hide
-
‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో!
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. కొందరు కారును హెలికాప్టర్‌గా మారుస్తారు. మరికొందరు ఇటుకలతో కూలర్‌ను తయారు చేసేస్తారు. తాజాగా వీటన్నింటికి మించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా నోరెళ్ల బెడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లాడి తెలివిని చూసి, అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి పిల్లలు మొబైల్ ఫోను చూడటంతో ఎంత బిజీ అయిపోయారంటే వారు ఒక్క నిమిషం కూడా ఫోనును విడిచిపెట్టడం లేదు. ఒక కుర్రాడు ఒకవైపు చదువుకుంటున్నట్లు నటిస్తూ, దొంగచాటుగా మొబైల్ ఫోన్ ఎలా చూస్తున్నాడో ఈ వీడియోలో కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లవాడు టేబుల్‌పై కూర్చుని చదువుకోవడంతో పాటు అతని ముందున్న గోడకు ఆనుకుని, తీగతో మొబైల్ వేలాడదీయడాన్ని మనం గమనించవచ్చు. పిల్లాడు మొబైల్ చూడటంతో మునిగివుండగా, అప్పుడే తలుపు తెరిచి గదిలోకి ప్రవేశించింది ఆ కుర్రాడి తల్లి. ఇలా తల్లి తలుపు తెరవగానే.. గోడకు వేలాడుతున్న మొబైల్ వెంటనే టవల్ వెనుకకు చేరుకుంది. ఆ తల్లి గది నుండి బయటకు వెళ్లగానే మొబైల్‌ఫోన్ మళ్లీ ఆ పిల్లాడి ముందు కనిపిస్తుంది. ఆ కుర్రాడు మొబైల్ ఫోనును తన తల్లికి తెలియకుండా దాచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాడో వీడియోలో స్పష్టగా కనిపిస్తుంది. ఈ వీడియో @TheFigen_ పేరుతో X (ట్విట్టర్)లో షేర్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ పిల్లవాడిని స్మార్ట్ బాయ్ అని పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: ‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు! Smart boy 😂pic.twitter.com/lXKoy7ZVK6 — Figen (@TheFigen_) August 24, 2023 -
మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్ వెనక్కి వెళ్లారంటే!
హ్యారీ పాటర్ సినిమాలో చూసే ఉంటారు. ఒక వింత వస్త్రాన్ని చుట్టేసుకొని హ్యారీ టక్కున మాయమైపోతుంటాడు. అతను అక్కడే ఉన్నా చూసే వాళ్లకు మాత్రం లేడనిపించేలా ఆ వస్త్రం కనికట్టు చేస్తుంది. వెనకున్న వస్తువులు కనిపిస్తాయి కాని అతను మాత్రం కనిపించడు. మళ్లీ దాన్ని తీసేయగానే హ్యారీ బయటకు కనిపిస్తుంటాడు. ఇలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఈ వెరైటీ వస్త్రాన్ని ఇప్పుడు నిజంగానే షీట్ రూపంలో తయారు చేశారు. లండన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఇన్విజిబిలిటీ షీల్డ్ కో’.. ఈ మ్యాజిక్ షీట్‌ను తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతలా కష్టపడ్డారో! ఇన్విజిబిలిటీ షీల్డ్‌ను అనుకున్నట్టు తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డామని తయారీ బృందం చెప్పింది. ఎన్నో వస్తువులు, పదార్థాలను పరీక్షించామని, ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయని తెలిపింది. విభిన్న కోణాలు, ఆకృతులు, దూరాల్లో లెన్స్‌లను పరీక్షించామని.. చివరగా కుంభాకార కటకాలను పాలిమర్ షీట్లో ఓ శ్రేణిలో అమర్చి అనుకున్న ఫలితాన్ని రాబట్టామని వివరించింది. గడ్డి ప్రాంతాలు, తీర ప్రాంతాలు లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉన్న ప్రదేశాల్లో ఈ షీల్డ్‌లు అద్భుతంగా పని చేస్తాయంది. ఎక్కువ ఉష్ణోగ్రతను, అల్ట్రావయోలెట్ కాంతిని తట్టుకోగలవని తెలిపింది. ఇంతకీ ఈ షీల్డ్‌ల ధరెంతో తెలుసా? 37్ఠ25 ఇంచుల షీల్డ్‌కు కేవలం రూ.30 వేలు. ఇప్పటికే 25 షీల్డ్‌లను తయారు చేశారు. మరిన్ని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షీల్డ్ ఎలా పని చేస్తుందంటే..? ఇన్విజిబిలిటీ షీల్డ్ వెనుక దాక్కునే వ్యక్తులు, వస్తువులు కనిపించకుండా ఉండేందుకు నిలువు పద్ధతిలో ప్రత్యేక లెన్స్ శ్రేణిని (ఒకదాని పక్కన మరొకటి వరుసగా పేర్చడం) వాడారు. షీల్డ్ ముందు నుంచి చూసే వ్యక్తికి షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించకుండా కాంతిని పరావర్తనం చెందించే సూత్రాన్ని ఉపయోగించారు. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి నుంచి పరావర్తనం చెందే కాంతి షీల్డ్ ముందున్న వ్యక్తి వరకు చేరకుండా పక్కలకు ప్రసరించేలా లెన్స్‌లను వాడారు. షీల్డ్ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ మాత్రం బాగా కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించడు కానీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కనిపిస్తుంది. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి మాయమైనట్టే! చదవండి: 24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది! –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైరల్ ఎవరికి కనపడకుండా బీర్లను ఎక్కడ దాచాడో తెలుసా..
సాధారణ వ్యక్తులతో పోలిస్తే మందుబాబుల తెలివి మాములుగా ఉండదు. ఎప్పుడూ రాని ఆలోచనలు చుక్క దిగితే ఉప్పెనల తన్నుకస్తుంటాయి. ఏ పని చేసినా చేయకున్నా.. టైమ్‌కు నోట్లోకి మందు పడాల్సిందే. లేదంటే ఉక్కిరిబిక్కిరవుతుంటారు. అసలే ఇప్పుడు కరోనా ముంచుకొస్తుంది. ఒకవేళ లాక్డౌన్ పెడితే మాత్రం మందుబాబుల కష్టాలు అంతా ఇంతా కాదు. అందుకే ముందు జాగ్రత్తగా ఇప్పుడే మందు బాటిళ్లను కొని తెచ్చుకుని ఫుల్‌గా స్టాక్ పెట్టుకుంటున్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా, భౌతిక దూరం పాటించకుండా కలబడి మరీ మందును సాధిస్తున్నారు. కష్టపడి లిక్కర్, బీర్లు తెచ్చుకోవడం ఒక సవాల్ అయితే వాటిని ఇంట్లో కుటుంబికులకు, స్నేహితులకు తెలియకుండా దాయడం మరో పెద్ద టాస్క్. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి కత్తిలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలుసేమో.. తన బుర్రకు టెక్నాలజీతో పదును పెట్టి .. బీర్లు దాచేందుకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పూల కుండీల అడుగున కనీసం పాతిక బీర్లు పట్టేలా కంపార్ట్మెంట్ తయారు చేశాడు. బయటకు చూసేందుకు అది పూల కుండీలాగే కనిపిస్తుంది. కానీ, చిన్న బటన్ నొక్కితే.. పూల కుండీ పైకి లేచి.. దాని అడుగున ఉన్న మందు బాటిళ్ల కంపార్ట్మెంట్ పైకి వస్తుంది. ఎంతైనా వీడి తెలివిని ప్రశంసించాల్సిందే. చదవండి: మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు -
15 ఏళ్ల తర్వాత.. వాషింగ్ మెషీన్లో చిక్కాడు
సాక్షి, ముంబై : 15 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. ఛీటింగ్ కేసులలో నిందితుడైన అతని కోసం ప్రతీసారి పక్కా సమాచారంతో దాడి చేస్తున్నా... అతను దొరక్కపోవటం పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించేది. చివరకు అతని ఇంట్లోనే నాటకీయ పరిణామాల మధ్య అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే... జూహు ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తిపై 2002 లో ఓ కేసు నమోదు అయ్యింది. బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి కొందరి నుంచి సుమారు 1 లక్ష రూపాయాల దాకా వసూలు చేశాడు. వారి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం వేట ప్రారంభించారు. ఇతగాడు పుణేలో జరిగిన ఓ కోటి రూపాయల స్కామ్‌లో నిందితుడిగా కూడా ఉన్నాడంట. దీంతో అతన్ని పోలీసులు 15 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నా ఫలితం లేకపోయింది. చివరకు సోమవారం అతను నివసించే అపార్ట్‌మెంట్‌ను మూడు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అతని భార్య మాత్రం వారిని ఇంట్లోకి అనుమతించలేదు. మూడు గంటల తర్వాత వాళ్లు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. వాషింగ్‌మెషీన్ డోర్ నుంచి దుస్తులను బయట పెట్టి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. చివరకు పోలీసులు మూత తెరిచి చూడగా అందులో అతగాడు నక్కి ఉన్నాడు. అవాక్కయిన పోలీసులు చివరకు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. -
నయీమ్ ‘ఐపీఎస్’ గాయబ్
-
నయీమ్ ‘ఐపీఎస్’ గాయబ్
కేసులో విచారిస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి.. ► గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపి కోట్లకు పడగలెత్తిన వైనం ► సెటిల్మెంట్లు, భూదందాలు, కబ్జాలతో అడ్డగోలు సంపాదన ► ఆస్తులకు బినామీగా తోడల్లుడు... ఇటీవలే ఆయన షోరూంలో సిట్ సోదాలు ► నయీమ్‌తో చుట్టరికం కూడా కలుపుకొన్న మాజీ ఐపీఎస్ అధికారి ► కేసులో తన పేరు బయటకు రాకుండా మాజీ డీజీపీతో స్కెచ్ ► అరెస్ట్ తప్పదని మాయమైపోయారంటున్న సిట్ సాక్షి, హైదరాబాద్: ఆయన పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్‌గా పనిచేశారు.. అదనపు డీజీపీ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందారు.. మావోయిస్టు కార్యకలాపాలపై డేగ కన్ను వేసే ఎస్ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు చీఫ్‌గా రెండున్నరేళ్లు పనిచేసిన ఆయన గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో చేతులు కలిపారు.. సెటిల్మెంట్లు, భూదందాలు, కబ్జాలకు పాల్పడ్డారు.. వందల కోట్లకు పడగలెత్తారు.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూమిని వెనకేసుకున్నారు.. ఇప్పుడు నయీమ్ కేసులో ఉచ్చు బిగుస్తుండటంతో జంప్ అయ్యారు! అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు!! పరువు పోతుందని.. నయీమ్ కేసులో తనను ఎక్కడ విచారిస్తారో నన్న భయంతోనే సదరు రిటైర్డ్ అదనపు డీజీపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. నయీమ్ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు అధికారులు, విచారణ ఎదుర్కొంటున్న మరో ముగ్గురు అధికారుల ద్వారా ఈయన కార్యకలాపాలు సాగించినట్టు సిట్ ఇప్పటికే ధ్రువీకరించింది. భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు ఢిల్లీలోని ఓ ఇంటిని సైతం నయీమ్ ఈ మాజీ అధికారికి ఇప్పించాడని, ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనను విచారిస్తారని భావించి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. నోటీసులు జారీ చేస్తే ఎక్కడ పరువు పోతుందోనని హైదరాబాద్‌కు రావడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉంటూ కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చే యత్నాలు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవలే తోడల్లుడి షోరూంలో సోదాలు నయీమ్ అండదండలతో రెచ్చిపోయిన సదరు మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి బంజారాహిల్స్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 500 గజాల స్థలం కబ్జా చేసి భవనం నిర్మించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇందులో ఆయన కుటుంబీకులు ఓ షోరూం నిర్వహిస్తున్నారని, అందులో రెండు నెలల క్రితం తాము సోదాలు కూడా నిర్వహించి సంబంధిత పత్రాలు తీసుకున్నట్లు సిట్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలోని ఓ కీలక కమిషనరేట్‌కు కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ నయీమ్‌ను అక్కడకు పిలిపించి సెటిల్మెంట్లు చేసినట్టు ఫిర్యాదులు వచ్చినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. నయీమ్‌తో ద్వారా చేయించిన భూకబ్జాలు, ఆస్తులన్నింటిని తన పేరిట కాకుండా తోడల్లుడి పేరిట సదరు మాజీ అధికారి రిజిస్ట్రేషన్ చేయించారని, ప్రస్తుతం తోడల్లుడు షోరూం నిర్వహణలో భాగంగా విదేశాల్లో ఉంటూ బిజినెస్ చేస్తున్నారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఆయన కూడా.. నయీమ్ కేసులో విచారిస్తారని భయపడి విదేశాలకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. మొత్తం ఆస్తులన్నీ వారి పేరిటే ఉండటంతో తనకేమీ సంబంధం లేన్నట్టు రిటైర్డ్ ఐపీఎస్ వ్యవహరిస్తున్నారని, కానీ త్వరలోనే ఆయనకు నోటీసులిచ్చి విచారిస్తామని దర్యాప్తు అధికారులు స్పష్టంచేశారు. నయీమ్‌తో చుట్టరికం కూడా.. మాజీ సీనియర్ ఐపీఎస్ కుటుంబంలో నయీమ్ కుటుంబానికి సంబంధించిన యువతి ఉందని, ఆమె ఎవరన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. ఆమె పేరిట నగర శివారులో నాలుగెకరాల భూమి పత్రాలున్నాయని పేర్కొన్నాయి. ఆ యువతిని రిటైర్డ్ ఐపీఎస్ తోడల్లుడి కుమారుడికి ఇచ్చి నయీమ్ స్వయంగా వివాహం జరిపించాడు. ఈ విషయాన్ని నయీమ్ భార్య తన వాంగ్మూలంలో పేర్కొందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ బంధుత్వాన్ని అడ్డుపెట్టు కొని సదరు మాజీ ఐపీఎస్ భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు తమ దర్యాప్తులో బయటపడిందన్నారు. వీటింన్నింటిపై త్వరలోనే విచారణ జరుపుతామని, ఆయన దర్యాప్తునకు హాజరుకావాల్సి ఉంటుందని సిట్ అధికారులు స్పష్టంచేశారు. రిటైర్డ్ డీజీపీతో గేమ్ తన వద్ద పనిచేసి సస్పెండ్ అయిన వారు విచారణలో తన పేరు చెప్పకుండా ఉండేందుకు సదరు మాజీ ఐపీఎస్ అధికారి పథకం రచించారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దించాడని పోలీస్ అధికారులు తెలిపారు. తన పేరు బయటపడకుండా ఉండాలంటే సస్పెండ్ అయిన వారిని కాపాడాలని భావించారు. అందుకే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే రిటైర్డ్ డీజీపీని సీఎంవో కార్యాలయానికి పంపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అది సాధ్యపడకపోవడంతో నగరం విడిచి ఢిల్లీ వెళ్లినట్టు తెలిసిందన్నారు. రాజకీయాల్లో కలసి రాని అదృష్టం.. అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులన్నింటికి తన తోడల్లుడిని బినామీగా పెట్టుకొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లోకి కూడా దిగారు. అయితే రాజకీయాల్లో అదృష్టం కలిసి రాకపోవడంతో ఏపీలో బిజినెస్‌లు ప్రారంభించారు. పేరుకు తెలంగాణ అని చెప్పుకునే ఈయన పక్క రాష్ట్రంలో కోట్లు పెట్టుబడి పెట్టి ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. -
విమానంలో దాక్కొని చైనా నుంచి దుబాయ్‌కు..
దుబాయ్: చైనాకు చెందిన ఓ యువకుడు ఎమిరేట్స్ కార్గో విమానంలో దాక్కున్నాడు. దీంతో అతడు దాదాపు తొమ్మిదిగంటలపాటు అందులోని ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో విమానం షాంఘై నుంచి దుబాయ్‌కు చేరుకుంది. ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం చైనాకు చెందిన స్టోవావే అనే పదహారేళ్ల బాలుడు కార్గో విమానంలో దాగి ఉన్నట్లు విమానం దుబాయ్ చేరుకున్నాక తెలిసింది. దుబాయ్‌లో జీవితం చాలా బాగా ఉంటుందని తాను కొంతమంది ద్వారా విన్నానని, డబ్బు సంపాదించడానికి దుబాయ్ చాలా అనుకూల నగరం అని తెలిసిందని, అందుకే తాను దుబాయ్ రావాలని నిర్ణయించుకున్నట్లు ఆ బాలుడు తెలిపాడు. కార్గో విమానంలోని బ్యాగ్స్ సెక్షన్లో తనకు హాయిగా ఉందని అందుకే అందులోనే దాక్కున్నట్టు చెప్పాడు. ఈ బాలుడికి దుబాయ్ భాష రాకపోవడంతో చైనాకు చెందిన ఓ ట్రాన్స్ లేటర్ ద్వారా అతడు చెప్పే దానిని అర్థం చేసుకున్నారు. అతడు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలుడు వాయవ్య నైరుతి చైనాలోని బెజాంగ్ అనే ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. దుబాయ్‌లో అడుక్కునే వారు సైతం కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించవచ్చనని ఆన్ లైన్ ద్వారా తెలుసుకున్నానని చెప్పాడు. అయితే, అసలు విమానంలోకి ఎలా వచ్చాడనే విషయం మాత్రం గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఆ బాలుడు గల్ఫ్ ఎమిరేట్స్ అధికారుల అదుపులో ఉన్నాడు. -
'హైడ్ అండ్ సీక్' తో పిల్ల టెర్రరిస్టుల దాష్టీకం!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఓ పురాతన కోట లోపల బంధించిన ఖైదీలను పిల్ల టెర్రరిస్టులు పట్టుకునే హైడ్ అండ్ సీక్ ఆటలా కనిపిస్తున్నా... నిజంగానే వారిని పట్టి బలవంతంగా చంపే వికృత చర్యలతో వీడియోను చిత్రించారు. సిరియాలోని మారుమూల డేయిర్ ఆజోర్ ప్రావిన్స్ ప్రాంతంలో దాచిన ఖైదీలను వెతుకుతూ చారిత్రక కట్టడాల మధ్య వాళ్లు శోధిస్తున్న దృశ్యాలను వీడియోలో పొందుపరిచారు. చేతులు రెండూ వెనక్కు విరిచి కట్టిన బందీలను..కనిపిస్తే కాల్చి చంపేందుకు సిద్ధంగా... ఆ పిల్ల పిశాచులు ఓ తుపాకీతో వేచి చూస్తుండటం ఆ పురాతన కట్టడాల మధ్య వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి భయంకర దాడుల్లో పాల్గొన్న వారు చాలావరకూ ఉత్తర ఆఫ్రికా, తజకిస్తాన్ నుంచి వచ్చినవారిలా ఉన్నారు. ఒకరి వెంట ఒకరు చారిత్రక అల్ రభా కోట ప్రవేశ ద్వారంనుంచి వారి శిక్షకుడిని కలుసుకుని, వారు చెప్పినట్లు కోట లోపల దాచిన ఖైదీలను అన్వేషించి మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పిల్ల టెర్రరిస్టులకు కావలసిన తుపాలకులను అప్పగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బందీలను లోపలి చీకట్లో కనుగొనేందుకు చిన్నదీపం వెలిగించి ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వారిని వెతికి...పని పూర్తి చేసి తిరిగి తమ ట్రైనర్ వద్దకు వచ్చి, అనంతరం ఆ తుపాకులను మరో బాల టెర్రరిస్టుకు ఇస్తే అతడు తిరిగి ఆట(వేట) ప్రారంభిస్తాడు. ఇలా ఖైదీలను వేర్వేరు ప్రాంతాల్లో తప్పించుకొనేందుకు వీలు లేనట్లుగా బంధించారు. చివరికి ఓ ఖైదీని నరికి చంపిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం వందలాదిమంది పిల్లలకు ఇస్లామిక్ స్టేట్ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసి టర్కీ పోలీసులు అరెస్టు చేసిన వార్తలు గతంలో సంచలనం రేపాయి. తాజాగా బందీలను చంపేందుకు బాల టెర్రరిస్టులతో 'హైడ్ అండ్ సీక్' గేమ్ ఆడిస్తున్న వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది.