
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్ చేశారు.
కాగా, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు.
ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం. జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్ విజయవంతంగా నిర్వహించాం. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు.