
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో లిక్కర్ వినియోగం నెలనెలా పెరుగుతోంది. గత మూడు నెలల మద్యం అమ్మకాలను పరిశీలి స్తే ప్రతినెలా 2 లక్షల కేసులు.. అంటే రోజుకు దా దాపు 7వేల కేసుల లిక్కర్ ఎక్కువగా అమ్ముడవుతోంది. మేలో 26 లక్షల కేసులు పైగా అమ్ముడు పోగా.. జూన్‌లో 28 లక్షల కేసులు, జూలైలో ఏకం గా 31 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగాయి. కానీ బీర్ విక్రయాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మేలో 23.22 లక్షల బీర్లు తాగగా, జూన్‌లో అది 28.77 లక్షల కేసులకు పెరిగింది. జూలైలో మాత్రం ఏకంగా 6 లక్షల కేసులు తగ్గి కేవలం 22.99 లక్షలకు మాత్రమే పరిమితమైంది. వాతావరణం చల్లబడడం, వర్షాలు ప్రారంభం కావడంతోనే జూన్‌తో పోలిస్తే జూలైలో బీర్ల విక్రయాలు తగ్గాయని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి.
ఖజానాకు కాసుల కిక్కు..
ఇక మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం నెలనెలా పెరుగుతోందని ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మేలో రూ.2,270 కోట్లు, జూన్‌లో రూ.2,391 కోట్లు, జూలైలో రూ.2,506 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే గత మూడు నెలల్లో నెలకు రూ.100 కోట్లు కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆ మేరకు ఆదాయం పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment