
బీచ్ ఫెస్టివల్.. బీరు ఫెస్టివల్..!
నిన్న బీచ్ ఫెస్టివల్, లవ్ ఫెస్టివల్ అరుుపోరుు.. నేడు బీర్ ఫెస్టివల్‌ను చంద్రబాబు సర్కారు నిర్వహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
- తాగండి.. ఊగండి అంటూ ఉత్తర్వులా?
- 470 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: నిన్న బీచ్ ఫెస్టివల్, లవ్ ఫెస్టివల్ అరుుపోరుు.. నేడు బీర్ ఫెస్టివల్‌ను చంద్రబాబు సర్కారు నిర్వహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిస్తూ జారీ చేసిన జీవో 470 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు లిక్కర్ ఏజెంట్‌లా మారి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తూ.. రెండున్నర కోట్ల మహిళల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోచుకునేందుకు కుట్ర..
తెలుగుజాతిని మద్యం మత్తులో ఉంచి రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని పద్మ ఆరోపించారు.ఇప్పటికే రాష్ట్రం నేరాల్లో టాప్ అవ్వడానికి మద్యం అమ్మకాలే కారణమని గుర్తుంచుకోవాలని సూచించారు.తాగండి.. తాగి ఊగండి.. అన్న చందాన 420 సర్కారు.. 470 జీవోను అమలుపర్చడం సిగ్గుచేటన్నారు.
మత్తుగా తూలితే చాలు..
రాష్ట్రం ఎలా పోరుునా పర్వాలేదు.. జనాలు మత్తుగా తూలితే చాలు.. ఖజానా గలగలలాడాలని కోరుకుంటున్నారని పద్మ మండిపడ్డారు. మొన్నటి దాకా నీరు-మీరు అన్న చంద్రబాబు ఇప్పడు బీరు-బారు అంటూ బహిరంగ నినాదాలిస్తున్నారని చెప్పారు. జాతీయ రహదారుల ప్రక్కన 100 మీటర్ల లోపు మద్యం అమ్మకాలు ఉండకూడదన్న సుప్రీంకోర్టు నిర్దేశాలను పట్టించుకోకుండా, లెసైన్‌సలు ఇవ్వటానికి సిద్ధపడిందని ఆరోపించారు. మహిళల కన్నీళ్ల మీద నారా వారి సామ్రాజ్యాన్ని కట్టడానికి, అందులో లోకేష్‌ను కూర్చోబెట్టడానికియ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.