాడటానికి హీరో ఏం చేశాడు? అనే కాన్సెప్ట్‌ను ఎంటర్టైనింగ్గా చెప్పడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు అనిల్ రావిపూడి. యాక్షన్, డ్యాన్స్, ఎమోషనల్.. ఇలా అన్ని సీన్స్‌లోనూ సాయిధరమ్ భేష్ అనిపించుకున్నారు. బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా నటన బాగుంది. చిరంజీవి హిట్ సాంగ్ ‘అందం హిందోళం.. అధరం తాంబూలం’ రీమిక్స్ ఓ హైలైట్. పక్కా మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్కి కావాల్సిన అంశాలతో తీసిన జాలీ రైడ్ ‘సుప్రీమ్’. చిత్రం: సుప్రీమ్, తారాగణం: సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, కబీర్‌సింగ్, రవికిషన్, రఘుబాబు, మాస్టర్ మిఖైల్ గాంధీ... సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, ఎడిటర్: ఎం.ఆర్. వర్మ, నిర్మాత: శిరీష్, సమర్పణ: ‘దిల్’ రాజు, దర్శకత్వం: అనిల్ రావిపూడి. -
రాశీ అందం.. గీతా గీతం
సినీనటి రాశీఖన్నా అందాల మెరుపులు.. సింగర్ గీతామాధురి మధురమైన గీతాలతో కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మారుమోగింది. కళాశాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ శ్రీశైలంరెడ్డి, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ చైర్మన్ సీహెచ్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, హైదరాబాద్ -
తెలుగింటి పచ్చడి భలే టేస్టీ..
రెండేళ్లుగా హైదరాబాద్ నా హోమ్ టౌన్ అయిపోయింది. నా సొంత ఊరు ఢిల్లీకి చుట్టపు చూపుగా వెళ్లి రావడం తప్ప.. అక్కడున్న రోజులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందుకే ఇక్కడికి మకాం మార్చేయాలనుకున్నా. ప్రస్తుతానికైతే అద్దె ఇంట్లో ఉంటున్నా. త్వరలో సొంత ఇల్లు కొనుక్కుంటాను. తెలుగు పరిశ్రమకు దగ్గరగా ఉండాలనే ఆకాంక్షతో పాటు ఈ సిటీ చాలా నచ్చింది. అందుకే ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిపోయా. తెలుగు కూడా కొంచెం కొంచెం మాట్లాడగలుగుతున్నా. షూటింగ్లో భాగంగా నేను హైదరాబాద్‌లో చాలా ప్లేసెస్‌కి వెళ్లాను. వంటకాల గురించి చెప్పాలంటే.. తెలుగింటి పచ్చళ్లు భలే రుచిగా ఉంటాయి. నాకిక్కడ ఎక్కువగా నచ్చేవి అవే. పండగలప్పుడు సిటీ చాలా సందడిగా ఉంటుంది. వినాయక చవితి చెప్పక్కర్లేదు. రంజాన్ మాసంలో ఓల్డ్ సిటీకి కొత్త కళ వచ్చేస్తుంది. నేను ఢిల్లీ అమ్మాయినే అయినా ఇప్పుడు ‘హైదరాబాదీ గాళ్’ అనిపించుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఓవరాల్‌గా హైదరాబాద్‌లో నా జీవితం చాలా హాయిగా ఉంది. రాశిఖన్నా -
ఈ టైగర్ చాలా స్పెషల్!
ఫైర్‌బ్రాండ్‌లా దూసుకెళ్లిపోవడం అతని హాబీ. మాటల్లో హుషారు, చేతల్లో స్పీడ్ మాత్రం మిస్ కాడు. ఈ స్పీడ్, హుషారు చూసి ఇద్దరు అందమైన భామలు అతనికి కనెక్ట్ అయిపోయారు. లక్ష్యాన్ని చేరుకుంటూనే ఈ యువకుడు ఎవరి ప్రేమలో పడ్డాడు? ఆ సంగతి తెలియాలంటే ‘బెంగాల్ టైగర్’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. రవితేజ, తమన్నా, రాశీఖన్నా నాయకా నాయికలుగా కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ చివరి వారంలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘భీమ్స్ స్వరపరిచిన పాటలు టాప్ చార్ట్‌లో ఉన్నాయి. రవితేజ, తమన్నా, రాశీఖన్నా పోటీపడి మరీ డాన్స్ చేశారు. ట్యూన్స్‌కు తగ్గట్టే డ్యాన్స్ మూమెంట్స్ కూడా హుషారుగా ఉంటాయి’’ అని చెప్పారు. ఈ నెల 26 లేదా 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. తమన్నా మాట్లాడుతూ- ‘‘నిర్మాత రాధామోహన్‌కు సినిమా అంటే చాలా ప్యాషన్. అందుకు తగ్గట్టే ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా తీశారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు. ఈ సినిమా తమకు చాలా స్పెషల్ అని రాశీఖన్నా అన్నారు. ‘‘నేను సంగీతం అందించిన ఆరో సినిమా ఇది. రవితేజ లాంటి స్టార్ సినిమాకు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ చెప్పారు. -
ఎప్పుడైనా రెడీ!
అతను క్లయిమేట్ లాంటోడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఒకసారి కూల్‌గా... ఆ వెంటనే హాట్‌గా... ఉంటాడు. ఎవరికైనా ఎదురెళ్తాడు. భయంతో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓ పెద్ద కోరిక ఉంటుంది. గూగుల్‌లో తనకంటూ నాలుగు పేజీలు ఉండాలన్నదే ఆ కోరిక. దాని కోసం సమాజంలో ఉన్న చెడుపై ఎలాంటి పోరాటం చేశాడో తెలియాలంటే ‘బెంగాల్ టైగర్’ చూడాల్సిందే. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కానీ, కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నారనే వార్త ప్రచారం అవుతోంది. ఈ వార్తలో నిజం లేదని రాధామోహన్ స్పష్టం చేశారు.‘‘అక్టోబర్ 22న రిలీజ్ కావాల్సిన ‘అఖిల్’ చిత్రం విడుదల వాయిదా కావడంతో ‘బెంగాల్ టైగర్’ని ముందు అనుకున్నట్టు నవంబర్ 5న రిలీజ్ చేయడం కుదరడం లేదు. విడుదల వాయిదా వేయడానికి కారణం ఇదే. నైజామ్ ఏరియాలో ‘అఖిల్’ చిత్రం, మాది ఒకరే కొన్నారు. అందుకే, రిలీజ్ డేట్స్ క్లాష్ కాకుండా చూసుకుంటున్నాం. షూటిం గంతా పూర్తయిపోయింది. గుమ్మడికాయ కొట్టేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలూ పూర్తి అయ్యాయి. డేట్ కుదిరితే చాలు... ఎప్పుడైనా మా సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్నాం. ఎప్పుడు రిలీజైనా రవితేజ కెరీర్లో ఇది హిట్‌గా నిలుస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రక టిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్, సంగీతం: భీమ్స్. -
బెంగాల్ టైగర్
కొంచెం అల్లరి.... మరి కొంత వెటకారం... ఇంకాస్త చిలిపితనం... ఇవన్నీ రవితేజ పాత్రల్లో ఉరకలెత్తుతూ ఉంటాయి. సీమటపాకాయ్‌లా సందడి చేస్తూ ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ప్రతి ఫ్రేములోనూ ఫైర్ బ్రాండ్లా రెచ్చిపోయే రవితేజ ఇప్పుడు... ‘బెంగాల్ టైగర్’ రెడీ అవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ఈ నెల 18న పాటలు, నవంబరు 5న సినిమా విడుదల కానున్నాయి. -
శివమెత్తించే... ప్రేమ
కొత్త సినిమా గురూ! శివమ్ తారాగణం: రామ్, రాశీఖన్నా, అభిమన్యు సింగ్, వినీత్‌కుమార్, బ్రహ్మానందం, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి, నిడివి: 168 నిమిషాలు, రిలీజ్: అక్టోబర్ 2 లవ్‌స్టోరీ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘శివమ్’తో దర్శకుడైన శ్రీనివాసరెడ్డి గతంలో సురేందర్ రెడ్డి దగ్గర ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాలకు పనిచేశారు. దాదాపు 34 మంది ఆర్టిస్టులున్న ఈ సినిమాకైన బడ్జెట్ సుమారు రూ. 20 కోట్లు మొత్తం వర్కింగ్ డేస్ 87. ఊటీ, హైదరాబాద్, నార్వే, స్వీడన్లలో షూటింగ్. నార్వే, స్వీడన్లలో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇదే. అక్కడ డ్రోన్ కెమేరాలు వాడారు. సినిమా రచనలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కథ అనుకొని దానికి తగ్గట్లు సీన్లు రాసుకోవడం సంప్రదాయంగా అందరూ అనుసరించే విధానం. అయితే, ఒక్కోసారి ప్రేక్షక జనాన్ని మెప్పించే తపనలో, సీన్లు అనుకొని కథలు కూడా వండుకోవడమూ సహజం. అలాంటి ఆసక్తికరమైన సీన్లు, ఎపిసోడ్లన్నీ కలసి తెరపై సినిమాగా పరిణమిస్తే, కొన్నిసార్లు కథ కన్నా సీన్లదే ఎక్కువ ప్రాధాన్యమ వుతుంది. చిత్ర నిర్మాణంలో ముప్ఫయ్యో ఏట అడుగుపెట్టిన ‘శ్రీస్రవంతీ మూవీస్’ సంస్థ నుంచి మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన ‘శివమ్’ సినిమా చూసినప్పుడు ఈ ఆలోచనలన్నీ మెదులుతాయి. కథ ఏమిటంటే...: ఇది శివ (రావ్‌ు) అనే కుర్రాడి కథ. అతనిది ఒక విలక్షణ తత్త్వం. ప్రేమికుల పెళ్ళిళ్ళకు ఇంట్లో పెద్దలు అభ్యంతరపెడుతున్నారని తెలిస్తే చాలు... నేరుగా తాను బరిలోకి దిగిపోతాడు. పెద్దవాళ్ళతో ఫైట్లు చేసి మరీ, ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటాడు. అలా అప్పటికి 112 పెళ్ళిళ్ళు చేయించాడా కుర్రాడు. ఆ క్రమంలో జడ్చర్ల పట్నాన్ని గడగడలాడించే భోజిరెడ్డి (వినీత్ కుమార్) అనే విలన్ మనుషుల్ని కొట్టి, వాళ్ళకు శత్రువవుతాడు. అలాంటి కుర్రాడు రైలులో వెళుతూ, ఒకమ్మాయి ఏదో షూటింగ్ కోసం అన్న ‘ఐ లవ్ యూ’ అన్న మాటను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రేమనూ వెతుక్కుంటూ వెళతాడు. అదే టైవ్‌ులో పోయిన పరువును తిరిగి తెచ్చుకోవడం కోసం భోజిరెడ్డి మనుషులు హీరో కోసం వెతుకుతుంటారు. మరోపక్క అభిమన్యు సింగ్ అనే మరో విలన్ కూడా హీరో కోసం వెతుకుతుంటాడు. అతనెందుకు వెతుకుతున్నాడన్నది కాసేపు సస్పెన్స. తీరా హీరో కనిపించినప్పుడు అతణ్ణి వదిలేసి, హీరోయిన్ను కిడ్నాప్ చేసుకొని వెళతాడతను. అక్కడికి ఇంటర్వెల్. విలన్ దగ్గర నుంచి ఆమెను హీరో రక్షించడం, హీరో పనిపట్టడం కోసం ఇద్దరు విలన్ల మధ్య ఒప్పందం కుదరడం లాంటివన్నీ తర్వాతి కథ. ఒక దశలో హీరోయిన్‌తో ప్రేమ కన్నా, ప్రేమించినవాళ్ళను ఏకం చేయడం వైపే హీరో మొగ్గుతాడు. అలా ఎందుకన్నది ఫ్లాష్ బ్యాక్. అదేమిటి, హీరో అసలు ‘శివ’ అని పేరు పెట్టుకోవడానికీ, తాను పెళ్ళి చేసిన ప్రేమికుల మొదటి బిడ్డకు ‘శివ’ అని వచ్చేలా పేరు పెట్టమనడానికీ కారణం ఏమిటి, ప్రేమ అనే విషయం వచ్చేసరికి అతనెందుకు శివమెత్తుతాడు, చివరకు విలన్ల కథెలా కంచికి చేరిందన్నది మిగతా సినిమా. తెర నిండా యాక్టర్లే...: ‘ఎనర్జిటిక్ స్టార్’ బిరుదాంకితుడైన యువ హీరో రామ్ఆ పేరుకు తగ్గట్లు నటించారు. మొదటి నుంచి చివరి దాకా హుషారుగా, ఎందరినైనా కొట్టి, ఏదైనా సాధ్యం చేయగల వీరాధివీరుడి తరహా పాత్రలో కనిపిస్తారు. ఇక, క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఘట్టంలో పొడవాటి జుట్టున్న విగ్లో విభిన్నంగా, విచిత్రంగా ఉన్నారు. ప్రేమిస్తున్నాననే విషయాన్ని కూడా నేరుగా చెప్పడంలో కూడా ‘ఇగో’ ఫీల్ అయ్యే కథానాయిక తనూజగా హీరోయిన్ రాశీఖన్నాది విగ్రహపుష్టి. ఈ చిత్రంలో విలన్లు ఒకరు కాదు - ఇద్దరు. ఒకరు అభిమన్యు సింగ్, రెండో వ్యక్తి వినీత్ కుమార్. కానీ, చిత్రంగా ఈ ప్రతినాయక పాత్రల్లో ఏదీ బలంగా కనిపించదు. విలన్లు కూడా కామెడీ చేయడమనే కాన్సెప్ట్‌తో కథను తీర్చిదిద్దుకోవడం అందుకు ఒక కారణం. బలమైన విలన్లు, సన్నివేశాలు, సందర్భాలు లేనప్పుడు హీరోనెంత గొప్పగా చూపినా, హీరోయిజవ్‌ు ఎంతవరకు ఎలివేటవుతుందన్నది ప్రశ్న. వీళ్ళు కాక - కామెడీ కోసం బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి నుంచి సప్తగిరి, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్.... ఇలా లెక్కేసుకుంటూ పోతే, ఆ పేర్ల జాబితానే కొండవీటి చాంతాడు. ఇటీవలి కాలంలో తన అమాయకపు డైలాగుల చిన్న చిన్న పాత్రలతోనే అలరిస్తున్న ‘ఫిష్’ వెంకట్ కూడా ఉన్నారు. కనిపించే కొద్ది సీన్లలో ఎవరికి వారు తమ వంతు నవ్వించడానికి ప్రయత్నించారు. ఇక, హీరో తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి, హీరోయిన్ తండ్రి పాత్రలో గాయకుడు మనో లాంటి పేరున్న తారలూ కనిపిస్తారు. అప్పటికే సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు కావడం వల్ల కావచ్చు... వారిని ఇంకా వినియోగించుకొనే సీన్లకు అవకాశం కష్టమైనట్లుంది. అలాగే, తండ్రి పోసాని పాత్ర గన్ను పుచ్చుకొని మరీ హీరోను కనిపిస్తే... కాల్చేస్తానంటూ తిరగడం వెనుక కారణం ఏమిటన్నది చెప్పడం మర్చిపోయినట్లున్నారు. అనుభవం నిండిన టెక్నీషియన్ వర్క్: శ్రీనివాసరెడ్డికి దర్శకుడిగా ఇది తొలిసినిమా. కథ కూడా ఆయన రాసుకున్నదే. పాత్రల పరిచయం, కథ ఎస్టాబ్లిష్‌మెంట్‌తోనే సినిమా ఫస్టాఫ్ అంతా గడిచిపోతుంది. దానికి మూడు పాటలు, కొన్ని ఫైట్లు అదనం. చిన్న ట్విస్ట్ దగ్గర ఫస్టాఫ్ ఆగినా, సెకండాఫ్ మొదట్లోనే ఆ ట్విస్ట్‌ను బయటపెట్టేస్తారు. ఇక, ఆ తరువాత అంతా టావ్‌ు అండ్ జెర్రీ తరహాలో హీరోకూ, విలన్లకూ మధ్య జరిగే ప్రిడి కథ. హీరో స్వభావానికీ కారణం తెలిపే ఫ్లాష్‌బ్యాక్ కథ చివరాఖరుకు వస్తుంది. అప్పటి దాకా ఆసక్తినీ, సహనాన్నీ కోల్పోకుండా నిలుపుకోవాలి. మాటల రచయిత కిశోర్ తిరుమల ఉన్నా, ఆ క్రెడిట్‌నూ దర్శకుడు కూడా పంచుకున్న ఈ సినిమాలో, ముఖ్యంగా ఫస్టాఫ్‌లో డైలాగ్స కొంత బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ‘నా కోసం నువ్వేమీ ప్రేమించక్కర్లేదు...’ లాంటి 2-3 పాటలు బాగున్నాయి. నార్వే, స్వీడన్ లాంటి చోట్ల అందమైన లొకేషన్లను కెమేరాలో బంధించిన తీరూ బాగుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ సరేసరి. ఇలాంటి అనుభవజ్ఞులైన నిపుణులతో పాటు నిర్మాణ విలువలూ పుష్కలమే. ఇన్ని సమకూరిన సినిమాలో సీన్లు, పాటలు, ఫైట్లూ ఉన్నాక... ఇంకా కథ గురించి ఆలోచించడం ఎందుకు?