Liquor Sales
-
APలో ఏరులై పారిన మద్యం.. 3 రోజుల్లో రూ.400 కోట్లు
-
జనం చచ్చినా.. చంద్రబాబుది అదే ట్రెండ్ !
-
కిక్కుతో వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,523 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, చివరి ఆరు రోజుల్లోనే రూ.1,220 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు 40 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే (డిసెంబర్ 30) రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ రూ. 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.117 కోట్ల విలువైన మద్యం అమ్ముకాలు జరగ్గా.. సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివారం (డిసెంబర్ 29) కూడా మద్యం డిపోలు తెరచే ఉంచారు. బ్యాంకులు లేకపోయినా వైన్‌షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో రూ.50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక, గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్‌లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం. 2023, డిసెంబర్ నెలలో రూ.4,147.18 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా, ఈ డిసెంబర్లో రూ.3,523 కోట్లకే పరిమితమైంది. -
విచ్చలవిడి బెల్టు షాపులు.. ఏపీలో ఏరులై పారుతున్న మద్యం
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా ప్రభుత్వం భారీగా తాగించడంతో.. అక్టోబర్ 16 నుంచి నిన్నటి వరకు 6312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 26,78, 547 కేసుల బీర్లు, 83,74, 116 కేసులు మద్యం అమ్మకాలు సాగాయి. న్యూ ఇయర్‌కి రూ. 1000 కోట్లు మద్యం వ్యాపారులు టార్గెట్ పెట్టుకోవడంతో గత ఏడాది డిసెంబర్ కంటే భారీగామద్యం అమ్మకాలు పెరిగాయి.విచ్చలవిడి బెల్టు షాపులతో మందుబాబులు భారీగా మద్యం తాగేస్తున్నారు. 2023 డిసెంబర్లో 25,83,530 కేసుల మద్యం.. 6,4,370 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసుల లిక్కర్.. 9,11,815 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్లో 4,62,832 కేసుల లిక్కర్.. 2,87,438 కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి. 18 శాతం లిక్కర్, 40 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: చిత్తూరులో ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్‌పై దాడిదుకాణాలతో పాటు వాటి వద్ద అనధికార పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు పెరగడంతో మద్యం వినియోగం అధికమైంది. దీనికి తగ్గట్టుగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి ఉంటాయని వ్యాపారులు నమ్మకంతో ఉన్నారు. ఇందుకు తగినట్టుగానే డిపోలకు అక్కడ నుంచి మద్యం దుకాణాలకు మద్యం రావాణా జోరుగా సాగుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మద్యం డిపోకు పెద్ద ఎత్తున మద్యం లోడులు చేరుకున్నాయి.ఇక్కడ బైపాస్ రోడ్డులోని మద్యం డిపో వద్దకు ఒకేసారి 15 నుంచి 20 వరకు మద్యం లారీలు రావడం, వెంటనే దుకాణాలకు తరలించేందుకు చిన్న చిన్న వ్యాన్లు రోడ్డు మీదనే ఉంచడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందంటే, నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది. -
31న రాత్రి 12 గంటల దాకా వైన్‌షాపులు ఖుల్లా
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం విక్రయ వేళలను పొడిగించారు. 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరుపుకొనేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మవచ్చు. అదే విధంగా అన్ని వైన్‌షాపులను ఆ రోజు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు. -
బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం
-
దసరాకు రూ.312 కోట్లపైనే మద్యం విక్రయాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి 10వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో (పది రోజుల్లో) అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడం, మూసీ ముంపు బాధితుల్లో దసరా సంబురాలు తగ్గాయి. హైడ్రా కూలి్చవేతలతో మెజారిటీ అపార్ట్మెంట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల అమ్మకాలు నిలిచిపోయాయి. రిజి్రస్టేషన్లు కాకపోవడం, మార్కెట్లో పెద్దగా ఆర్థిక లావాదేవీలు లేకపోవడం, నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడం తదితర కారణాలతోనూ మద్యం అమ్మకాల తగ్గుదలకు మరో కారణమని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 674 మద్యం దుకాణాలు ఉండగా, గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.317.23 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం రూ.312.05 కోట్లే సమకూరింది. గతంతో పోలిస్తే.. ఎక్సైజ్ ఆదాయం పెరగక పోగా.. రూ.5.18 కోట్ల మేర ఆదాయం తగ్గడం గమనార్హం. కాగా.. గతంతో పోలిస్తే.. మద్యం ప్రియుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏళ్లుగా మద్యం అలవాటు ఉన్న వాళ్లను అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో మెజారిటీ మద్యం ప్రియులు లిక్కర్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిసిందే. -
ధూంధాం... దసరా.. ఐదు రోజుల్లో 25 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు. అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్‌షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. -
ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు
సాక్షి, విజయవాడ: ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను(సెబ్) ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.సెబ్ విభాగానికి కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సెబ్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని, ఫర్నిచర్, వాహనాలను, సీజ్ చేసిన వస్తువులను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని పేర్కొంది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.అయితే త్వరలో మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెబ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం గత ప్రభుత్వం ఈ సెబ్‌ను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా సెబ్ పని చేసింది. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం ఉద్యోగులను.. సిబ్బందిని సెబ్‌కు కేటాయించింది. బెల్టు షాపులు, గంజాయి నియంత్రణ కోసం సెబ్ పనిచేసింది. -
రమణా.. లోడ్ ఎత్తరా
ఇదేం ఖర్మరా బాబు.. ఎక్సైజోళ్ల బాధ పడలేకుంది. టార్గెట్.. టార్గెట్ అంటూ నిత్యం సంపుతున్నారు. మద్యం అమ్మితే నాలుగు డబ్బులు మిగిలేది మాకే కదా.. ఎంత అమ్మితే అంత వస్తుంది.. కానీ ఇప్పుడు వాళ్లకు సంపాదించి పెట్టాలట.. ఒక్కో షాప్‌నకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా మద్యం కొని అమ్మాలట. మాకేమైనా అదనంగా వస్తుందా అంటే అది లేదు. రూ.లక్ష మందు సమాను కొంటే రూ.15 వేలు పోతున్నాయి. ఏంటో మరి..! ..ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ వైన్స్ యజమాని ఆవేదన. అతను ఒక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణదారులందరి పరిస్థితి ఇదే.సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్, కరీంనగర్: ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభంలోనే ఎక్సైజ్ అధికారులకు కష్టాలు వచి్చపడ్డాయి. ఈ ఏడాది జూలై మాసంలో మద్యం అమ్మకాల లక్ష్యాన్ని చేరేందుకు నెల చివరి రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు నానాతంటాలు పడ్డారు. ఈ నెల టార్గెట్ పూర్తి కాలేదని, పైఅధికారులు టార్గెట్ పెట్టారని, వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని వైన్‌షాప్‌ల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వాస్తవానికి, గత మూడు నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రూ.3వేల కోట్లు మించి జరుగుతున్నాయి.జూన్ నెలలో రూ.3,175 కోట్లు దాటింది. కానీ, జూలై నెలలో ఈ అమ్మకాలు రూ.3వేల కోట్లలోపు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానికంగా ఉండే ఎక్సైజ్ అధికారులు రిటైలర్లపై ఒత్తిడి పెంచారు. గోదాముల్లో సరుకు రెడీగా ఉందని, ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని, ఎంతోకొంత సరుకు తీసుకెళ్లాలంటూ వైన్‌షాప్ యజమానులకు ఫోన్లు చేసినట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో చేసేదేమీ లేని పరిస్థితుల్లో వైన్‌షాపుల యజమానులు అందుబాటులో ఉన్న నగదును బట్టి డీడీలు చెల్లించి గోదాముల నుంచి స్టాక్ తీసుకెళ్లారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ ప్రతిసారీ ఈ టార్గెట్లు ఉంటాయని, ఇప్పుడు ప్రభుత్వానికి నిధులు కూడా అవసరమైనందున ఉన్నతాధికారుల సూచన మేరకు సరుకు తీసుకెళ్లాలని వైన్‌షాపులను కోరామే తప్ప ఒత్తిడి తేలేదని, వీలునుబట్టి వైన్‌షాపుల నిర్వాహకులు సరుకు తీసుకెళ్లారే తప్ప...గొంతు మీద కత్తి పెట్టలేదని చెప్పడం గమనార్హం. తలపట్టుకుంటున్న వైన్స్ యజమానులు.. జనాభా ప్రాతిపదికన స్లాబ్‌ల ప్రకారం టెండర్ దక్కించుకున్నామని.. నిరీ్ణత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15 శాతం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో రూ.50 లక్షల స్లాబ్‌తో టెండర్ దక్కించుకున్న వ్యాపారికి పది పర్యాయాల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసిన మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకు మించి కొనుగోలు చేస్తే రూ.లక్షకు దాదాపు 15 శాతం అంటే రూ.15 వేలు అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం భారంగా మారిందని.. మిత్తీలకే సరిపోని పరిస్థితి ఉందని మద్యం దుకాణాల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా... ఉమ్మడి కరీంనగర్ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. తాజాగా ఎక్సైజ్ అధికారులు నాలుగు జిల్లాల్లోని వైన్‌షాపులకు ఒక్కసారిగా సేల్స్ పెంచాలని టార్గెట్ విధించారు. ⇒ కరీంనగర్‌తో సహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రతీ వైన్‌షాపునకు రూ.30 లక్షల టార్గెట్ విధించారు. ‘‘మీరు అమ్ముకోండి.. లేదా స్టాక్ మీతోపాటే ఉంచుకోండి.. అవేమీ మాకు చెప్పొద్దు. కానీ, తప్పకుండా ప్రతీషాప్ రూ.30 లక్షల స్టాక్ కొనుగోలు చేయాల్సిందేనని’షరతు పెట్టారు. దీంతో గత్యంతరం లేక కేసులు పెడతారేమోననే భయంతో రూ.30లక్షల స్టాక్ కొనేందుకు సిద్ధమవుతున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో రూ.30 లక్షల సరుకు తాము కొనలేమని మెజారిటీ వైన్‌షాపుల నిర్వాహకులు చేతులు ఎత్తేయడంతో కనీసం గత ఏడాది విక్రయాలను చేరుకోవాలని మినహాయింపు ఇచ్చారు. ⇒ జగిత్యాల జిల్లాలోనూ వ్యాపారులు తాము రూ.30 లక్షలు చేయలేమని అనడంతో గతేడాది విక్రయాలతో 5–10 శాతం అదనంగా విక్రయించాలని టార్గెట్ పెట్టడంతో అంతా ఓకే అన్నారని సమాచారం. ⇒ పెద్దపల్లి జిల్లాలో రూ.30 లక్షలు స్టాకు కొనలేమని వ్యాపారులు చెప్పడంతో చివరికి గతేడాది విక్రయాల మీద 30 శాతం అదనంగా విక్రయించాల్సిందేని షరతు పెట్టడంతో వ్యాపారులు సమ్మతించారని తెలిసింది. ⇒ దీంతో ప్రతీ వైన్‌షాపు నిర్వాహకుడు రూ.లక్షలాదిగా దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ టార్గెట్ రీచ్ అయ్యేందుకు నానాతంటాలు పడుతున్నారు. -
‘మత్తు’ మాటలవి!
ఉక్కుపాదం మోపడం ద్వారా మద్యపానాన్ని నియంత్రిస్తూ, మద్యం అమ్మకాల పరిమాణాన్ని తగ్గించాం. ఇదే సమయంలో ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచితే అదెలా కుంభకోణం అవుతుంది? కనీస పరిజ్ఞానం లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బాగా మందు తాగిన వ్యక్తి కూడా చంద్రబాబులా అబద్ధాలు చెప్పరని అర్థమవుతోంది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడే 14 డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మేం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ డిస్టిలరీల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అయితే మా హయాంలో విషం అయిన మద్యం.. చంద్రబాబు హయాంలో అమృతం అవుతుందా?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్వేతపత్రం పేరుతో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. 2014–19 మధ్య లిక్కర్ అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఈ లెక్కన 2018–19 నాటికి 3.84 కోట్ల కేసుల మద్యం విక్రయించారని చెప్పారు. దీన్ని బట్టి పరిశీలిస్తే 2023–24 నాటికి లిక్కర్ విక్రయాలు గణనీయంగా పెరగాల్సి ఉండగా 3.2 కోట్ల కేసుల లిక్కర్ అమ్మకాలు తగ్గాయన్నారు. 2018–19లో 2.77 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోతే, తమ ప్రభుత్వంలో 2023–24లో 1.12 కోట్ల కేసులు మాత్రమే విక్రయించామని చెప్పారు. దీన్ని బట్టి కమీషన్లు, లంచాల కోసం అధిక పరిమాణంలో మద్యం విక్రయాలను ఎవరు పెంచారో ప్రజలు గమనించాలని విజ్ఙప్తి చేశారు. మద్య నియంత్రణ చర్యల్లో భాగంగా షాక్ కొట్టేలా ధరలను పెంచడంతో విక్రయాలు తగ్గినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. నాణ్యత లేని మద్యం సరఫరా చేసి, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీశామని తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చలామణిలో ఉన్న బ్రాండ్లన్నింటికీ 2014–19 మధ్య బాబు పాలనలోనే అనుమతులిచ్చారని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ వంటి దాదాపు 15 బ్రాండ్ల విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 అక్టోబర్ 26న చంద్రబాబు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చారు. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ విస్కీకి 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ల బీర్లు సైతం చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే. వాటన్నింటికీ 2017 జూన్ 7న అనుమతి జారీ చేశారు. రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా 2018 నవంబరు 9న, బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు కూడా అపద్ధర్మ సీఎంగా చంద్రబాబు 2019 మే 14న అనుమతి ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి ఆ మర్నాడే 2019 మే 15న టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా క్లియరెన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డిస్టిలరీలు తయారు చేసిన మద్యమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయ్యింది. ఈ లెక్కన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముంది? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా? 2014–19 మధ్య టీడీపీ హయాంలో బడి, గుడి అన్న తేడా లేకుండా మద్యం సిండికేట్లు.. పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాలతో మద్యం 24 గంటలూ ఏరులై పారించారు. 4,380 మద్యం దుకాణాలకు అనుమతించి, 43 వేలకు పైగా బెల్ట్‌షాపుల్లో అమ్మకాలు చేపట్టారు. వాటిలో మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే 25 శాతం అధిక ధరకు విక్రయించారు. మాకు, వాళ్లకు మధ్య ఇదీ తేడా..» దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. » టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా, వాటిని 2,934కు తగ్గించాం.» 2019కి ముందు ప్రతి వైన్ షాప్‌కు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్‌లు రద్దు చేశాం. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43 వేల బెల్ట్‌షాప్‌లకు స్వస్తి పలికాం. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. » ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి.. 2019 అక్టోబరు 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాం.» మద్యం విక్రయ వేళలు కుదించాం. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలు అనుమతించాం.» ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు షాక్ కొట్టేలా ధరలు పెంచాం.» అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు చేశాం.» తద్వారా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వంలో మద్యం విక్రయాలు దాదాపు సగానికి తగ్గాయి. » మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది మా ప్రభుత్వమే. అయినా మాపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు.నాణ్యతలేని ఆరోపణలు నాణ్యత లేని మద్యం సరఫరాతో, వినియోగదార్ల ఆరోగ్యం దెబ్బతిందంటూ నాణ్యత లేని ఆరోపణలు, దుష్ప్రచారం చేశారు. నాటి మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అలాంటి రిపోర్ట్ మేం ఇవ్వలేదని ఆ సంస్థనే చెప్పింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ల్యాబ్‌లో పరీక్షించాం. ఆ శాంపిల్స్ అన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఐఐసీటీ కూడా నివేదిక ఇచ్చింది. -
11న సాయంత్రం 5 నుంచి మద్యం బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు.. అంటే ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించిన నేపథ్యంలో ఆ మేరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని సైతం పొడిగించాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో.. ఆ రోజు సైతం మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రైడే అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఢిల్లీ లిక్కర్ విధానం కేసు ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది. -
కొత్త ఏడాదికి లిక్కర్‌తో కిక్కిచ్చిన మందుబాబులు..!
కొత్త ఏడాదికి లిక్కర్‌తో కిక్కిచ్చిన మందుబాబులు..! -
మద్యం విక్రయాలపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): మద్యం విక్రయాల్లో చెల్లింపులు సక్రమంగా లేవంటూ ఒక చోట ప్రచారం.. మద్యం అమ్మకాల వల్లే ప్రజల ఆరోగ్యం చెడిపోతోందంటూ మరోచోట విమర్శలు.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఆమె విమర్శల తీరు ఉందని ఆపార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నరసాపురంలో ఓ ప్రభుత్వం మద్యం దుకాణానికి వెళ్లి పురందేశ్వరి హడావుడి చేశారు. అక్కడ ఆమె చేసిన దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గట్టిగా తిప్పికొట్టింది. నరసాపురం మద్యం దుకాణంలో రూ. లక్ష మద్యం అమ్మకాలు జరిగినా కౌంటర్లో కేవలం రూ. 700 బిల్లు మాత్రమే చూపిస్తున్నారని ఆమె అసత్య ఆరోపణలు చేశారు. అయితే ఆ మద్యం దుకాణంలో గురువారం రూ. 2,60,330 విలువైన మద్యాన్ని విక్రయించి ఆమేరకు ఖజానాకు జమ చేసినట్టు బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పురందేశ్వరి నరసాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని ఆ రోజు ఎంత విలువైన మద్యాన్ని విక్రయించారని ప్రశ్నించారు.అందుకు ఆ సిబ్బంది రూ. లక్షకు పైగా మద్యాన్ని విక్రయించినట్టు తెలిపారు. ఆ దుకాణంలో అప్పటికి డిజిటల్ చెల్లింపులు రూ. 700 మేరకు జరిగాయి. అదే విషయాన్ని సిబ్బంది చెప్పారు. ఆ విషయాన్ని పురందేశ్వరి వక్రీకరిస్తూ రూ. లక్షకుపైగా మద్యం అమ్మినప్పటికీ కేవలం రూ. 700 మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారని నిరాధార ఆరోపణలు చేశారు. ఆ మద్యం దుకాణంలో నగదు, డిజిటల్ చెల్లింపులు కలిపి గురువారం మొత్తం రూ. 2,60,330 విలువైన మద్యం విక్రయానికి సంబంధించి శనివారం చలానా తీయడం ద్వారా రాష్ట్ర బెవరేజస్న్ కార్పొరేషన్ ఆ మొత్తాన్ని ఖజానాలో జమ చేసింది. ఆ చలానా కాపీని కూడా మీడియాకు విడుదల చేసింది. దాంతో పురందేశ్వరి ఆరోపణలు కేవలం దు్రష్పచారమన్నది స్పష్టమైంది. కేజీహెచ్‌లో అబద్ధాలు ఇలా.. శనివారం విశాఖలో పర్యటించిన పురందేశ్వరి.. కేజీహెచ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డును సందర్శించి లివర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగడం వల్ల లివర్ పాడైపోయిందా అంటూ వారిని ఆమె ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న రోగులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. మద్యం తాగడం వల్ల 39 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. 52 మంది వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, పురందేశ్వరి వ్యాఖ్యల్లో వాస్తవ పరిస్థితుల్ని వైద్యుల సమక్షంలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు ఆమె మీడియాతో అబద్ధాలు మాట్లాడినట్లు స్పష్టమైంది. వార్డులో మొత్తం 52 పడకలున్నాయి. 36 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కానీ.. పురందేశ్వరి మాత్రం 52 మంది ఉన్నారని 39 మంది పరిస్థితి విషమంగా ఉందని అబద్ధం చెప్పారు. వార్డులో కేవలం 30 మంది మాత్రమే లివర్ సమస్యతో బాధపడుతున్నారని.. ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇందులో కొంతమంది ఆరోగ్యం కుదుట పడగా.. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. దీన్ని కూడా పురందేశ్వరి దవక్రీకరించి మీడియా ముందు తప్పుడు ప్రచారం చేశారు. ఉన్న రోగుల్లో చాలా మంది ఆహార నియమాలు పాటించకపోవడం, మసాలా, జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల అడ్మిట్ అయ్యారనీ.. ఐదుగురు మాత్రమే మద్యం బాధితులు ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. బీజేపీని నిందించడం సరికాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్రంలోని బీజేపీని నిందించడం సరికాదని, ఆయన అరెస్టుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసు రాష్ట్ర పరిధిలోని సీఐడీ విచారిస్తోందన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు వ్యవహారంపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మద్యం విక్రయాల్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఈ దోపిడీపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. -
గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో గుడుంబా సీసాలు పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏటా రూ.10,700 కోట్లున్న మద్యం ఆదాయం.. ఇప్పుడు రూ.45 వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌తో భేటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చిత్తరంజన్‌దాస్‌తో కల్వకుర్తిలోని ఆయన నివాసంలో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్‌ను ఈటల బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక ర్తలు, అనుచరులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చిత్తరంజన్‌దాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదీ చదవండి: నెలాఖరుకు బీజేపీ తొలి జాబితా? -
వైన్ నిల్వలు వదిలించుకొనేందుకు రూ. 1,700 కోట్లు
పారిస్: ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడడానికి ఎవరైనా మద్యం అమ్మకాలు పెంచుతారు. కానీ ఫ్రాన్స్ మద్యానికి డిమాండ్ లేకపోవడంతో ఆ నిల్వలను వదిలించుకోవడానికి దాదాపు రూ.1,700 కోట్లు (20 కోట్ల యూరోలు) ఖర్చు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ సంక్షోభం, ఆ వెంటనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు వైన్ వంటి వాటికి ఖర్చు చెయ్యడం బాగా తగ్గించేశారు. తక్కువ ధరకు లభించే బీర్‌కు అలవాటు పడిపోయారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లో ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కబోత భరించలేని ప్రజలు వైన్ బదులుగా బీర్ ఎక్కువగా తాగుతున్నారు. చాలా మంది ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్(1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) మద్యం తాగడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా వైన్‌కి డిమాండ్ పడిపోయింది. మరోవైపు వైన్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బోర్డాక్స్ ప్రాంతంలో వైన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆ వైన్‌ను కొనుగోలు చేసేందుకు 20 కోట్ల యూరోలు కేటాయించింది. అదనంగా ఉన్న వైన్‌ను కొనుగోలు చేసి దానిలోని ఆల్కాహాల్‌ను శానిటైజర్లు, శుభ్రతా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటి తయారీలో వినియోగించనుంది. ఇలా చేయడం ద్వారా మళ్లీ వైన్‌కు డిమాండ్ పెరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. వైన్ వినియోగం యూరప్ దేశాలైన ఇటలీలో ఏడు శాతం, స్పెయిన్‌లో 10 శాతం, ఫ్రాన్స్‌లో 15 శాతం, జర్మనీలో 22 శాతం, పోర్చుగల్‌లో 34 శాతం మేర తగ్గిపోయింది. -
దుబాయ్‌లో మద్యంపై పన్ను రద్దు
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఇది ఆదివారం నుంచే అమల్లో వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు. దుబాయ్‌లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్ ఉండాల్సిందే. దుబాయ్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మద్యం విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తోంది. అయితే, పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
HYD: నయా సాల్ ధమాకా.. చుక్క-ముక్క దుమ్మురేపాయి
ఢిల్లీ/హైదరాబాద్: నయా సాల్కి రోడ్లపై హడావిడి తక్కువగా కనిపించింది. వేడుకలపై పోలీస్ ఆంక్షలు అందుకు ఒక కారణం. అయితే.. ముక్క, మందుతో గప్‌చుప్ మజాలో రాష్ట్ర ప్రజలు ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది కంటే అదనంగా ఆల్కాహాల్ బిజినెస్ జరగడం గమనార్హం. కోవిడ్ ఆంక్షలు ఏమాత్రం లేకపోవడం, అమ్మకాలకు అదనపు సమయం ఇవ్వడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాళ్లలో ఎక్కువమందిలో.. బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 500 ఎంజీ మించి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్ బాటిళ్లు.. ఈ లెక్క నగరంలోని మద్యం బాబులు జనవరి 1 పార్టీ పేరుతో తాగేసింది. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 31వ తేదీన మద్యం డిపోల నుంచి రూ.215.74 కోట్ల విలువైన మద్యం సరఫరా అయ్యింది. చివరి వారం మొత్తంగా రూ.1,111.29 కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయి.మద్యం దుకాణాలకు.. రెండు లక్షలకు పైగా కేసుల లిక్కర్, లక్షా 30 వేల దాకా బీర్ల కేసులు వెళ్లాయి. గతేడాది అదే తేదీన రూ.171.93 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. అంటే.. రూ.43 కోట్లు అదనంగా ఆల్కాహాల్ సేల్ జరిగిందన్నమాట. అలాగే.. గతేడాది చివరి వారంలో రూ.925 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే.. రూ.185 కోట్లు అదనంగా అన్నమాట. ఇక.. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో నమోదయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76,038 కేసుల లిక్కర్, 33,985 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యధికంగా 40,655 లిక్కర్ కేసులు, 21,122 కేసుల బీర్లతో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి. మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో.. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.43.21 కోట్ల ఆదాయం వచ్చింది. దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బిర్యానీ హవా కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశంలో అత్యధికంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీ హవా స్పష్టంగా కనిపించింది. శనివారం రాత్రి పదిన్నర గంటల దాకా.. ఏకంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గీ ప్రకటించుకుంది. అదే సమయంలో.. 75.4 శాతం హైదరాబాదీ బిర్యానీకే ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించుకుంది. లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌లోని ఓ పాపులర్ రెస్టారెంట్ ఏకంగా.. 15వేల కేజీల బిర్యానీని సర్వ్ చేయడం గమనార్హం. -
TS: 6 రోజులు.. రూ. 1,111 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలు ‘కొత్త’పుంతలు తొక్కాయి. లిక్కర్ షాప్‌లకు కొత్త జోష్ వచ్చింది. లెక్కకు మించిన కిక్కు వచ్చింది. చలి తీవ్రతతోపాటు కొత్త సంవత్సరం వస్తోందన్న ఉత్సాహంతో మందుబాబులు తెగ తాగేశారు. సంవత్సరం చివర్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2022 డిసెంబర్ చివరివారం రూ. 1,111.29 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోవడం గమనార్హం. చివరి ఆరురోజుల మద్యం అమ్మకాలు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. ఒక్క డిసెంబర్ 30న రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి రూ.250 కోట్లకుపైగా విలువైన మందు వైన్‌షాపులకు తరలివెళ్లిందంటే కొత్త ఏడాది ఆరంభాన్ని మందుబాబులు ఎలా పండుగ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరి నాలుగు రోజుల అమ్మకాల విషయానికి వస్తే 2021 డిసెంబర్లో చివరి నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఈసారి అది రూ.775 కోట్లు దాటింది. డిసెంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటే 2021లో రూ.2,901 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, 2022 డిసెంబర్లో ఆ విలువ రూ.3,376 కోట్లు దాటింది. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.500 కోట్లు పెరిగిందన్నమాట. 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్ కేసులు, 2.45 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.18,868 కోట్లపైచిలుకు కాగా, 2022లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రూ.34,352.75 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 3.5 కోట్ల లిక్కర్, 4.5 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2020తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2020లో రూ.16,254 కోట్లు అమ్ముడుపోయింది. -
Telangana: న్యూ ఇయర్ వేడుకలు.. మందుబాబులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి పూర్తిస్థాయిలో జరగనున్నాయి. న్యూ ఇయర్‌ను వెల్కం చెప్పేందుకు యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలుకుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తాజాగా న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు రాత్రి ఒంటిగంట వరకు.. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. మరోవైపు న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి పాస్‌లు, టికెట్లు జారీ చేయొద్దని పేర్కొన్నారు.. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తెలిపారు. చదవండి: తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే.. -
మందుబాబుల దసరా ‘ధమాకా’
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని మద్యం ఏడురోజులు ఏరులైంది. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో మద్యం విక్రయాలు రూ.1,100 కోట్లు దాటాయి. అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 5(దసరా)న రెండురోజులు రాష్ట్రంలోని మద్యం డిపోలకు సెలవులుండగా, గత ఏడు పనిదినాల్లో కలిపి ఈ మేరకు మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సెప్టెంబర్ 30న రికార్డుస్థాయిలో రూ.313 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగాయి. అయితే, సెప్టెంబర్ నెలాఖరులో వైన్‌షాపుల యజమానులు లిక్కర్‌కు ఎక్కువ ఇండెంట్ పెట్టి బీర్లు తగ్గించారు. గత ఏడు పనిదినాల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది. వరంగల్ అర్బన్ (149.02 కోట్లు), నల్లగొండ (124.44 కోట్లు), కరీంనగర్ (111.44 కోట్లు), హైదరాబాద్ (108.24కోట్లు) జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయించారు. -
ఏరులై పారనున్న మద్యం.. కల్తీ చేసేందుకు వేల జీతాలతో ప్రత్యేక సిబ్బంది
సాక్షి, వరంగల్: ఏడాదికోసారి వచ్చే పండుగ దసరా. ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు మాంసంతోపాటు మద్యంపై ఎనలేని మక్కువ చూపుతారు. ఏ పండుగకూ లేని విధంగా దసరాకు మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా గోదాంలలో ఎక్కువగా నిల్వ చేయడంతోపాటు మద్యం దుకాణాలకు కోటాకు మించి సరఫరా చేస్తుంది. కొందరు మద్యం ప్రియులు కూడా పండుగ అవసరాల కోసం ముందస్తుగానే భారీగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే పండుగ సందర్భంగా మద్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్‌తోపాటు జిల్లాలోని కొన్ని వైన్స్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు కల్తీకి పాల్ప డుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేలకొద్దీ బాటిళ్ల మూతలు తీసి.. తక్కువ ధర ఉన్న మద్యం, నీళ్లు కలిపే తంతును కొనసాగిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా రూ.లక్షల్లో లాభాలు ఆర్జించే దిశగా కొందరు వైన్స్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా.. ఆబ్కారీ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. మందును కల్తీ చేసేందుకు అనుభవజ్ఞులైన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని.. ఏరోజుకారోజు పని పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వడంతోపాటు కొందరికి వచ్చే లాభాల్లో సగం వాటా ఇస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకొని పని కానిచ్చేస్తున్నారన్న టాక్ వస్తోంది. ఇటీవలి కాలంలో వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ వైన్స్‌లో కల్తీ జరుగుతుందంటూ ఎక్సైజ్ అధికారులు ఆ షాపును సీజ్ చేశారు. ఏడాదిలో తూతూమంత్రంగా ఏదో చేయాలన్నట్లుగా ఓ వైన్స్‌ను సీజ్ చేసిన అధికారులు నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌లోని అనేకచోట్ల కల్తీ జరుగుతున్నా పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారంతా ‘మామూలు’గా చూసుకుంటుండడంతోనే అలా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్‌లు కూడా సమయపాలన లేకుండా నడుపుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి. అంతేకాక మద్యం కల్తీ కావడం వల్ల ఎంత తీసుకున్నా కిక్కు ఎక్కడం లేదని కొందరు మద్యంబాబులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మూతలు తీసేటోళ్లకు పండుగే.. దసరా పండుగ వేళ మద్యం కిక్కు ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కొన్ని వైన్స్‌లు సీల్‌కు ఇబ్బంది లేకుండా మూత తీసి కల్తీ చేసే గ్యాంగ్‌లను నియమించుకున్నాయి. ఈ దందా అంతా రాత్రివేళల్లో జరిగే అవకాశం ఉండటంతో ఒక్కో రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారనే టాక్ వస్తోంది. గ్రేటర్ వరంగల్‌తోపాటు జిల్లాలో చాలాచోట్ల ఇలాంటి గ్యాంగ్‌లు ఉన్నాయి. బ్లండర్ స్పైడ్లో ఓసీ, రాయల్ స్టాగ్‌లో ఐబీలతోపాటు ఐబీ, ఓసీల్లో నీటిని కలిపి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నాయి. రాయల్ స్టాగ్ విస్కీ బాటిళ్ల సీల్ పగలకుండా చాకచక్యంగా మూత తెరిచి దాదాపు సగం మద్యాన్ని ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్లో పోస్తున్నారు. మరో బాటిల్లోని నీళ్లతో నింపి.. ఆపై విస్కీలో కలిపి బ్రాండెడ్ బాక్స్‌లో పెడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గతంలోనూ ఈ తరహా వారిని హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసినా.. ఇక్కడ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్‌లోని కొత్తవాడ, హంటర్ రోడ్డు ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. ‘పెద్ద బ్రాండ్‌లోకి చిన్న బ్రాండ్ల మందును కలపొచ్చు. చిన్న బ్రాండ్‌ల్లోనూ నీళ్లు కలిపే అవకాశముంది. ఇలా లూజ్ సేల్ చేసే వైన్స్‌లపై నిఘా ఉంచాం. ఖానాపురంలో వైన్స్‌కు రూ.5,20,000 జరిమానా విధించాం. దసరా వేళ కల్తీకి అవకాశం ఉండడంతో మా సిబ్బంది క్షేత్రస్థాయిలో కన్నేసి ఉంచారు’ అని జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారి లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. -
Telangana: మద్యం అమ్మకాల రికార్డు.. ఏడాది రాబడి 9 నెలల్లోనే!
సాక్షి, హైదరాబాద్: మద్యం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి సమకూరుతోంది. మందుబాబులు తెగ తాగేసి ఖజానాకు కాసుల కళ తెస్తున్నారు. ఏడాది మొత్తం అమ్మకాల ద్వారా వస్తుందని భావించిన రాబడి కేవలం తొమ్మిది నెలల్లోనే ఖజానాకు చేరే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం రూ.17,500 కోట్లు రావచ్చని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించింది. సంవత్సరం మొత్తం రూ. 22,500 కోట్ల మేర అమ్మకాలు సాగితే అందులో 70శాతం.. అంటే రూ.17,500 కోట్ల ఆదాయం రావచ్చనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్క. కానీ, తొలి ఆరునెలల్లోనే రూ.17,324 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులో 70 శాతం అంటే... దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా ఆదాయం ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరిందన్నమాట. ఈ లెక్కనæ మరో రెండు నెలల్లోనే రూ.17,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటుందని అర్థమవుతోంది. 2021 నేషనల్ హెల్త్ సర్వే–5 ప్రకారం మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింల తర్వాత మూడోస్థానాన్ని తెలంగాణ దక్కించుకుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 29 శాతానికిపైగా మందుబాబులున్నారు. ఈ మందుబాబులు తెగ తాగేస్తుండటంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలు కూడా పెంచినందున అంచనాలకు మించి ఆదాయం వస్తుండటం గమనార్హం. నాలుగోవంతు రంగారెడ్డిలోనే.. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని బేవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ జిల్లాలో రూ. 3,970.82 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. రూ.వెయ్యి కోట్ల మార్కు దాటిన జిల్లాల్లో హైదరాబాద్ (రూ.1,828.10 కోట్లు), కరీంనగర్(1,469.93), ఖమ్మం(1,100.38), మహబూబ్‌నగర్ (1,233.53),మెదక్ (1,424.09), నల్లగొండ(1,774.46), వరంగల్ అర్బన్ (రూ.1,745.73 కోట్లు) ఉన్నాయి. రాష్ట్రంలోని ఈ ఎనిమిది జిల్లాల్లోనే రూ.14 వేల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరగ్గా, మిగిలిన అన్ని జిల్లాలు కలిపి రూ.3 వేల కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. కేసులవారీగా పరిశీలిస్తే గత ఆరునెలల్లో రాష్ట్రంలోని మందుబాబులు 1.7 కోట్ల లిక్కర్ కేసులు, 2.5 కోట్ల బీర్ కేసులు లాగించేశారని గణాంకాలు చెబుతున్నాయి. -
ఏపీ మద్యం విధానం సరైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైదని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన ‘కాంపిటిషన్ యాక్ట్ – 2002’కు అనుగుణంగానే ఉందని కూడా తేల్చి చెబుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీ మద్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని దేశంలో ప్రముఖ విదేశీ మద్యం తయారీ కంపెనీలు వ్యతిరేకించాయి. 8 పెద్ద కార్పొరేట్ మద్యం కంపెనీలు సభ్యులుగా ఉన్న ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడాన్ని ఆ సంఘం వ్యతిరేకించింది. మద్యం కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా బెవరేజస్ కార్పొరేషన్ నిర్వహించడం కాంపిటిషన్ యాక్ట్‌కు విరుద్ధమని వాదించింది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బెవరేజస్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా చెప్పుకొచ్చాయి. ఆ సంఘం ఆరోపణలను రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ సమర్థంగా తిప్పికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన కొత్త మద్యం విధానం పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయడంతో పాటు మద్యం దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విధానాన్ని కూడా వివరించింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో సహా వివరించింది. అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని, వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది. బెవరేజస్ కార్పొరేషన్ బకాయిలు పెడుతోందన్న కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది. ఇరు పక్షాల వాదనలను విన్న కాంపిటిషన్ కమిషన్ తన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది. బెవరేజస్ కార్పొరేషన్ చేసుకున్న మద్యం సరఫరా ఒప్పందాలు అన్నీ చట్టానికి లోబడే ఉన్నాయని చెప్పింది. బెవరేజస్ కార్పొరేషన్ మద్యం డిమాండ్‌ను కృత్రిమంగా సృష్టిస్తోందన్న అభియోగాలు నిరాధారమని వెల్లడించింది. ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ లేవనెత్తిన అభ్యంతరాలు హేతుబద్ధంగా లేవని చెప్పింది. అందువల్ల ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది.