థండా థండా.. కూల్ కూల్
నిజామాబాద్ క్రైం : మండుతున్న ఎండల నుంచి రక్షించుకునేం దుకు నీరు తాగండి. కొబ్బరి బోండాలు, నిమ్మరసం, మజ్జిగ తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ, ఈ సలహాలేవీ మందు బాబుల చెవికి ఇంపుగా అని పించలేదో..! లేక ఇంకా చల్లటిది కావాలని కోరుకున్నారేమో.! ఏదేమైనా వేసవి పుణ్యమా అని బార్ షాపులకు మంచి గిరాకే అరుునట్లు తెలిసింది. గతం లో బీర్లు కావాలంటే రాత్రి 12 గంటలకు వెళ్లినా దొరి కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాత్రి 8 దాటిందంటే బీరు దొరకాలంటే గగనమే అవుతోందని మందు బాబులు వాపోతున్నారు.
వేసవి తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ నెలలో 80 వేల కార్టన్ల బీరు బాటిళ్లు అమ్ముడవగా, మే నెలలో ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల కార్టన్లకు పైగా బీర్లు అమ్ముడైనట్టు బార్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. పైగా గత సంవత్సరం ఇదే నెలలో ఎన్ని కార్టన్ల బీర్లు అమ్మకాలు జరిగాయో వాటిపై 20 శాతం అదనంగా ఈ నెలలో అమ్మకాలు జరపాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ ఆదేశాలతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది.