హైదరాబాద్‌: వేడుకగా రావణ దహనం | vijayadashami celebrations in indira nagar jublihills hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: వేడుకగా రావణ దహనం

Published Mon, Oct 14 2024 10:39 AM | Last Updated on Mon, Oct 14 2024 10:41 AM

vijayadashami celebrations in indira nagar jublihills hyderabad

హైదరాబాద్‌, సాక్షి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే దసరా ఉత్సవాలు జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరా నగర్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రావణ దహన వేడుకలు బస్తీలో కన్నుల పండుగగా నిర్వహించారు. టి పి సి సి కార్యదర్శి విజయా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రావణ దహనాన్ని నిర్వహించారు. 

డప్పు చప్పులు, రంగురంగుల బాణా సంచాల మెరుపుల మధ్య రావణ దహన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి మోహన్ యాదవ్, రమేష్ చారి, సత్తి గౌడ్, సల్మాన్ రాజ్, సింహం వెంకటేష్, బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement