సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు.
అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది.
ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment