లక్నో : మందుబాబులకు ఉత్తరప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ర్టంలో మాల్స్‌లో విదేశీ మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు రిటైల్ షాపులలో మాత్రమే అమ్ముడవుతున్న లిక్కర్ ఇకపై మాల్స్‌లోనూ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కేవలం సీల్డ్ సీసాల్లో మద్యం అమ్మకాలు జరపాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాల్స్‌లో లిక్కర్ అమ్మకాలకు సంబంధించి ఎఫ్.ఎల్ -4-సి రూపంలో లైసెన్సులు మంజూరు చేస్తామని రాష్ర్ట ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ భూస్ రెడ్డి వెల్లడించారు.
(‘యోగి ఓ వర్గానికి ముప్పు’ )
అంతేకాకుండా మద్యం అమ్మకాలు జరపాలంటే ఆ ప్రాంగణంలో కనీసం 500 చదరపు అడుగుల విస్తీర్ణంతో వినియోగదారుడిగా సౌకర్యవంతంగా నడవడానికి వీలుండేలా ఉండాలని తెలిపారు. ఎక్సైజ్ అనుమతులు పొందిన మద్యాన్ని మాత్రమే విక్రయించాలని పేర్కొన్నారు. విదేశీ మద్యంతో పాటు జిన్, వైన్, వోడ్కా,రమ్ లాంటి ఇండియన్ బ్రాండ్‌లను కూడా విక్రయాలు అమ్ముకోవచ్చని తాజా ప్రకటనలో తెలిపారు. అయితే కశ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించాలని లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన రాష్ర్ట ఖజానాకు తాజా ఉత్తర్వులతో గణనీయమైన ఆదాయం పొందుతామని ఆశిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది షాపింగ్ మాల్స్‌లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నందున దానిని దృష్టిలో ఉంచుకొని మాల్స్‌లో విదేశీ మద్యం విక్రయాలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. (మాజీ సీఎంకు కరోనా పాజిటివ్.. )
Comments
Please login to add a commentAdd a comment