సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణకు రానున్నారు.
కాగా, ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ నెల 30, వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. కొన్ని జిల్లాలను కలిపే విధంగా సభలను ప్లాన్ చేశారు స్థానిక బీజేపీ నేతలు.
ఇక, ఈనెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో బీజేపీ సభకు ఉండనుంది. ఈ సభకు మోదీ హాజరుకానున్నారు. అలాగే, అదే రోజున సాయంత్రం మోదీ.. ఐటీ ఉద్యోగులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమావేశం కానున్నారు. ఇక, మే మూడో తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్లగొండ పార్లమెంట్‌లను కలుపుతూ మరో సభలో మోదీ పాల్గొంటారు. మరోవైపు.. మే నాలుగో తేదీన మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నారాయణపేటలో, చేవేళ్ల పార్లమెంట్‌లో వికారాబాద్ సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment