![Hyderabad: Liquor worth Rs 100 crore Sales on Sankranthi - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/18/alcooo.jpg.webp?itok=gdQegXL7)
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా గ్రేటర్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయి. మూడు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే అమ్మకాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.55 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరగగా హైదరాబాద్‌లో రూ.25 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడైంది. మేడ్చల్ జిల్లాలో రూ.20 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. సాధారణంగా దసరా, డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment