సాక్షి, చెన్నై : మద్యం దుకాణాలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మద్యాన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని ప్రభుత్వానికి సూచించింది. (ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలకు అనుమతి)
ఈ ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసిన తమిళ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం త్వరలోనే విచారించనుంది. కాగా ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు సుప్రీంకోర్టు ఇదివరకే సుముఖత వ్యక్తం చేసిన చేసింది. ఇక తమిళనాడులో తొలిరోజు మద్యం విక్రయాలు రికార్డు స్దాయిలో రూ 170 కోట్ల మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 600 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (172 కోట్ల మద్యం అమ్మకాలు)
Comments
Please login to add a commentAdd a comment