సాధారణ వ్యక్తులతో పోలిస్తే మందుబాబుల తెలివి మాములుగా ఉండదు. ఎప్పుడూ రాని ఆలోచనలు చుక్క దిగితే ఉప్పెనల తన్నుకస్తుంటాయి. ఏ పని చేసినా చేయకున్నా.. టైమ్‌కు నోట్లోకి మందు పడాల్సిందే. లేదంటే ఉక్కిరిబిక్కిరవుతుంటారు. అసలే ఇప్పుడు కరోనా ముంచుకొస్తుంది. ఒకవేళ లాక్‌డౌన్ పెడితే మాత్రం మందుబాబుల కష్టాలు అంతా ఇంతా కాదు. అందుకే ముందు జాగ్రత్తగా ఇప్పుడే మందు బాటిళ్లను కొని తెచ్చుకుని ఫుల్‌గా స్టాక్ పెట్టుకుంటున్నారు.
కరోనాను కూడా లెక్క చేయకుండా, భౌతిక దూరం పాటించకుండా కలబడి మరీ మందును సాధిస్తున్నారు. కష్టపడి లిక్కర్, బీర్లు తెచ్చుకోవడం ఒక సవాల్ అయితే వాటిని ఇంట్లో కుటుంబికులకు, స్నేహితులకు తెలియకుండా దాయడం మరో పెద్ద టాస్క్. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి కత్తిలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలుసేమో.. తన బుర్రకు టెక్నాలజీతో పదును పెట్టి .. బీర్లు దాచేందుకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పూల కుండీల అడుగున కనీసం పాతిక బీర్లు పట్టేలా కంపార్ట్‌మెంట్ తయారు చేశాడు. బయటకు చూసేందుకు అది పూల కుండీలాగే కనిపిస్తుంది. కానీ, చిన్న బటన్ నొక్కితే.. పూల కుండీ పైకి లేచి.. దాని అడుగున ఉన్న మందు బాటిళ్ల కంపార్ట్‌మెంట్ పైకి వస్తుంది. ఎంతైనా వీడి తెలివిని ప్రశంసించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment