Beers
-
మార్కెట్లోకి మళ్లీ కింగ్ ఫిషర్ బీర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్ల సరఫరా తిరిగి కొనసాగనుంది. బీర్లను యథాతథంగా సరఫరా చేసేందుకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) సంస్థ అంగీకరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించాం. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయి.మేం అడుగుతున్న విధంగా నిర్ణీత కాల వ్యవధిలో ధరలను సవరించేందుకు, బకాయిలను చెల్లించేందుకు కార్పొరేషన్ హామీ ఇచి్చంది. ఈ క్రమంలో బీర్ వినియోగదారులు, మా సంస్థలో పనిచేసే కారి్మకులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనాల మేరకు కొంతకాలం వరకు బీర్లు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’అని యూబీ కంపెనీ ప్రతినిధి నిఖిల్ మల్పాని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ లిమిటెడ్‌కు సోమవారం రాసిన లేఖలో వెల్లడించారు. సోమవారం నుంచే యూబీ బ్రూవరీస్ నుంచి టీజీబీసీఎల్ డిపోలకు కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా ప్రారంభమైంది. తగ్గిపోయిన బీర్ల నిల్వలురాష్ట్రంలో అమ్ముడయ్యే బీర్లలో 70 శాతం యూబీ కంపెనీకి చెందినవే. ఈ నెల 8వ తేదీన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం మేరకు.. కింగ్‌ఫిషర్, హెన్కీన్ బీర్ల సరఫరా నిలిచిపోయింది. అయితే అప్పటికే రాష్ట్రంలోని మద్యం డిపోల్లో సుమారు 11 లక్షల కేసుల కింగ్‌ఫిషర్ బీర్లు నిల్వ ఉన్నాయి. వాటితోపాటు ఇతర కంపెనీలు తయారు చేసే మరో ఏడు రకాల బ్రాండ్లు కలిపి మొత్తం 15 లక్షల కేసుల స్టాక్ ఉంది. అయితే యూబీ కంపెనీ నిర్ణయం నేపథ్యంలో బీర్ల కొరత రాకుండా ఎక్సైజ్ శాఖ జాగ్రత్త పడింది. టీజీబీసీఎల్ డిపోల నుంచి గత 12 రోజులుగా రేషన్ పద్ధతిలో బీర్లను మార్కెట్లోకి పంపింది. సంక్రాంతి పండుగ కూడా ఉండటంతో ఎక్కడా బీర్ల కొరత రాకుండా ఉండేలా చూసింది. అయినా ఆదివారం నాటికి బీర్ల నిల్వ లక్ష కేసులకు తగ్గిపోయింది. ఇంకో రెండు రోజులైతే రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉండేది. ఈలోగానే యూబీ కంపెనీ బీర్ల సరఫరా ప్రారంభించింది. రేట్ల పెంపుపై ఏం చేద్దాం? ఈ పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు సోమవారం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మద్యం కంపెనీలు అడుగుతున్న విధంగా బేసిక్ ధరల పెంపు, సీఎం ఆదేశించిన మేరకు కొత్త కంపెనీల నుంచి మద్యం సరఫరా కోసం నోటిఫికేషన్ విడుదల తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.‘కింగ్ ఫిషర్’బీర్ల ఉత్పత్తి వేగవంతం! సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించిన యూబీ కంపెనీ వేగంగా బీర్ల ఉత్పత్తి చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలో ఈ కంపెనీకి ఉన్న రెండు బీర్ ఫ్యాక్టరీల్లో సోమవారమే బీర్ల తయారీని మొదలుపెట్టింది. నిజానికి రాష్ట్రంలో బీర్ల సరఫరాను వీటిలో రోజుకు సుమారు 15 లక్షల బాటిళ్ల బీర్ల ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి బీర్లు సరఫరా చేస్తుంది. అయితే తెలంగాణలో బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించిన సమయంలో.. ఈ రెండు ఫ్యాక్టరీల్లో లేఆఫ్‌ను ప్రకటించింది. ఉత్పత్తిని నిలిపివేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని కారి్మకశాఖకు లేఖ కూడా రాసింది. దీంతో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై యాజమాన్యం ప్రతినిధులు, కారి్మక సంఘాల నేతలతో జిల్లా కలెక్టర్ క్రాంతి సోమవారం చర్చలు జరిపారు కూడా. అయితే బీర్ల సరఫరా పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాక్టరీల్లో లేఆఫ్ ఎత్తివేశారు. -
తెలంగాణలో సంక్రాంతి తర్వాత మద్యం ధరలు పెంచనున్న ప్రభుత్వం
-
కేఎఫ్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎ క్సైజ్ శాఖకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఝలక్ ఇచ్చింది. తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని ఆ కంపెనీ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్), బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది. అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. తక్షణమే నిలిపివేస్తున్నాం...యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్ మల్పానీ పేరుతో బుధవారం స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బహిర్గతం చేసింది. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బీర్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనుంది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.పలుమార్లు విజ్ఞప్తులుఐదేళ్లుగా బీర్, లిక్కర్ తయారీదారులకు బేసిక్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. ముఖ్యంగా బీర్ తయారీదారులకు ఎప్పటి నుంచో కేస్‌కు రూ.289 మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించేముడి పదార్థాల ధరలు పెరిగినందున బేసిక్ ధరలు పెంచాలని యూబీతోపాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. కొద్ది రోజుల క్రితం ఆలిండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతోపాటు ఎక్సైజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని కరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయరాదని నిర్ణయించింది. వారం రోజులు ఓకే..బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసినా, మార్కెట్లో బీర్ల కొరత ఇప్పటికిప్పుడే రాదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి టీజీబీసీఎల్‌కు అందిన బీర్లు మరో ఆరేడురోజుల పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతేనే ఫలానా బ్రాండ్ బీర్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నాయి. అయితే వైన్‌షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్‌ఫిషర్ బీర్లకు ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద రేషన్ విధించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నాం : టీజీబీసీఎల్ ఎండీకి యూబీ కంపెనీ లేఖధరల పెంపు, బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనందునే తాము బీర్ల సరఫరాను బుధవారం నుంచి నిలిపివేసినట్టు, ఈ ప్రతిష్టంభనను తొలగించకుకోవడానికి టీజీపీసీఎల్తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీ బీసీఎల్ ఎండీ, ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరి హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ గరీమాసింగ్ లేఖ రాశారు. ఏప్రిల్ 1, 2024 నాటికి తమకు రూ.702 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు. బేసిక్ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీ బీసీఎల్‌కు రాసిన లేఖలో గరీమాసింగ్ స్పష్టం చేశారు.ధరలు పెంచడమే న్యాయం ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్ తయారీ కంపెనీలకు బేసిక్ ధర పెంచడమే న్యాయం. ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది. ప్రభుత్వం రమ్మంటే వెళ్లి చర్చిస్తాం. యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం. కానీ, న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే. – ఎం.కామేశ్వరరావు, అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్» స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ వర్గాల్లో అలజడి» మార్కెట్లో 72 శాతానికి పైగా వాటా ఉన్న కింగ్‌ఫిషర్ బ్రాండ్ తయారు చేసేది యూబీనేధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు: జూపల్లిబీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. బుధవారం సచివాలయ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడారు. ఒక్కో బీరుపై దాదాపు 33.1 శాతం పెంచాలని కంపెనీ అడుగుతోందని, అలా చేస్తే బీరు ధర రూ.150 నుంచి రూ.250 వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూబీ కంపెనీ మార్కెట్ షేర్ 72 శాతం ఉంది కదాని.. ప్రజలు డిమాండ్ చేస్తారు కదాని ఇష్టానుసారంగా ధరలు పెంచాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,130 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ కంపెనీ రూ.702 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బకాయిలే రూ.407 కోట్లు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ రేట్లు ఉన్న విషయం వాస్తవమేనని, కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఒక్కో బీరు ధర ఉంటే, తెలంగాణలో రూ.150 ఉందన్నారు. 14 లక్షల కేసుల స్టాక్ ప్రస్తుతం ఉందని, సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పండుగ ముందర మద్యం ప్రియులకు చేదు వార్త. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్(TSBCL)కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ)ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్‌ఫిషర్(King Fisher), హెనికిన్ బీర్ల సరఫరా ఆగిపోనుంది. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ నుంచి తమకు రూ.900 కోట్లు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.కాగా, రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్ బ్రాండ్ కింగ్‌షిషరే. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లపై 35 శాతం రేట్లు పెంచాలని బేవరేజ్ కార్పొరేషన్‌ను యునైటెడ్ బ్రూవరీస్ కోరింది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలపై గతంలోనే కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలతో మందు బాబులపై ఆర్థిక భారం పెరగనుంది. మద్యం ప్రియులపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీ.. పోలీసుల పోటీ! -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్‌శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్‌శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్‌లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్‌కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.డిమాండ్‌కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్‌శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్‌బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్‌బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
ధూంధాం... దసరా.. ఐదు రోజుల్లో 25 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు. అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్‌షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. -
హైదరాబాద్ లో బీర్లు కరువు
హైదరాబాద్: బీర్ల కొరత తీవ్రంగా ఉంది. వైన్ షాపులలో కొన్ని బ్రాండ్లకు చెందిన బీర్లు లభించడం లేదు. వేసవి కారణంగా చోటుచేసుకున్న నీటి ఎద్దడి , గత ప్రభుత్వం హయాంలో పేరుకొనిపోయిన పెండింగ్ బకాయిల కారణంగా బీర్ల తయారీని నిలిపివేసినట్లు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో చాలా వైన్‌షాపుల వద్ద ‘నో బీర్స్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. -
బీర్లు, లిక్కర్ విక్రయాల్లో పరకాల టాప్
సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లాలో మద్యం ప్రియులు బీర్లకే జై కొడుతున్నారు. 2022లో 1,07,73,420.. ఈ ఏడాది ఏకంగా 1,26,32,616 బీర్లు తాగారు. అంటే గతేడాది 8,97,785 కేసులు.. ఎన్నికలు జరిగిన ఈ సంవత్సరంలో 10,52,718 కేసుల బీర్లు తాగారు. 2022లో 5,61,186 ఐఎంఎల్ (లిక్కర్) కేసులు తాగితే ఈసారి ఆ సంఖ్య 5,39,437కి తగ్గింది. మద్యం అమ్మకాలతో 2022లో రూ.574.98 కోట్లు.. ఈసారి రూ.589.89 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో వరంగల్ రూరల్ జిల్లా నుంచి వచ్చి చేరాయి. ఈ ఏడాది సంక్రాంతి, దసరా, వివిధ పండుగలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మద్యానికి భారీగా గిరాకీ పెరిగింది. అందుకే గతేడాది మించి ఈసారి ఎక్కువగా మద్యం ప్రియులు మద్యాన్ని లాగేశారని ఎకై ్సజ్ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్ట్ షాపును ప్రోత్సహించడంతో ఆదాయం భారీగా పెరగడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతమున్న ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కొరడా ఝుళిపిస్తుండడంతో వచ్చే ఏడాది మద్యం విక్రయాలు తగ్గే అవకాశముందని ఎకై ్సజ్ విభాగంలో అంతర్గత చర్చ జోరుగా జరుగుతోంది. అక్కడే టాప్... వరంగల్ రూరల్ జిల్లాలో 63 వైన్‌షాపులు, ఏడు బార్లు ఉన్నాయి. నర్సంపేట సర్కిల్లో 25, వర్ధన్నపేట సర్కిల్లో 16, పరకాల సర్కిల్లో 22 మద్యం దుకాణాలు ఉన్నాయి. నర్సంపేటలో 2022లో 1,98,551 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 3,30,471 బీరు కేసులు విక్రయిస్తే.. 2023లో 1,90,636 లిక్కర్ కేసులు, 3,84,878 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో 208.61 కోట్ల ఆదాయం వస్తే.. ఇప్పుడు రూ.214.15 కోట్ల ఆదాయం వచ్చింది. పరకాల సర్కిల్లో 2022లో 2,12,263 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 3,29,736 బీరు కేసులు విక్రయించారు. ఈ ఏడాది 2,02,288 లిక్కర్ కేసులు, 3,91,744 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో రూ.213.98 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.218.41 కోట్లు వచ్చాయి. ఇక వర్ధన్నపేట సర్కిల్లో 2022లో 1,50,372 లిక్కర్ కేసులు, 2,37,578 బీరు కేసులు విక్రయిస్తే ఈ ఏడాది 1,46,513 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 2,76,096 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అంటే 2022లో రూ.152.36 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.157.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా ఓవరల్‌గా తీసుకుంటే బీర్ల విక్రయాల్లో పరకాల ముందుండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉంది. లిక్కర్ తాగడంలో పరకాల మొదట స్థానంలో ఉండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉన్నాయి. -
Hyderabad: పెరుగుతున్న ‘కిక్కు’.. ముందుంది అసలైన పండుగ.. తగ్గేదే లే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా వైన్‌షాపులు, బార్లు, రెస్టారెంట్లు కళకళలాడుతున్నాయి. కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కోవిడ్ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే వినియోగించేవారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. కానీ క్రమంగా వైరస్ ఉధృతి తగ్గిపోవడం, ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. అలాగే పర్మిట్ రూమ్‌లు సైతం మందుబాబులతో నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ 6 నెలల్లో 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగినట్లు అంచనా. సర్కార్ ఆదాయం సైతం అదేస్థాయిలో పెరిగింది. మరోవైపు మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి, నల్గొండ మొదటి రెండు స్థానంలో నిలవగా హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. నగరంలో 18,25,276 కేసుల మద్యం అమ్ముడైంది. చదవండి: చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్ సూచన 56 శాతం పెరిగిన బీర్ల వినియోగం కోవిడ్ కాలంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని సైతం తగ్గించాయి. శీతల పానీయాలు, బీర్లు సేవించడం వల్ల కోవిడ్ సోకే అవకాశం ఉండవచ్చునన్న వార్తలతో బీర్బలులు బాటిల్ పక్కన పెట్టేశారు. కానీ సెప్టెంబర్ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే 56 శాతం వరకు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. 7,016,500 కేసుల విక్రయాలు జరిగాయి. బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్ పైన రూ.10 వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం పెరిగినట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆదాయంలోనూ మూడో స్థానం... ►ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.14,320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. ►రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క జిల్లా నుంచే రూ.3.247 కోట్ల ఆదాయం లభించింది. ►రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన రూ.1,599 కోట్ల ఆదాయం లభించింది. ►ఆ తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ మద్యం ఆదాయం రూ.1510 కోట్లు ►దసరా అమ్మకాలతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ‘చదువు ఇష్టం లేదు.. ఆటలే ఇష్టం..ప్లీజ్ మాకోసం వెతకొద్దు’ -
వైరల్ ఎవరికి కనపడకుండా బీర్లను ఎక్కడ దాచాడో తెలుసా..
సాధారణ వ్యక్తులతో పోలిస్తే మందుబాబుల తెలివి మాములుగా ఉండదు. ఎప్పుడూ రాని ఆలోచనలు చుక్క దిగితే ఉప్పెనల తన్నుకస్తుంటాయి. ఏ పని చేసినా చేయకున్నా.. టైమ్‌కు నోట్లోకి మందు పడాల్సిందే. లేదంటే ఉక్కిరిబిక్కిరవుతుంటారు. అసలే ఇప్పుడు కరోనా ముంచుకొస్తుంది. ఒకవేళ లాక్డౌన్ పెడితే మాత్రం మందుబాబుల కష్టాలు అంతా ఇంతా కాదు. అందుకే ముందు జాగ్రత్తగా ఇప్పుడే మందు బాటిళ్లను కొని తెచ్చుకుని ఫుల్‌గా స్టాక్ పెట్టుకుంటున్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా, భౌతిక దూరం పాటించకుండా కలబడి మరీ మందును సాధిస్తున్నారు. కష్టపడి లిక్కర్, బీర్లు తెచ్చుకోవడం ఒక సవాల్ అయితే వాటిని ఇంట్లో కుటుంబికులకు, స్నేహితులకు తెలియకుండా దాయడం మరో పెద్ద టాస్క్. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి కత్తిలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలుసేమో.. తన బుర్రకు టెక్నాలజీతో పదును పెట్టి .. బీర్లు దాచేందుకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పూల కుండీల అడుగున కనీసం పాతిక బీర్లు పట్టేలా కంపార్ట్మెంట్ తయారు చేశాడు. బయటకు చూసేందుకు అది పూల కుండీలాగే కనిపిస్తుంది. కానీ, చిన్న బటన్ నొక్కితే.. పూల కుండీ పైకి లేచి.. దాని అడుగున ఉన్న మందు బాటిళ్ల కంపార్ట్మెంట్ పైకి వస్తుంది. ఎంతైనా వీడి తెలివిని ప్రశంసించాల్సిందే. చదవండి: మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు -
లక్షల బీర్లు మురిగాయంట!
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖకు కొత్త సమస్య వచ్చి పడింది. లాక్డౌన్ కాలానికి బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్ ఫీజు మినహాయింపు అంశం తేలకముందే మరోటి తెరపైకి వచ్చింది. కరోనా నిబంధనలు అమలైన సమయంలో తాము తయారు చేసిన లక్షల బీర్లు మురిగిపోయాయని, ఆ బీర్లకు సుంకం కట్టలేమని బ్రేవరీలంటున్నాయి. ఈ మేరకు ఆ సుంకాన్ని మినహాయించాలని కోరుతున్నాయి. కానీ, ఎక్సైజ్ వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనను నిరాకరిస్తున్నాయి. మార్చి 20 తర్వాత రెండున్నర నెలలు వైన్‌షాపులు, ఆరు నెలలకుపైగా బార్లు మూసేశారు. ఈ కాలంలో వైన్‌షాపులు, బార్లలో ఉన్న బీర్లు అలాగే ఉండిపోయాయి. అయితే, ఆ కాలంలో బ్రేవరీల్లో తయారు చేసిన బీర్లు కూడా నిల్వ ఉన్నాయి. ఆ సుంకం విలువ సుమారు రూ.15 కోట్లు బీర్ కాలపరిమితి ఆరు నెలలే కావడంతో వైన్‌షాపులు తెరచిన తర్వాత బార్లలోని బీర్లను వైన్స్‌కు తరలించారు ఎక్సైజ్ అధికారులు. కానీ, బ్రేవరీల్లో పెద్ద ఎత్తున తయారైన లక్షల కేసుల బీర్లు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బీర్లన్నీ మురిగిపోయాయని, వాటిని పారబోయాల్సి వస్తోందని, ఆ బీర్లకు తయారీ సుంకం కట్టలేమని బ్రేవరీలంటున్నాయి. ఈ విధంగా బ్రేవరీలు కట్టలేమని చెబుతున్న సుంకం విలువ రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
కరోనా: చిల్డ్ బీర్ల జోలికెళ్లని మద్యం ప్రియులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మందుబాబులు బీర్ల జోలికి వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయంగా లిక్కర్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రెండు నెలలుగా బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. చిల్డ్ బీరు తాగితే జలుబు చేసి కరోనాకు దారితీసే అవకాశాలున్నాయని భావిస్తున్న మద్యం ప్రియులు దాని జోలికెళ్లడం తగ్గించేశారు. బీర్ల ధరలు విపరీతంగా పెరగడం కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు నిత్యం వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా ఉంది. దీంతో మద్యం ప్రియులు బీరు బదులు లిక్కర్ వైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాలతో పోల్చితే బీర్ల అమ్మకాలు సుమారు 20 శాతం తగ్గినట్లు ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతేడాది (2019) సెప్టెంబర్‌లో 1.83 లక్షల బీరు కేసులు విక్రయాలు జరిగితే, ఈ ఏడాది గతనెల (సెప్టెంబర్)లో 1.40 లక్షల కేసులకు పడిపోయింది. అంటే సుమారు 43 వేల కేసులు తక్కువ వినియోగమైంది. ఆగస్టు మాసంలో కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయి. 2019 ఆగస్టులో 1.76 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగితే.. ఈ ఏడాది ఆగస్టులో 1.46 లక్షల కేసులకు తగ్గాయి. అంటే సుమారు 30 వేల కేసుల బీర్ల అమ్మకాలు తగ్గాయి. ఈ లెక్కన ఆగస్టులో కూడా సుమారు 20 శాతం అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన లిక్కర్ వినియోగంబీరు ప్రియులు కూడా లిక్కర్ వైపు మొగ్గు చూపడంతో లిక్కర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. 2019 సెప్టెంబర్ మాసంలో లిక్కర్ 1.12 లక్షల కేసుల విక్రయాలు జరగగా, గత నెల(2020 సెప్టెంబర్)లో 1.27 లక్షల కేసులకు పెరిగాయి. సుమారు 11 శాతం లిక్కర్ అమ్మకాలు పెరిగినట్లు తేలింది. బీర్ల ధరలు పెరగడమూ కారణమే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు చల్లని పానియాలు సేవించడం తగ్గించారు. దీనికి తోడు బీర్ల ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది సుమారు రూ. 120 ఉన్న స్ట్రాంగ్ బీరు ఇప్పుడు రూ. 160కి పెరిగింది. రెండు బీర్లకు వెచ్చించిన ధరలో బ్రాండెడ్ లిక్కర్ క్వాటర్ వస్తుండడంతో మందుబాబులు లిక్కర్‌ను తాగేందుకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గని ఆదాయం బీర్ల విక్రయాలు తగ్గినప్పటికీ.. పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది 2019లో సెప్టెంబర్‌లో బీర్ల అమ్మకాలపై సుమారు రూ. 19.09 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో బీరు విక్రయాలపై సుమారు రూ. 23.43 కోట్ల ఆధాయం వచ్చింది. సుమారు 20 శాతం అమ్మకాలు తగ్గినప్పటికీ ఆదాయం పెరగడానికి కారణం బీర్ల ధరలు పెరగడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గడువు తీరిన బీర్ల విక్రయం!
పరిగి : కొంతమంది మద్యం దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన బీర్లు విక్రయిస్తూ యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై విని యోగదారులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం సాయంత్రం పరిగికి చెందిన కొందరు పరిగిలోని న్యూ పరిగి వైన్స్‌లో బీర్లు కొనుగోలు చేశారు. వీటిపై డేట్ చూడగా గడువు ముగిసినట్లు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే కాలం చెల్లిన బీర్లు అమ్మారంటూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న అధికారులు కాటన్ బీర్లకు సంబంధించిన విక్రయ గడువు ముగిసినట్లు గుర్తించారు. 12 బీరు సీసాలను ఎక్సైజ్ ఠాణాకు తరలించి దుకాణం సీజ్ చేశారు. ఈ మేరకు వైన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం స్టాక్ వివరాలు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులు దీన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. లాక్డౌన్ సమయంలోనూ దుకాణంలో ఉన్న మద్యం నిల్వలు తరలించారని ఆరోపణలు వచ్చినా.. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించారని మండిపడుతున్నారు. -
కేఎఫ్ బీర్లను విక్రయించాలి.. వైరల్ లేఖ
సాక్షి, జగిత్యాల : ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి రాసిచ్చిన ఫిర్యాదు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైన్స్‌షాపుల్లో, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ(టీవీ.సూర్యం) సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మద్యంప్రియులు, యువత ఎక్కువగా ఇష్టపడే కింగ్‌ఫిషర్ బీర్ల విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. మద్యం విక్రయదారులు సిండికేట్‌గా మారి కింగ్‌ఫిషర్ బీర్లను విక్రయించడం మానేశారని, వాటి స్థానంలో నాసిరకం బీర్లను విక్రయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీర్ల విక్రయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో బీర్లపై ఫిర్యాదు రావడంతో అధికారులతో పాటూ, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అధికారులు ఆ లేఖను అబ్కారీ శాఖకు పంపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ -
ఫుట్‌బాల్‌పై ‘బీరా’భిమానం
కలినిన్‌గ్రాడ్: ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. గత కొన్ని దశాబ్దాల నుంచే అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడగా వెలుగొందుతున్న ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రదర్శిస్తారు. అందులో వరల్డ్ కప్ అంటే ఆ అభిమానం మరింత రెట్టింపు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ. యూకేలోని చెల్టెన్‌హామ్‌కు చెందిన గస్ హల్లీ ఫుట్‌బాల్‌పట్ల తన మక్కువను వెరైటీగా చాటాడు. బీర్లుతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. వరల్డ్‌కప్‌లో తలపడుతున్న 32 దేశాల బీర్లను సేకరించి ఫుట్‌బాల్‌పై ‘బీరా’భిమానం ప్రదర్శించాడు. ఇందుకు అతగాడికి అయిన ఖర్చు దాదాపు రూ. 45 వేలట. -
ఇంటర్నేషనల్ 'బీర్లు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మద్యం వ్యాపారం లాభసాటిగా మారటంతో రాష్ట్రీయ మద్యం మార్కెట్లోకి ప్రవేశించటానికి ప్రపంచ దేశాల బీర్ల కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇక్కడ అంచనాలకు మించి బీర్ల వినియోగం ఉండ టం, ఈ ఏడాది బీర్ల బేసిక్ ధర పెంచటానికి ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో సొమ్ము చేసుకోవటానికి పలు అంతర్జాతీయ కంపెనీలు రంగంలోకి దిగాయి. మొత్తం 26 కార్పొరేటు కంపెనీలు 186 దేశీయ, విదేశీ బ్రాండ్లను సరఫరా చేసేందుకు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ట్యూబర్గ్, క్యాల్సిబర్గ్, ఫోస్టర్, బడ్వైజర్, హన్‌కెన్ బ్రాండ్లు ఇప్పటికే రాష్ట్రీయ మార్కెట్లో వినియోగంలో ఉండగా.. స్కోల్, విక్టోరియా, ఆంగోర్, హినానో, గోల్డ్ స్టార్, పెరోని, రెడ్ స్ట్రైప్, టస్కర్ తదితర బ్రాండ్లు కొత్తగా రాబోతున్న జాబితాలో ఉన్నాయి. 120 కొత్త బ్రాండ్లకు టెండర్లు రాష్ట్రీయ మద్యం మార్కెట్లో బీర్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా మరో 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి. సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది చేసుకున్న ఒప్పందం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ కసరత్తు చేపట్టింది. టెండర్లు ఖరారు చేయటంతోపాటు, బీర్ల బేసిక్ ధర నిర్ణయించటానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జెడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. కమిటీలో చార్టర్డ్ అకౌంటెంట్ బి.నర్సింహారావు, మాజీ ఐఏఎస్ అధికారి అరవిందరెడ్డి సభ్యులుగా ఉన్నారు. బేసిక్ ధర పెంపు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిస్టిలరీల యాజమాన్యం కోసం లిక్కర్ ధరను 5 నుంచి 15 శాతం వరకు పెంచింది. ఈ నేపథ్యంలోనే బ్రూవరీల యాజమాన్యం కోసం బీర్ల బేసిక్ ధర పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈ సారైనా ధర పెంచాలని, ప్రతి సీసా మీద కనీసం రూ.6 చొప్పున (బేసిక్ ధరపై 20 శాతం) అదనంగా చెల్లించాలని బ్రూవరీలు డిమాండ్ చేస్తున్నాయి. యాజమాన్యాలు డిమాండ్ చేసిన స్థాయిలో కాకపోయినా కనీసం 10 శాతం నుంచి 15 శాతం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఆ మేరకే జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీని వేసిందని అంతర్గతంగా ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ఇక్కడే ఉత్పత్తి.. అంతర్జాతీయ బ్రాండ్లు అంటే విదేశాల్లోనే తయారు చేసిన మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించుకోవాలనే నిబంధన ఏమీ లేదు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం పేటెంట్ పొందిన బీరు తయారీ ఫార్ములాతో స్థానికంగా అందుబాటులో ఉన్న బ్రూవరీల్లో వారి బ్రాండ్ బీరును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు బ్రూవరీలతో (బీర్ల తయారీ పరిశ్రమలు) పలు అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకోని బీర్లను ఉత్పత్తి చేశాయి. ఈ సారి టెండర్లలో సోన్ డిస్టిలరీస్, బ్రూవరీస్ మధ్యప్రదేశ్, ఎస్ఎన్జే డిస్టిలరీలస్ నెల్లూరు, ఎస్పీఆర్ డిస్టిలరీస్ మైసూర్, ప్రివిలేజ్ ఇండస్ట్రీస్ పుణే, హరియాణా బ్రూవరీస్, సోన బ్రూవరేజెస్ ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ మార్కెట్లో పెద్ద వాటాదారుగా ఉన్న యూబీ (యునైటెడ్ బ్రూవరేజెస్) మైసూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి ఈసారి కొత్తగా టెండర్లు దాఖలు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ బీర్ల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. సగటున నెలకు 37.5 లక్షల కేసుల బీర్లు తాగుతున్నారు. టీఎస్‌బీసీఎల్ నివేదికల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల బీర్లు తాగుతున్నారు. గతేడాది రాష్ట్రంలో జరిగిన బీర్ల విక్రయాలతో పోలిస్తే 27 శాతం అధికంగా బీర్లను తాగేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో బీర్ల వినియోగం ఇక్కడితో పోలిస్తే సగం కూడా లేదు. ఈ రికార్డుల నేపథ్యంలో బీర్ల కంపెనీలు రాష్ట్రంపై ఆసక్తి చూపుతున్నట్లు టీఎస్‌బీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. టెండర్లు ఎక్కువే వచ్చాయి: దేవీ ప్రసాద్, టీఎస్‌బీసీఎల్ చైర్మన్ బీర్లు సరఫరా చేసేందుకు ఈ ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగానే టెండర్లు వచ్చాయి. గతేడాది రాష్ట్రంలో 66 బ్రాండ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 120 బ్రాండ్లు అదనంగా వచ్చాయి. జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీ.. కంపెనీలతో మాట్లాడి ధరలను నిర్ణయిస్తుంది. ఒక వేళ కమిటీ అడిగిన ధరలకు బీరు సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకు రాకపోతే.. ఇప్పుడు కొనసాగుతున్న ఒప్పందాన్నే మరో 6 నెలలపాటు పొడిగిస్తాం. -
మళ్లీ పెరగనున్న బీరు ధరలు
-
ఆ బ్రాండ్‌కు డిమాండ్ లేకే..
► భూటాన్ దేశం బీర్లు నేల పాలు! ► కాలం చెల్లడంతో పారబోత మాక్లూర్(ఆర్మూర్): ఎండ కాలంలో బీర్లకు ఎం తో డిమాండ్ ఉంటుంది. కానీ ఓ బ్రాండ్ బీర్లను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కాలం చె ల్లాయి. దీంతో వాటిని పారబోయాల్సి వచ్చిం ది. మాక్లూర్ మండలంలోని మాదాపూర్ సమీ పంలోని తెలంగాణ రాష్ట్ర బేవరేజేస్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఎంఎల్ డిపో)కు నుంచి జిల్లా వ్యా ప్తంగా మద్యం సరఫరా అవుతుంది. జిల్లాలో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు సాగుతుం టాయి. కానీ భూటాన్ దేశానికి చెందిన డ్రక్ 1100 అనే బీర్లను కొనుగోలు చేసేవారు కరువవడంతో కాలం చెల్లాయి. దీంతో అధికారులు రెండు రోజుల క్రితం 1,070 కేసుల బీర్లను డిపో అధికారులు పారబోశారు. దీంతో సుమారు రూ. 16 లక్షల 70 వేల నష్టం బీర్ల కంపెనీకి జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి కంపెనీ ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. వైన్స్ నిర్వాహకులు సదరు కంపెనీ బీర్లను కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఏడాదిగా డిపోలోనే నిల్వ ఉండడంతో కాలం చెల్లాయని అధికారులు తెలిపారు. బీర్ల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించగా ఏడాది క్రితమే కాల్లం చెల్లాయని రిపోర్టు రావడంతో పారబోశామని పేర్కొన్నారు. గతంలోనూ కాలంచెల్లిన మద్యాన్ని పారబోసినా, ఇంత భారీస్థాయిలో పారబోయడం ఇదే తొలిసారని డిపో అధికారులు చెబుతున్నారు. -
నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల్లో బీర్ల ప్రవాహం
-
బీర్లకు తగ్గిన క్రేజ్..!
నల్లగొండ : మద్యం ప్రియులు రూటుమార్చారు. మండు వేసవిలో లక్షల కొద్ది పెట్టెలు ఖాళీ కావాల్సిన బీర్లు బేజారెత్తాయి. ఏప్రిల్ పగటి పూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరిన రోజుల్లో కూడా మద్యం ప్రియులు లిక్కర్ పైనే మక్కువ చూపించారు. గతేడాది ఏప్రిల్‌లో బీర్లు లక్షల పెట్టెల్లో ఖాళీగా కాగా...ఈ ఏడాది సేల్స్ తగ్గిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లిక్కర్ సేల్స్ తో పోలిస్తే బీర్ల అమ్మకాలు 4.27 శాతానికి పడిపోయాయి. బీర్ల కంటే లిక్కర్ సేల్స్ పైనే ఎ క్సైజ్ శాఖ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. ఒక్క ఏప్రిల్‌లోనే లిక్కర్ అమ్మకాలు 2.72 శాతం పెరగడంతో ప్రభుత్వానికి రూ.8.88 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. అయితే కిందటి ఏడాదితో పోలిస్తే లిక్కర్, బీర్ల అమ్మకాల్లో కొన్ని సర్కిల్స్ వెనకబడటంతో ఎక్సైజ్ శాఖ కొంత ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రాబడి పెరిగింది... గతేడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఉమ్మడి జిల్లాలో బీర్లు, లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రాబడి రూ.137.84 కోట్లు. కాగా ఈ ఏడాది అదే రోజుల్లో బీర్లు, లిక్కర్ అమ్మకాలతో వచ్చిన ఆదాయం రూ.146.72 కోట్లు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే రూ.8.88 కోట్ల ఆదాయం పెరిగిందని చెప్పొచ్చు. అయితే బీర్ల అమ్మకాలు 11, లిక్కర్ అమ్మకాల్లో నాలుగు సర్కిల్స్‌లో సేల్స్ పడిపోవడం ఎక్సైజ్ ఆదాయానికి గండి పడింది. రాబడి పెరిగినా తగ్గిన సేల్స్... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు లిక్కర్ 2,31,598 పెట్టెలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మూడు జిల్లాల్లో కలిపి 2,37,900 పెట్టెలు పెరిగాయి. అయితే ఎక్సైజ్ సర్కిల్ వారీగా చూసినప్పుడు మాత్రం హుజూర్నగర్, నాంపల్లి, భువనగిరి, మోత్కూరు సర్కిల్స్‌లో లిక్కర్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. 11 సర్కిల్స్‌లో బీర్లు ఢమాల్... నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 15 ఎక్సైజ్ సర్కిల్స్ ఉన్నాయి. వీటిల్లో 11 సర్కిల్స్‌లో బీర్లు సేల్స్ అమాంతగా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు బీర్లు 5, 12,890 పెట్టెలు అమ్ముడవ్వగా... ఈ ఏడాది అదే రోజుల్లో 4,90,981 పెట్టెలకు పడిపోయాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే బీర్లు 21,909 పెట్టెలు తగ్గాయి. సర్కిల్ వారీగా చూసినట్లయితే... అత్యధికంగా భువనగిరి, రామన్నపేట, మోత్కూరు, నకిరేకల్ సర్కిల్స్‌లో బీర్లు సేల్స్ 27.74 శాతం నుంచి 15.22 శాతానికి పడిపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో నల్లగొండ, దేవరకొండ, చండూరు, నాంపల్లి, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ సర్కిల్స్‌లో బీర్ల అమ్మ కాలు 6.86 శాతం నుంచి 1.45 శాతం వరకు తగ్గాయి. గరిష్టంగా బీర్ల అమ్మకాలు మిర్యాలగూడ సర్కిల్లో 36.80 శాతం పెరిగాయి. -
వేడి నుంచి ఉపశమనం పొందేందుకు..
- రూటు మార్చుకున్న మందుబాబులు అనంతపురం: జిల్లాలో మందుబాబులు రూట్ మార్చారు. ఎప్పుడూ హాట్‌తాగే వారు కూడా అనంతలో భానుడు ప్రచండ నిప్పులు కురిపిస్తుండటంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తాగడం మొదలెట్టారు. ఫలితంగా మూడు నెలలుగా బీర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 246 మద్యం షాపుల్లో నెలకు సగటున 50 వేల నుంచి 60 వేల కేసులు అమ్ముడుపోతాయి. అయితే ఈ ఏడాది జనవరిలో 70వేల కేసులు, ఫిబ్రవరిలో 89,350 కేసులు, మార్చిలో 1,35,000 కేసులు విక్రయించారు. ఎండలు మండుతుండటంతో హాట్ తాగేవారు సైతం కూల్‌కూల్‌గా బీర్లు తాగుతుండటం వల్లే బీర్ల అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని, ఏప్రిల్, మే నెలలో వీటి అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వైన్షాపులవారు చెబుతున్నారు. సిండికేట్ల చేతివాటం బీర్ల అమ్మకాలు జోరందుకోవడంతో వైన్‌షాపుల నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి బాటిల్‌పైనా రూ.15 నుంచి రూ.20 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రూ.25 కూడా తీసుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే డిమాండ్ ఎక్కువగా ఉంది. కూలింగ్ చార్జ్ ఎవరిస్తారు. కరెంట్ బిల్లు చాంతాడంత వస్తోంది అంటూ వైన్‌షాపుల వారు పదర్శిస్తున్నారు. నగరంలో అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటుకు విక్రయిస్తున్నారు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడి ఒప్పందం ప్రకారం ఒక్కో సిండికేట్ పరిధిలో ఒకే రేటుకు విక్రయిస్తున్నారు. దీంతో గుత్తిరోడ్డులో ఓ రేటుకు, బైపాస్‌లో మరో రేటుకు మద్యం దొరుకుతోంది. ఈ లెక్కన మద్యాన్ని అదనపు రేట్లకు విక్రయించి నెలకు రూ.కోట్లలో ఆదాయం పొందుతున్నారు. కేవలం బీరు అమ్మకాలపైనే దాదాపు రూ.3 కోట్ల వరకూ అదనపు ఆదాయం పొందుతున్నట్లు అంచనా. జిల్లాలో బీరు అమ్మకాలు ఇలా.. నెల కేసులు మొత్తం రూ. జనవరి 70000 రూ. 63 లక్షలు ఫిబ్రవరి 89350 రూ. 80.41 లక్షలు మార్చి 1.3500 రూ. 12.15 లక్షలు బీరు అమ్మకాలు పెరిగాయి జిల్లాలో బీరు అమ్మకాలు పెరిగాయి. ఇందుకు కారణం భారీగా ఎండలు పెరగడమే. ప్రతి ఏటా వేసవిలో బీరు అమ్మకాలు మామూలుగానే పెరిగుతాయి. అయితే ఈ సారి ఎక్కువ ఎండలు ఉండడంతో బీర్లు అమ్మకాలు జోరందుకున్నాయి. గత మార్చి నెలలో 13500 కేసులు అమ్ముడుపోయాయి. భవిష్యత్‌లో మరెంతపెరిగే అవకాశాలు ఉన్నాయి. - అనిల్‌కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ -
థండా థండా.. కూల్ కూల్
నిజామాబాద్ క్రైం : మండుతున్న ఎండల నుంచి రక్షించుకునేం దుకు నీరు తాగండి. కొబ్బరి బోండాలు, నిమ్మరసం, మజ్జిగ తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ, ఈ సలహాలేవీ మందు బాబుల చెవికి ఇంపుగా అని పించలేదో..! లేక ఇంకా చల్లటిది కావాలని కోరుకున్నారేమో.! ఏదేమైనా వేసవి పుణ్యమా అని బార్ షాపులకు మంచి గిరాకే అరుునట్లు తెలిసింది. గతం లో బీర్లు కావాలంటే రాత్రి 12 గంటలకు వెళ్లినా దొరి కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాత్రి 8 దాటిందంటే బీరు దొరకాలంటే గగనమే అవుతోందని మందు బాబులు వాపోతున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ నెలలో 80 వేల కార్టన్ల బీరు బాటిళ్లు అమ్ముడవగా, మే నెలలో ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల కార్టన్లకు పైగా బీర్లు అమ్ముడైనట్టు బార్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. పైగా గత సంవత్సరం ఇదే నెలలో ఎన్ని కార్టన్ల బీర్లు అమ్మకాలు జరిగాయో వాటిపై 20 శాతం అదనంగా ఈ నెలలో అమ్మకాలు జరపాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ ఆదేశాలతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. -
బీరు.. జోరు!
రూ.2కోట్ల మద్యం తాగేశారు! కర్నూలు: నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం వ్యాపారం మూడు బీర్లు, ఆరు క్వాటర్లుగా సాగింది. గత రెండు రోజులుగా మందు బాబులు ఏమి తాగారనే కోణంలో పరిశీలిస్తే.. ఎక్కువగా బీర్లు వినియోగించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా వేసవిలోనే బీర్ల వినియోగం అధికంగా ఉంటుంది. కానీ జిల్లాలో మాత్రం సీజన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కొత్త సంవత్సర వేడుకల పేరుతో ఎంచక్కా బీరు సీసాలతో పండుగ చేసుకున్నారు. నవంబర్ మాసంలో రూ.6 కోట్ల విలువ చేసే బీర్ల విక్రయాలు జరగ్గా.. డిసెంబర్లో 8 కోట్లు బీర్లు అమ్ముడుపోయాయి. చివరి రెండు రోజుల్లోనే రూ.2 కోట్ల బీరు విక్రయాలు జరిగినట్లు సమాచారం. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు వేడుకలు చేసుకున్న మద్యం బాబులు రెండవ రోజు కూడా(జనవరి 1) దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని తాగేశారు.