రద్దీ ప్రాంతాల్లో రోడ్‌ షోలకు అనుమతి లేదు: CEO వికాస్‌ రాజ్‌ | Telangana CEO Vikas Raj On Loksabha And Cantonment Election Arrangements | Sakshi
Sakshi News home page

రద్దీ ప్రాంతాల్లో రోడ్‌ షోలకు అనుమతి లేదు: CEO వికాస్‌ రాజ్‌

Published Mon, Mar 18 2024 4:56 PM | Last Updated on Mon, Mar 18 2024 6:37 PM

Telangana CEO Vikas Raj On Loksabha And Cantonment Election Arrangements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో సీఈఓ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోసం లక్షా 80 వేల సిబ్బంది అవసరమని తెలిపారు.

ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్‌ ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8,58,491 ఓట్లు తొలగించామని అన్నారు.  పోలీస్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారన్నారు.

  • ke\\రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉంటే.. 8 లక్షల కొత్త యువ ఓటర్లు ఉన్నారు.
  • ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం ఉంటుంది.
  • నామినేషన్ ఉపసంహరణ తరువాత రోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుంది.
  • పోస్టల్ ఓటింగ్ కొత్త సాప్ట్ వేర్ ద్వారా ఈసారి నిర్వహిస్తున్నాం.
  • ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయింది.
  • EVM లు సిద్ధంగా ఉన్నాయి. రిజర్వ్ కూడా ఉంచాం.
  • 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం.
  • 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్స్ ఉండాలి లేదంటే సీజ్ చేస్తారు.
  • ఫిర్యాదులు c - విజిల్ app లేదా 1950కి ఫిర్యాదు చేయొచ్చు.
  • రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్ ద్వారా తీసుకోవాలి.
  • 7 లక్షల ఓటర్ కరెక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నికల తరువాత చేశాంము.
  • చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి.
  • రోడ్ షో లు సెలవు రోజుల్లోనే.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షో లకు అనుమతి లేదు.
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్‌లు వాడటానికి లేదు.
  • ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్‌లకు అనుమతి లేదు.
  • మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక  ప్రాసెస్ జరుగుతోంది...షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement