న్యూఢిల్లీ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపవద్దంటూ తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీని వల్ల ఆదాయంలో భారీ నష్టాలు వస్తాయని తమ పిటిషన్‌లో పేర్కొంది. భౌతిక దూరం పాటించడం లేదని, కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉన్నందున మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ కొంతమంది లాయర్లు వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారించిన మద్రాస్ హైకోర్టు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ, కావాలంటే ఆన్‌లైన్‌లో అమ్మాల్సిందిగా తీర్పునిచ్చింది. అయితే అన్నిచోట్లా ఆన్‌లైన్‌లో అమ్మడం సాధ్యం కాదని, అందుకే మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వ నియమని బంధనల మేరకే తాము మద్యం అమ్మకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తమ పిటిషన్ లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment