ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖకు కొత్త సమస్య వచ్చి పడింది. లాక్‌డౌన్ కాలానికి బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్ ఫీజు మినహాయింపు అంశం తేలకముందే మరోటి తెరపైకి వచ్చింది. కరోనా నిబంధనలు అమలైన సమయంలో తాము తయారు చేసిన లక్షల బీర్లు మురిగిపోయాయని, ఆ బీర్లకు సుంకం కట్టలేమని బ్రేవరీలంటున్నాయి. ఈ మేరకు ఆ సుంకాన్ని మినహాయించాలని కోరుతున్నాయి. కానీ, ఎక్సైజ్ వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనను నిరాకరిస్తున్నాయి. మార్చి 20 తర్వాత రెండున్నర నెలలు వైన్‌షాపులు, ఆరు నెలలకుపైగా బార్లు మూసేశారు. ఈ కాలంలో వైన్‌షాపులు, బార్లలో ఉన్న బీర్లు అలాగే ఉండిపోయాయి. అయితే, ఆ కాలంలో బ్రేవరీల్లో తయారు చేసిన బీర్లు కూడా నిల్వ ఉన్నాయి.
ఆ సుంకం విలువ సుమారు రూ.15 కోట్లు
బీర్ కాలపరిమితి ఆరు నెలలే కావడంతో వైన్‌షాపులు తెరచిన తర్వాత బార్లలోని బీర్లను వైన్స్‌కు తరలించారు ఎక్సైజ్ అధికారులు. కానీ, బ్రేవరీల్లో పెద్ద ఎత్తున తయారైన లక్షల కేసుల బీర్లు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బీర్లన్నీ మురిగిపోయాయని, వాటిని పారబోయాల్సి వస్తోందని, ఆ బీర్లకు తయారీ సుంకం కట్టలేమని బ్రేవరీలంటున్నాయి. ఈ విధంగా బ్రేవరీలు కట్టలేమని చెబుతున్న సుంకం విలువ రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment