సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి 10వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో (పది రోజుల్లో) అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడం, మూసీ ముంపు బాధితుల్లో దసరా సంబురాలు తగ్గాయి. హైడ్రా కూలి్చవేతలతో మెజారిటీ అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల అమ్మకాలు నిలిచిపోయాయి.
రిజి్రస్టేషన్లు కాకపోవడం, మార్కెట్లో పెద్దగా ఆర్థిక లావాదేవీలు లేకపోవడం, నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడం తదితర కారణాలతోనూ మద్యం అమ్మకాల తగ్గుదలకు మరో కారణమని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 674 మద్యం దుకాణాలు ఉండగా, గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.317.23 కోట్ల ఆదాయం సమకూరింది.
ప్రస్తుతం రూ.312.05 కోట్లే సమకూరింది. గతంతో పోలిస్తే.. ఎక్సైజ్ ఆదాయం పెరగక పోగా.. రూ.5.18 కోట్ల మేర ఆదాయం తగ్గడం గమనార్హం. కాగా.. గతంతో పోలిస్తే.. మద్యం ప్రియుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏళ్లుగా మద్యం అలవాటు ఉన్న వాళ్లను అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో మెజారిటీ మద్యం ప్రియులు లిక్కర్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment