దసరా.. చలో రామ్‌లీలా! - రాశీ ఖన్నా | Rasikhanna plan to go ramleela grounds | Sakshi
Sakshi News home page

దసరా.. చలో రామ్‌లీలా! - రాశీ ఖన్నా

Published Mon, Oct 10 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

దసరా.. చలో రామ్‌లీలా! - రాశీ ఖన్నా

దసరా.. చలో రామ్‌లీలా! - రాశీ ఖన్నా

విజయదశమి వచ్చిందంటే ఢిల్లీ అంతా సందడి నెలకొంటుంది. ఢిల్లీలో దసరా పండగను బాగా జరుపుకుంటారు. చిన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసేవాళ్లం. పూజలో చెప్పే కథలను శ్రద్ధగా వినేదాన్ని. ఆ తర్వాత రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ దహన కార్యక్రమానికి వెళ్లేవాళ్లం. హీరోయిన్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లడానికి కుదరడంలేదు.

దసరా సమయంలో ఇంట్లో అందర్నీ కలిసే అవకాశం తక్కువసార్లు లభించింది. ఇప్పుడు అమ్మానాన్నలు కూడా హైదరాబాద్ వచ్చేశారు. ఈరోజు నా కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ. త్వరగా షూటింగ్ ముగించుకుని సాయంత్రం పూజకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement