సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా ప్రభుత్వం భారీగా తాగించడంతో.. అక్టోబర్ 16 నుంచి నిన్నటి వరకు 6312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 26,78, 547 కేసుల బీర్లు, 83,74, 116 కేసులు మద్యం అమ్మకాలు సాగాయి. న్యూ ఇయర్‌కి రూ. 1000 కోట్లు మద్యం వ్యాపారులు టార్గెట్ పెట్టుకోవడంతో గత ఏడాది డిసెంబర్ కంటే భారీగామద్యం అమ్మకాలు పెరిగాయి.
విచ్చలవిడి బెల్టు షాపులతో మందుబాబులు భారీగా మద్యం తాగేస్తున్నారు. 2023 డిసెంబర్‌లో 25,83,530 కేసుల మద్యం.. 6,4,370 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో 30,46,362 కేసుల లిక్కర్.. 9,11,815 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌లో 4,62,832 కేసుల లిక్కర్.. 2,87,438 కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి. 18 శాతం లిక్కర్, 40 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి.
ఇదీ చదవండి: చిత్తూరులో ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్‌పై దాడి
దుకాణాలతో పాటు వాటి వద్ద అనధికార పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు పెరగడంతో మద్యం వినియోగం అధికమైంది. దీనికి తగ్గట్టుగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి ఉంటాయని వ్యాపారులు నమ్మకంతో ఉన్నారు. ఇందుకు తగినట్టుగానే డిపోలకు అక్కడ నుంచి మద్యం దుకాణాలకు మద్యం రావాణా జోరుగా సాగుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మద్యం డిపోకు పెద్ద ఎత్తున మద్యం లోడులు చేరుకున్నాయి.
ఇక్కడ బైపాస్ రోడ్డులోని మద్యం డిపో వద్దకు ఒకేసారి 15 నుంచి 20 వరకు మద్యం లారీలు రావడం, వెంటనే దుకాణాలకు తరలించేందుకు చిన్న చిన్న వ్యాన్లు రోడ్డు మీదనే ఉంచడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందంటే, నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment