సాక్షి,చిత్తూరు:మద్యం మత్తులో చిత్తూరులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించారు. తప్పతాగి నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. శివ,ప్రసన్నలు గంగవరం,పెద్దపంజాణి ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణకుమార్‌పై శివ,ప్రసన్నలు దాడి చేశారు. చిత్తూరులోని ఓ బార్లో శివ,ప్రసన్న,కృష్ణ కుమార్‌లు వేరువేరుగా మద్యం సేవించారు. శివ,ప్రసన్న,కృష్ణ కుమార్ల మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి.
మద్యం తాగేటపుడు మాటా మాటా పెరిగి కృష్ణ కుమార్‌పై శివ,ప్రసన్న దాడి చేశారు. ఈ దాడి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణకుమార్ డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం
Comments
Please login to add a commentAdd a comment