11న సాయంత్రం 5 నుంచి మద్యం బంద్‌ | Liquor Shops Banned For 3 Days From May 11th 5 PM In Telangana, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Liquor Banned In Telangana: 11న సాయంత్రం 5 నుంచి మద్యం బంద్‌

Published Fri, May 10 2024 5:15 AM | Last Updated on Fri, May 10 2024 10:43 AM

Liquor bandh on 11th from 5 pm

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు.. అంటే ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ తెలిపారు. 

పోలింగ్‌ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించిన నేపథ్యంలో ఆ మేరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని సైతం పొడిగించాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో.. ఆ రోజు సైతం మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రైడే అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement