'బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు'
విజయవాడ: ఆదాయ వనరుల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా విజయవాడలో సమీక్షించారు. ఈ ఏడాది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 12 శాతం వృద్ధిరేటు ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. సీఆర్డీఏ నిబంధనల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తక్కువ ఆదాయముందని సీఎంకు తెలిపారు.
రాష్ట్రంలోని బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు ఇచ్చే విధానం అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆరు శాఖల్లో 13.5 శాతం వృద్ధి కన్పించిందని ఆర్థికశాఖ అధికారులు వివరించగా, శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆర్థికశాఖ శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించాలని చంద్రబాబు వారికి సూచించారు.