![Etala Fire On Liquor Sales In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/14/eetala_img.jpg.webp?itok=ohPi4vXd)
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో గుడుంబా సీసాలు పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏటా రూ.10,700 కోట్లున్న మద్యం ఆదాయం.. ఇప్పుడు రూ.45 వేల కోట్లకు చేరిందని ఆరోపించారు.
మాజీ మంత్రి చిత్తరంజన్‌తో భేటీ
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత చిత్తరంజన్‌దాస్‌తో కల్వకుర్తిలోని ఆయన నివాసంలో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్‌ను ఈటల బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక ర్తలు, అనుచరులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చిత్తరంజన్‌దాస్ ‘సాక్షి’కి తెలిపారు.
ఇదీ చదవండి: నెలాఖరుకు బీజేపీ తొలి జాబితా?
Comments
Please login to add a commentAdd a comment