సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట | Isha Foundation moves SC challenging Madras HC order | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట

Published Thu, Oct 3 2024 12:08 PM | Last Updated on Thu, Oct 3 2024 1:34 PM

Isha Foundation moves SC challenging Madras HC order

ఢిల్లీ: ఈశా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను సమర్పించాలని ఇటీవల పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. ఈశా ఫౌండేషన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆశ్రమంలో పోలీసుల సోదాలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మహిళలతో ఆన్‌లైన్‌లో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో  ఉంటున్నామని ఇద్దరు యువతులు తెలిపారు. 

ఈశా యోగా ఆశ్రమంలో తమిళనాడు  పోలీసులు  ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఇక.. ఈ కేసులో పూర్తి స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

ఇక.. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రాన్ని మంగళవారం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది  ప్రభుత్వ అధికారులతో కూడిన  బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

చదవండి: కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement