bar shop
-
మద్యం షాపులు అప్పగించాలంటూ బార్లో టీడీపీ నేత వీరంగం
-
ఇంకా మూడ్రోజులే..!
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల నిర్వహణకు గాను టెండర్ దాఖలు చేసేందుకు మరో మూడ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16తో ముగియనున్న నేపథ్యంలో చివరి మూడ్రోజులు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొదటి 4 రోజుల్లో రాష్ట్రంలోని 2,216 షాపులకు గాను 4,326 దరఖాస్తులు వచ్చాయి. స్పందన బాగుందని, కొత్త ఔత్సాహికులు దరఖాస్తులు తీసుకుంటున్నారని, చివరి మూడ్రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. గతంలో వచ్చిన 40 వేల దరఖాస్తులను మించి దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. మద్యం వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు మద్యం వ్యాపారంలో ఈసారి కొత్త వ్యక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ మద్యం వ్యాపారం పరిధి పెరిగిపోతుండటం, దేశంలోనే ఎక్కువ మార్జిన్‌ను రిటైలర్లకు ప్రభుత్వం ఇస్తుండటంతో లాభాలు గడించవచ్చనే ఆలోచనతో ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో 23%మంది మద్యం తీసుకుంటున్నా రని అంచనా. ఈ వ్యాపారంలోకి కొత్తవారు రాకుం డా ఇప్పటికే లైసెన్సులున్న రిటైలర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం వ్యాపా రంలో ఉన్న కష్టాలను చెప్పుకుంటూ ఈ వ్యాపా రం అంత లాభసాటి కాదనే ప్రచారం కూడా క్షేత్రస్థాయిలో జరుగుతోంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం దేశంలోనే ఇంత సులభమైన ఎక్సైజ్ పాలసీ మరొకటి లేదంటున్నారు. హైదరాబాద్‌పై ‘ఆశలు’ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో కూడా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ డివిజన్లో మొత్తం 173 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటివరకు 91 దరఖాస్తులు వచ్చాయి. తొలి నాలుగు రోజుల్లో గతంలో ఇన్ని దరఖాస్తులు ఎప్పుడూ రాలేదని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఎప్పుడూ చివరి రెండ్రోజులు, ముఖ్యంగా చివరిరోజు దరఖాస్తులు వెల్లువలా వస్తాయని చెబుతున్నారు. దాఖలైన దరఖాస్తులకు పదింతలు ఎక్కువ దరఖాస్తులు ఇప్పటికే తీసుకున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో మంచి స్పందన ఉంటుందని ఎక్సైజ్ అధికారులు ఆశలు పెట్టుకోవడం గమనార్హం. -
బ్రాందీ కోసం గాంధీ మాయం..!
సాక్షి, గుంటూరు: బ్రాందీ షాపు ముందు గాంధీ విగ్రహం ఉండడంపై విమర్శలు రావడంతో గాంధీ విగ్రహాన్నే అక్కడ లేకుండా చేసేశారు. బార్ షాపు యజమానులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో తమ చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే గాంధీని మాయం చేయగలిగారు. జాతిపిత విగ్ర హం అని తెలిసినా అధికారులు ఏమాత్రం ఆలోచించలేదు. గాంధీ విగ్రహాన్ని తీసుకువెళ్లి ఆయన పేరుతోనే ఏర్పాటు చేసిన గాంధీ పార్కులో ఉంచారు. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని పట్టాభిపురం జూట్‌మిల్లు పక్కనే ఉన్న ఓ బార్ షాపు ఎదురుగా అనేక ఏళ్లుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. విగ్రహం ఎదురుగా బార్‌షాపు ఎలా అనుమతిస్తారంటూ అనేకసార్లు స్థానికులు ఆందోళనకు సైతం దిగారు. అయితే రాజకీయ అండదండలు ఉన్న సదరు బార్‌షాపు యాజమాన్యం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు తీశారో ఏమో తెలియదుగానీ గాంధీ విగ్రహాన్ని తొలగించేశారు. రెండు మూడు రోజులుగా గాంధీ విగ్రహం మాయమవడంపై స్థానికులు గందరగోళానికి గురై ఆరా తీయగా నగరపాలక సంస్థ అధికారులే దాన్ని తొలగించినట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. అదేమని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు ఆదే శాలను అనుసరించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే గాంధీ విగ్రహాన్ని తొలగించామని చెబుతుండడం గమనార్హం. మార్చి నెల 24వ తేదీన గాంధీ విగ్రహంతో పాటు నగరంలో మరో 20 విగ్రహాల వరకూ తొలగించామని వారు చెబుతున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా మారిందనే నెపంతో బార్ షాపు యజమానులతో కుమ్మక్కై ఎవ్వరికీ చెప్పకుండా తొలగించడంపై స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. గాంధీ విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం స్పందించి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ విషయంపై నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. -
థండా థండా.. కూల్ కూల్
నిజామాబాద్ క్రైం : మండుతున్న ఎండల నుంచి రక్షించుకునేం దుకు నీరు తాగండి. కొబ్బరి బోండాలు, నిమ్మరసం, మజ్జిగ తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ, ఈ సలహాలేవీ మందు బాబుల చెవికి ఇంపుగా అని పించలేదో..! లేక ఇంకా చల్లటిది కావాలని కోరుకున్నారేమో.! ఏదేమైనా వేసవి పుణ్యమా అని బార్ షాపులకు మంచి గిరాకే అరుునట్లు తెలిసింది. గతం లో బీర్లు కావాలంటే రాత్రి 12 గంటలకు వెళ్లినా దొరి కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాత్రి 8 దాటిందంటే బీరు దొరకాలంటే గగనమే అవుతోందని మందు బాబులు వాపోతున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ నెలలో 80 వేల కార్టన్ల బీరు బాటిళ్లు అమ్ముడవగా, మే నెలలో ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల కార్టన్లకు పైగా బీర్లు అమ్ముడైనట్టు బార్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. పైగా గత సంవత్సరం ఇదే నెలలో ఎన్ని కార్టన్ల బీర్లు అమ్మకాలు జరిగాయో వాటిపై 20 శాతం అదనంగా ఈ నెలలో అమ్మకాలు జరపాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ ఆదేశాలతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. -
నేటినుంచి బార్ షాపుల రెన్యూవల్
కొత్త వాటికి లభించని అనుమతి వరంగల్ క్రైం : ఈ సారి కొత్త బార్ షాపులకు అనుమతి లభించలేదు. దీంతో ఇప్పటివరకు నడుస్తున్న దుకాణాలకే రెన్యూవల్ చేయనున్నారు. సోమవారం ఆ ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 90 బార్ షాపులు ఉండగా, రెన్యూవల్ ద్వారా రూ.34కోట్ల 16లక్షల ఆదాయం సమకూరునుంది. ఇప్పటికే వైన్ షాపుల టెండర్ల ప్రక్రియ ముగియగా, బార్ షాపులతో కలుపుకుని జిల్లాలో మొత్తంగా మద్యం విక్రయ కేంద్రాలు 322కు చేరుకున్నాయి. వాస్తవానికి 234 వైన్ షాపులకు దరఖాస్తులు కోరగా, 227 కే టెండర్లు వచ్చాయి. వీటిలో 25 షాపులకు ఒక్కో దరఖాస్తే వచ్చింది. 202 షాపులకు పోటీ ఉండగా, వాటిని లాటరీ ద్వారా కేటాయించారు. టెండర్లు పడని ఏడు దుకాణాల్లో రెండింటిని మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించగా, ఐదు షాపులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉండగా, 2014-15 సంవత్సరానికిగాను బార్ షాపుల రెన్యూవల్స్ సోమవారం నుంచి చేపట్టనున్నారు. వాస్తవానికి దీనికి తుది గడువు లేనప్పటికీ జూలై ఒకటో తేదీలోపే బార్ షాపుల యజమానులు రెన్యూవల్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. రెన్యూవల్ సమయంలో లెసైన్స్ ఫీజులో 1/3 వంతుగానీ, సగం గానీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని 90 బార్లలో కార్పొరేషన్ (వరంగల్, హన్మకొండ, కాజీపేట) పరిధిలోనే 88 షాపులు ఉన్నాయి. మిగతా రెండు జనగామలో ఉండడం గమనార్హం. అక్కడి జనాభా ప్రాతిపదికన ఒక్కో బార్‌కు రూ.35 లక్షలు లెసైన్స్ ఫీజుగా నిర్ధారించారు. మహబూబాబాద్ పరిధిలో బార్లు లేవు. అయితే ఇప్పటికే జనాభాకు మించి బార్లు ఉండడంతో కొత్త వాటికి అనుమతి లేనట్లు సమాచారం. అయితే, ఈదఫా కొత్త పాలసీలో ఆరు రెట్ల ప్రివిలేజిని ఐదు రెట్లకు కుదించారు. దీంతో వ్యాపారుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల 28 లక్షల విలువ చేసే సరుకు అమ్మితే 18శాతం నుంచి 20 శాతం మేర లాభం ఉండేది. తాజా నిర్ణయంతో రూ.1కోటి 90 లక్షల మద్యం మాత్రమే అమ్మడానికి వీలుంటుంది. అంతకు మించితే 14.5 శాతం మేర ఫీజును అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కొరవడిన నిఘా.. ధరల్లో దగా.. లెసైన్స్.. దాని ఫీజు ఎలా ఉన్నా.. బార్ షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఉన్న కొంత వెసులుబాటును ఆసరాగా చేసుకుని ధరలను ఇష్టారీతిగా పెంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, బార్లలో ధరలపై తాము చేసేదేమీ ఉండదని ఎక్సైజ్అధికారులు చెబుతున్నారు. తమకు ధరలను నియంత్రించే అధికారం లేదని ఎక్సైజ్ శాఖ తేల్చివేయడంతో బార్ షాపుల యజమానులు విచ్చలవిడిగా ధరలు వసూలు చేస్తున్నారు. ఇక నకలీ మద్యం కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఠాణాలో లిక్కర్ మామూళ్ల వార్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మధ్య లిక్కర్ వార్ జరుగుతోంది. మామూళ్ల విషయంలో తేడా రావడంతో ఏకంగా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఒకేస్టేషన్‌లో ఇద్దరు అధికారులు మామూళ్ల కోసం పట్టుబడుతుండడం లిక్కర్ షాపుల యజమానులకు శాపంగా మారింది. వారి కోపాగ్నికి లిక్కర్ షాపు యజమానులు బలవుతున్నారు. అటు మామూళ్లు ఇచ్చి కటకటాలలో కూర్చోవాలా అంటూ సదరు అధికారులను బహిరంగంగానే నిలదీయడం చర్చనీయంశంగా మారింది. చిలికి..చిలికి గాలివానగా మారిన మామూళ్ల వ్యవహారం బాస్ వద్దకు చేరింది. ఆయన తీవ్రస్థారుులో విరుచుకుపడినా పరిస్థితిలో మార్పు వచ్చినట్టు కనిపించడంలేదు. నాలుగు రోజుల క్రితం.. నాలుగు రోజుల క్రితం నగరంలోని ఒక బార్ షాపుపై స్థానిక ఎస్సై దాడి చేశారు. అర్ధరాత్రి, అపరాత్రిఅంటూ నిబంధనల పేరుతో యజమానిని వేధించారు. సదరు యజమానిపై పరుష పదజాలం ప్రయోగిస్తూ బలవంతంగా అతడిని స్టేషన్‌కు లాక్కొచ్చారు. దీంతో ఆగ్రహించిన సదరు బార్ యజమాని తనను బలవంతంగా తీసుకొచ్చిన ఎస్సైపై తిరుగబడ్డాడు. మామూళ్లు తీసుకోవడం లేదా ? మీ సార్‌కు ప్రతీ నెలా రూ.10 వేలు ఇస్తున్నార కదా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ నిలదీశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎస్సై తనకు మామూళ్లు ఇవ్వడం లేదనే విధంగా మాట్లాడినట్టు సమాచారం. ఠాణాలో మామూళ్ల గొడవపై సదరు బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఆ నోటా ఈ నోటా రేంజ్ అధికారికి తెలియడంతో సదరు ఠాణా ఇన్స్పెక్టర్ను మందలించినట్లు సమాచారం. ప్రవర్తనలో మార్పు రాకుంటే వేటు తప్పదనే హెచ్చరికలు జారీచేసినట్లు తెలిసింది. రోజుల తరబడి తిరగాల్సిందే.. ఇదిలా ఉండగా ఆ స్టేషన్ పరిధిలో చిన్నగొడవ అ రుునా రోజుల తరబడి తిరగాల్సిందేనని బాధితు లు వాపోతున్నారు. ప్రతీరోజు స్టేషన్‌కు రమ్మని పి లవడం సమస్య కొలిక్కి తేకుండా రేపు...రా... అం టూ ఇలా రోజుల తరబడి తిప్పడం వెనుక మతలబు ఏమిటని పలువురు బహిరంగంగానే చర్చిం చుకుంటున్నారు. ఈ స్టేషన్లో ఇద్దరు అధికారుల కు పొసగకపోవడంతో బాధితులు తీవ్రఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.