సాక్షి, విజయవాడ: ఏపీ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను(సెబ్) ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సెబ్ విభాగానికి కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సెబ్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని, ఫర్నిచర్, వాహనాలను, సీజ్ చేసిన వస్తువులను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని పేర్కొంది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే త్వరలో మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెబ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం గత ప్రభుత్వం ఈ సెబ్‌ను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా సెబ్ పని చేసింది. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం ఉద్యోగులను.. సిబ్బందిని సెబ్‌కు కేటాయించింది. బెల్టు షాపులు, గంజాయి నియంత్రణ కోసం సెబ్ పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment