
కర్నూలు: ప్రభుత్వం చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో మద్యం వినియోగం భారీగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణరెడ్డి తెలిపారు. కర్నూలులోని హరిత హోటల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను జాగృతం చేయడం ద్వారానే మద్యం నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.
మద్యం అక్రమాలపై 14500 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రగ్స్, మత్తు పానీయాలపై విద్యార్థులు, యువకులను జాగృతం చేసేందుకు కర్నూలు నగరం నుంచి నవంబర్ నెల 1వ తేదీన కళాజాత ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment