తెలంగాణలో ‘కిక్కు’ తక్కువే!
ఐఎంఎల్ విక్రయాలు సీమాంధ్రలోనే అధికం
సీమాంధ్రలో రూ.10,972 కోట్ల మద్యం విక్రయాలు
గ్రేటర్‌ను మినహాయిస్తే తెలంగాణ జిల్లాల్లో రూ.5 వేల కోట్ల అమ్మకాలే
బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్
ఏకంగా 2.75 కోట్ల కేసుల బీర్లు అమ్మకాలు
2013-14 ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలివీ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలవారీగా జరిగిన మద్యం విక్రయూలపై ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎక్సైజ్, మద్యం విక్రయూలపై లభించే వ్యాట్ ఆదాయూల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చునని తేలుతోంది. ఈ మద్యం విక్రయాల్లోనూ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎల్ (ఇండియున్ మేడ్ లిక్కర్) విక్రయూలు సీవూంధ్రలో అధికంగా ఉండగా... బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్‌లో ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల అమ్మకాలు గణనీయుంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా కోటి కేసుల బీరును లాగించేశారు! భారత తయారీ మద్యం (ఐఎంఎల్) మూడు రకాలుగా తయారవుతుంది.
బాందీ, విస్కీ మొదలైన ఈ బ్రాండ్లలో ఆర్డినరీ, మీడియం, ప్రీమియం విభాగాలుగా తయారవుతుంది. మూడు రకాల లిక్కర్ అమ్మకాల్లోనూ తెలంగాణ కన్నా సీమాంధ్ర ముం దుంది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 47.11 లక్షల మద్యం కేసులు అమ్ముడైతే, రెండు, మూడు స్థానాల్లో హైదరాబాద్, కరీంనగర్ నిలిచాయి. సీమాంధ్రలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 29.84 లక్షల ఐఎంఎల్ పెట్టెలు అమ్ముడయ్యాయి. మరో ఏడు జిల్లాల్లో 25 లక్షల నుంచి 29 లక్షల చొప్పున మద్యం పెట్టెలు విక్రయించడం గమనార్హం. మొత్తంగా తీసుకుంటే రెండు ప్రాంతాల్లో కలిపి 4.74 కోట్ల ఐఎంఎల్ అమ్మకాలు ఉంటే, అందులో సీమాంధ్రలో 2.83 కోట్లు, తెలంగాణలోని 8 జిల్లాల్లో 1.23 కోట్లు, హైదరాబాద్, రంగారెడ్డిలో 76.64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఐఎంఎల్ విక్రయాలు సాగాయి.
బీరులో తెలంగాణ జోరు..
వేసవిలోనే ఎక్కువగా సాగే బీర్ల అమ్మకాలు గ్రేటర్ సహా తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. తెలంగాణలో 2.75 కోట్ల బీర్ల పెట్టెలు (ఒక్కో పెట్టెకు 12 చొప్పున) విక్రయించగా, సీమాంధ్రలో ఆ సంఖ్య 1.65 కోట్లకే పరిమితమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కోటికిపైగా పెట్టెల బీర్లు విక్రయించడం గమనార్హం. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత బీర్ల అమ్మకాల్లో కరీంనగర్ ముందుండగా, సీమాంధ్రలో వైజాగ్ 21.93 లక్షల పెట్టెల విక్రయాలతో ముందుంది. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల బీర్ల పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి.
మరికొన్ని ముఖ్యాంశాలు..
ఏడాదిలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగిన జిల్లాలు తెలంగాణలో రంగారెడ్డి (రూ.2,403.12 కోట్లు), హైదరాబాద్(రూ.1,533.82 కోట్లు), కరీంనగర్(రూ.1,064.17 కోట్లు) ఉన్నాయి. సీమాంధ్రలో విశాఖపట్నం(రూ.1,194.66 కోట్లు), తూర్పు గోదావరి(రూ.1,114.62 కోట్లు), గుంటూరు(రూ.1,102.16కోట్లు), కృష్ణా(రూ.1,068.15 కోట్లు), చిత్తూరు(రూ.1,001.36 కోట్లు) ఉన్నాయి.
రూ.474.98 కోట్లతో అత్యల్ప మద్యం విక్రయాలు సాగిన జిల్లాగా నిజామాబాద్ నిలిచింది.
2012- 13 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తరహాలో విక్రయాలు సాగాయి. ఆ సంవత్సరం సీమాంధ్రలో రూ.9,534.58 కోట్ల విక్రయాలు జరగ్గా.. తెలంగాణలో 8,575 .65 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.3,500 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే నికరంగా తెలంగాణలో 2012-13లో జరిగిన మద్యం విక్రయాలు రూ.5 వేల కోట్ల పైచిలుకు మాత్రమే.