సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న ఏకసభ్య ఆర్ముగస్వామి కమిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అపోలో వైద్యులను కూడా విచారించేందుకు జస్టిస్ ఆర్ముగ స్వామి పూనుకోవడంతో అపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆర్ముగ స్వామి ఒక్కరే కాకుండా స్వచ్ఛంద వైద్య నిపుణుల బృందం, ప్రత్యేక నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి వైద్యులను విచారించాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు అపోలో అభ్యర్థనను తోసిపుచ్చడంతో అపోలో సుప్రీంను ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment