
రాష్ట్రంలో నిలిచిపోనున్న మద్యం సరఫరా
మందుబాబులకు దుర్వార్త. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో మద్యం దొరికే అవకాశాల్లేవు.
మందుబాబులకు దుర్వార్త. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో మద్యం దొరికే అవకాశాల్లేవు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు మద్యం సరఫరా నిలిచిపోనుంది. దాంతో ఇప్పటివరకు ఉన్న స్టాకులను అమ్ముకున్న తర్వాత ఇక దుకాణాలు మూసుకోవాల్సిందే. ఎక్సైజ్ శాఖ ఆదాయపన్ను చెల్లించకపోవడంతో.. తాత్కాలికంగా మద్యం గోడౌన్లను ఐటీ శాఖ సీజ్ చేసింది.
2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం రూ. 1468 కోట్ల బకాయిలు చెల్లించాలని గతంలో నోటీసులు ఇచ్చారు. దానికి గడువు కూడా సోమవారంతో తీరిపోయింది. అయినా చెల్లించకపోవడంతో.. తెలంగాణలోని మొత్తం 17 ఎక్సైజ్ డిపోల్లో మద్యం అమ్మకాలను ఆపేసేందుకు ఐటీ శాఖ చర్యలు తీసుకుంటోంది. దీంతో తమ పరిస్థితి ఏంటని మద్యం దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు.