బీర్లు, లిక్కర్‌ విక్రయాల్లో పరకాల టాప్‌ | Sakshi
Sakshi News home page

బీర్లు, లిక్కర్‌ విక్రయాల్లో పరకాల టాప్‌

Published Sun, Dec 24 2023 1:12 AM

- - Sakshi

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మద్యం ప్రియులు బీర్లకే జై కొడుతున్నారు. 2022లో 1,07,73,420.. ఈ ఏడాది ఏకంగా 1,26,32,616 బీర్లు తాగారు. అంటే గతేడాది 8,97,785 కేసులు.. ఎన్నికలు జరిగిన ఈ సంవత్సరంలో 10,52,718 కేసుల బీర్లు తాగారు. 2022లో 5,61,186 ఐఎంఎల్‌ (లిక్కర్‌) కేసులు తాగితే ఈసారి ఆ సంఖ్య 5,39,437కి తగ్గింది. మద్యం అమ్మకాలతో 2022లో రూ.574.98 కోట్లు.. ఈసారి రూ.589.89 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి వచ్చి చేరాయి. ఈ ఏడాది సంక్రాంతి, దసరా, వివిధ పండుగలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మద్యానికి భారీగా గిరాకీ పెరిగింది.

అందుకే గతేడాది మించి ఈసారి ఎక్కువగా మద్యం ప్రియులు మద్యాన్ని లాగేశారని ఎకై ్సజ్‌ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్ట్‌ షాపును ప్రోత్సహించడంతో ఆదాయం భారీగా పెరగడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతమున్న ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కొరడా ఝుళిపిస్తుండడంతో వచ్చే ఏడాది మద్యం విక్రయాలు తగ్గే అవకాశముందని ఎకై ్సజ్‌ విభాగంలో అంతర్గత చర్చ జోరుగా జరుగుతోంది.

అక్కడే టాప్‌...
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 63 వైన్‌షాపులు, ఏడు బార్లు ఉన్నాయి. నర్సంపేట సర్కిల్‌లో 25, వర్ధన్నపేట సర్కిల్‌లో 16, పరకాల సర్కిల్‌లో 22 మద్యం దుకాణాలు ఉన్నాయి. నర్సంపేటలో 2022లో 1,98,551 లిక్కర్‌ (ఐఎంఎల్‌) కేసులు, 3,30,471 బీరు కేసులు విక్రయిస్తే.. 2023లో 1,90,636 లిక్కర్‌ కేసులు, 3,84,878 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో 208.61 కోట్ల ఆదాయం వస్తే.. ఇప్పుడు రూ.214.15 కోట్ల ఆదాయం వచ్చింది. పరకాల సర్కిల్‌లో 2022లో 2,12,263 లిక్కర్‌ (ఐఎంఎల్‌) కేసులు, 3,29,736 బీరు కేసులు విక్రయించారు.

ఈ ఏడాది 2,02,288 లిక్కర్‌ కేసులు, 3,91,744 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో రూ.213.98 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.218.41 కోట్లు వచ్చాయి. ఇక వర్ధన్నపేట సర్కిల్‌లో 2022లో 1,50,372 లిక్కర్‌ కేసులు, 2,37,578 బీరు కేసులు విక్రయిస్తే ఈ ఏడాది 1,46,513 లిక్కర్‌ (ఐఎంఎల్‌) కేసులు, 2,76,096 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అంటే 2022లో రూ.152.36 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.157.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా ఓవరల్‌గా తీసుకుంటే బీర్ల విక్రయాల్లో పరకాల ముందుండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉంది. లిక్కర్‌ తాగడంలో పరకాల మొదట స్థానంలో ఉండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement