ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లిక్కర్‌ను విక్రయిస్తున్న స్థావరాలపై మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ బీ.ఎల్. రేణుక తెలిపిన వివరాల ప్రకారం.. డిప్యూటీ కమీషనర్ వివేకానందరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణికాలనీ రోడ్డు నంబర్ -14లో ఆర్. పాండు (42), అతని భార్య జుక్కుబాయి (38) నివాసంలో తనిఖీలు చేయగా 26 మద్యబాటిళ్లు పట్టుబడ్డాయి. సాయంత్రం మరోసారి నిర్వహించిన దాడుల్లో అదేప్రాంతానికి చెందిన ఆర్. రాజు(32) ఇంటిలో 25 లిక్కర్ క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్య విక్రయదారులు ముగ్గురిపై కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని తొందరలోనే వారి పట్టుకుంటామని సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్సైలు దుబ్బాక శంకర్, నరేష్‌కుమార్, కానిస్టేబుల్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.